69 ఏళ్లు.. 6వేల కిలోమీటర్ల ప్రయాణం | Rajasthan man on a cycle tour across county | Sakshi
Sakshi News home page

69 ఏళ్లు.. 6వేల కిలోమీటర్ల ప్రయాణం

Published Thu, Oct 27 2016 11:04 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

69 ఏళ్లు.. 6వేల కిలోమీటర్ల ప్రయాణం - Sakshi

69 ఏళ్లు.. 6వేల కిలోమీటర్ల ప్రయాణం

  • జైపూర్‌ టు జైపూర్‌ లిమ్కా బుక్‌ రికార్డు కోసం ప్రయాణ
  •  నెల్లూరు, సిటీ:
    రాజస్థాన్‌కు చెందిన కరమ్‌సింగ్‌ జగత్‌ 69 వయసులో 6వేల కిలో మీటర్ల సైకిల్‌పై ప్రయాణం ప్రారంభించారు. గత నెల 22వ తేదీన తన ప్రాయాణం ప్రారంభించారు. ఇప్పటికే గుజరాత్, కలకత్తా, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలను చుట్టేశారు. ఈ క్రమంలో గురువారం నెల్లూరు హైవే పై తన ప్రయాణాన్ని కొనసాగించారు. చిల్డ్రన్స్‌పార్క్‌ వద్ద నెల్లూరు వాసులతో కొంతసేపు తన  అనుభవనాలను పంచుకున్నారు. శాఖాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఇప్పటికే 3వేల కి.మీలు ప్రయాణం చేసినట్లు పేర్కొన్నారు. తన ప్రాంతమైన జైపూర్‌ నుంచి తిరిగి జైపూర్‌వరకు అన్ని రాష్ట్రాలను చుట్టేసే కార్యక్రమం చేపట్టారు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డును సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సూపర్‌ సీనియర్‌ అనే పేరుతో  ర్యాలీ చేపట్టారు. లక్ష్యం ఆకాశం కంటే ఉన్నతంగా ఉన్నప్పుడు వయస్సు సంబంధం లేదని తన అభిప్రాయం. నవంబర్‌ 10వ తేదీకి తన ప్రయాణం ముగియనున్నట్లు పేర్కొన్నారు. 
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement