
కుమారుడి మందుల కోసం సైకిల్‌పై వెళ్తున్న తండ్రి ఆనంద్
మైసూరు: కుమారునికి అనారోగ్యంగా ఉండడంతో కావలసిన మందుల కోసం ఓ తండ్రి సైకిల్‌పై సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకు వెళ్లి మందులు తీసుకొచ్చాడు. తండ్రి ప్రేమను చాటే ఈ సంఘటన మైసూరు జిల్లా టి.నరిసిపురలో చోటు చేసుకుంది. ఆనంద్ (45) తన పదేళ్ల కొడుకును కాపాడుకోవడం కోసం బెంగళూరులోని నిమ్హాన్స్‌కు సైకిల్‌పై వెళ్లి మందులు తీసుకొని తిరిగి వచ్చాడు. కుమారుడు దివ్యాంగుడు కావడంతో పాటు ఇటీవల జబ్బు పడ్డాడు. డాక్టర్లు రాసిన మందులు మైసూరులో దొరకలేదు. లాక్‌డౌన్ కావడంతో బెంగళూరుకు వెళ్లడానికి ఎటువంటి రవాణా వసతులు లేవు. దీంతో సైకిల్‌నే ఆశ్రయించాడు.
Comments
Please login to add a commentAdd a comment