cycle trip
-
50 రోజులు.. 5 వేల కిలోమీటర్లు
యాదగిరిగుట్ట: ఆస్ట్రియా దేశానికి చెందిన ఇంజినీర్ హెన్స్‌పీటర్ ఢిల్లీ నుంచి యాదాద్రి వరకు చేపట్టిన సైకిల్‌యాత్ర ఆదివారం యాదగిరిగుట్ట పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా హెన్స్‌పీటర్ శ్రీభోదనందగిరి గో ఆశ్రమ పీఠాధిపతి బోదనందగిరి స్వామిజీని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వంటలు అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. వివిధ ప్రాంతాల ప్రజలను కలిసి వారిగురించి తెలుసుకునేందుకు ఆస్ట్రియా నుంచి సైకిల్ యాత్ర చేపట్టానని వివరించారు. పాకిస్తాన్ సరిహద్దు దగ్గర పరిస్థితులు అనుకూలించకపోవడంతో విమానంలో దుబాయ్ చేరుకొని, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడించారు. ఢిల్లీ నుంచి యాదాద్రికి తిరిగి సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 50 రోజుల్లో 5 వేల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించినట్లు వివరించారు. యాదాద్రి క్షేత్రాన్ని మంగళవారం సందర్శించనున్నట్టు తెలిపారు. -
తండ్రి సాహసం: బిడ్డకు ప్రేమతో 300 కి.మీ సైకిల్‌పై..
మైసూరు: కుమారునికి అనారోగ్యంగా ఉండడంతో కావలసిన మందుల కోసం ఓ తండ్రి సైకిల్‌పై సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకు వెళ్లి మందులు తీసుకొచ్చాడు. తండ్రి ప్రేమను చాటే ఈ సంఘటన మైసూరు జిల్లా టి.నరిసిపురలో చోటు చేసుకుంది. ఆనంద్ (45) తన పదేళ్ల కొడుకును కాపాడుకోవడం కోసం బెంగళూరులోని నిమ్హాన్స్కు సైకిల్‌పై వెళ్లి మందులు తీసుకొని తిరిగి వచ్చాడు. కుమారుడు దివ్యాంగుడు కావడంతో పాటు ఇటీవల జబ్బు పడ్డాడు. డాక్టర్లు రాసిన మందులు మైసూరులో దొరకలేదు. లాక్డౌన్ కావడంతో బెంగళూరుకు వెళ్లడానికి ఎటువంటి రవాణా వసతులు లేవు. దీంతో సైకిల్‌నే ఆశ్రయించాడు. -
సైకిల్ యాత్రకు మనోళ్లు
రాయదుర్గం: ప్రపంచంలో అతిపురాతనమైన సైకిల్ యాత్రలో నగరవాసులు పాల్గొననున్నారు. ఈ నెల 18–22 వరకు ప్యారిస్‌లో నిర్వహించనున్న ‘ప్యారిస్–బ్రెస్ట్–ప్యారిస్’ సైకిల్ యాత్రలో పాలుపంచుకోనున్నారు. ఈ యాత్రలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 6వేల మంది పాల్గొంటారు. ఇందులో పాల్గొనే అవకాశం 320 మంది భారతీయులకు దక్కగా... వారిలో 30 మంది హైదరాబాద్ సైక్లిస్టులు కావడం విశేషం. వీరిలో అధిక శాతం మంది గచ్చిబౌలి పరిసరాల్లోని ఐటీ ఉద్యోగులుండడం గమనార్హం. వీరు ఈ నెల 14న ప్యారిస్‌కు వెళ్లనున్నారు. ఈ సైకిల్ యాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. నాలుగు రోజుల పాటు నిర్విరామంగా 90 గంటలు.. 765 మైళ్లు (1,230 కిలోమీటర్లు) వెంబడి ఈ యాత్ర కొనసాగుతుంది. దీన్ని 1891లో ప్రారంభించగా మొదట్లో దశాబ్దానికోసారి నిర్వహించేవారు. అయితే 1951 నుంచి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో పాల్గొనే సైక్లిస్ట్‌లను బ్రివర్ట్, అడాక్స్ అని రెండు వర్గాలుగా విభజిస్తారు. బ్రివర్ట్లను ప్రొఫెషనల్స్‌గా పరిగణిస్తారు. వీరు తమ ప్రయాణాన్ని ఒంటరిగా నాలుగు రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రయాణంలో అవసరమైన సామగ్రిని నిర్దేశించిన తనిఖీ కేంద్రాలలో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అడాక్స్ పైవర్గానికి భిన్నంగా సమూహంగా ప్రయాణం చేస్తారు. అదే నా కోరిక ఇప్పటి వరకు 21 బ్రేవెట్స్‌లో పాల్గొని 19 విజయవంతంగా పూర్తి చేశాను. ఇప్పుడు ప్యారిస్‌లో యాత్రలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉన్నాను. ప్రత్యేకంగా ఎలాంటి ప్రాక్టీస్ చేయడం లేదు. నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. రోజూ కార్యాలయానికి, మార్కెట్‌కు ఇతరత్రా పనులకు సైకిల్ వినియోగిస్తాను. భారత్ సైక్లింగ్‌కు స్వర్గధామం కావాలన్నదే మా కోరిక. అలాగే ఎకో ఫ్రెండ్లీ సైక్లింగ్ జరగాలన్నదే లక్ష్యం. – మణికంఠ కార్తీక్, సైక్లిస్ట్ నాలుగేళ్లుగా.. ప్యారిస్‌లో యాత్రలో పాల్గొనేందుకు నాలుగేళ్లుగా సాధన చేస్తున్నాను. ఇప్పటి వరకు 23 బ్రేవెట్స్‌లో పాల్గొన్నాను. ఈ పురాతన సైకిల్ యాత్రలో పాల్గొననున్నందుకు గర్వంగా ఉంది. భారత్ నుంచి 320 మంది ఉంటే... వారిలో 30 మంది హైదరాబాదీలు కావడం గర్వకారణం. – నవీన్ కొమ్ముకూరి, సీనియర్ సైక్లిస్ట్ 15 నెలలుగా... ప్యారిస్ సైకిల్ యాత్రలో పాల్గొనేందుకు 15 నెలలుగా సాధన చేస్తున్నాను. ఇప్పటి వరకు 13 బ్రేవెట్లలో పాల్గొన్నాను. ఈసారి పూర్తి సైకిల్‌యాత్ర చేయాలనే సంకల్పంతో ఎదురుచూస్తున్నాను. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు చాలాసార్లు సైకిల్ రైడ్ చేశాను. కానీ ప్రపంచ స్థాయి సైకిల్ యాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. – పృథ్వీకృష్ణ, సీనియర్ సైక్లిస్ట్ -
69 ఏళ్లు.. 6వేల కిలోమీటర్ల ప్రయాణం
జైపూర్ టు జైపూర్ లిమ్కా బుక్ రికార్డు కోసం ప్రయాణ నెల్లూరు, సిటీ: రాజస్థాన్‌కు చెందిన కరమ్‌సింగ్ జగత్ 69 వయసులో 6వేల కిలో మీటర్ల సైకిల్‌పై ప్రయాణం ప్రారంభించారు. గత నెల 22వ తేదీన తన ప్రాయాణం ప్రారంభించారు. ఇప్పటికే గుజరాత్, కలకత్తా, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలను చుట్టేశారు. ఈ క్రమంలో గురువారం నెల్లూరు హైవే పై తన ప్రయాణాన్ని కొనసాగించారు. చిల్డ్రన్స్‌పార్క్ వద్ద నెల్లూరు వాసులతో కొంతసేపు తన అనుభవనాలను పంచుకున్నారు. శాఖాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఇప్పటికే 3వేల కి.మీలు ప్రయాణం చేసినట్లు పేర్కొన్నారు. తన ప్రాంతమైన జైపూర్ నుంచి తిరిగి జైపూర్‌వరకు అన్ని రాష్ట్రాలను చుట్టేసే కార్యక్రమం చేపట్టారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సూపర్ సీనియర్ అనే పేరుతో ర్యాలీ చేపట్టారు. లక్ష్యం ఆకాశం కంటే ఉన్నతంగా ఉన్నప్పుడు వయస్సు సంబంధం లేదని తన అభిప్రాయం. నవంబర్ 10వ తేదీకి తన ప్రయాణం ముగియనున్నట్లు పేర్కొన్నారు.