long journey
-
తండ్రి సాహసం: బిడ్డకు ప్రేమతో 300 కి.మీ సైకిల్‌పై..
మైసూరు: కుమారునికి అనారోగ్యంగా ఉండడంతో కావలసిన మందుల కోసం ఓ తండ్రి సైకిల్‌పై సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకు వెళ్లి మందులు తీసుకొచ్చాడు. తండ్రి ప్రేమను చాటే ఈ సంఘటన మైసూరు జిల్లా టి.నరిసిపురలో చోటు చేసుకుంది. ఆనంద్ (45) తన పదేళ్ల కొడుకును కాపాడుకోవడం కోసం బెంగళూరులోని నిమ్హాన్స్కు సైకిల్‌పై వెళ్లి మందులు తీసుకొని తిరిగి వచ్చాడు. కుమారుడు దివ్యాంగుడు కావడంతో పాటు ఇటీవల జబ్బు పడ్డాడు. డాక్టర్లు రాసిన మందులు మైసూరులో దొరకలేదు. లాక్డౌన్ కావడంతో బెంగళూరుకు వెళ్లడానికి ఎటువంటి రవాణా వసతులు లేవు. దీంతో సైకిల్‌నే ఆశ్రయించాడు. -
హైటెక్ కారు బ్యాటరీ
బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ పెట్రోలు లేదా డీజిలుతో నడిచే కార్లు మాత్రమే రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న నానా పరిమితుల కారణంగా వాటి వైపు ఎవరూ పెద్దగా మొగ్గు చూపడం లేదు. వాటికి ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేసినా 50 కిలోమీటర్లకు మించి ప్రయాణించడం కష్టం. పట్టణాలు, నగరాల్లో ఏదో లోకల్ జర్నీలకు తప్ప ఇలాంటి కార్లు లాంగ్ జర్నీలకు ఏమాత్రం అనుకూలం కాదు. అయితే, బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఒక హైటెక్ కారు బ్యాటరీని రూపొందించారు. దీనిని ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే, నిరాటంకంగా 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. ఈ హైటెక్ బ్యాటరీలతో నడిచే కార్లు పెట్రోలు లేదా డీజిలుతో నడిచే కార్లకు దీటుగా రోడ్లపై పరుగులు తీయగలవని, వీటి ఇంధన సాంద్రత మామూలు బ్యాటరీల కంటే 90 శాతం ఎక్కువని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బ్యాటరీలను వారు ‘లిథియం-ఆక్సిజన్’ సమ్మేళనంతో రూపొందించారు. మామూలు కారు బ్యాటరీల కంటే ఇవి చాలా తేలికైనవని అంటున్నారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే లీథియం బ్యాటరీలలో ఇంధన సాంద్రత తక్కువగా ఉండటం వల్ల వాటిని తరచు చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటితో పోలిస్తే, తాము రూపొందించిన లిథియం-ఆక్సిజన్ బ్యాటరీల ఇంధన సాంద్రత పదిరెట్లు ఎక్కువని దీని రూపకల్పన బృందానికి నేతృత్వం వహించిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ క్లేర్ గ్రే చెబుతున్నారు. -
విశాఖ సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
విశాఖపట్నం(ద్వారకానగర్): దూర ప్రాంత ప్రయాణికులు విశాఖ సిటీ బస్సుల్లో ఇకపై ఉచితంగా ప్రయాణించొచ్చు. దూర ప్రాంత బస్..బస్టాండ్‌లో బయలుదేరే సమయానికి రెండు గంటల ముందు నుంచి ఇలా ప్రయాణించేందుకు అవకాశం ఉంది. అలాగే, దూర ప్రాంతాల నుంచి విశాఖ చేరుకున్న వారు కూడా ఈ సౌకర్యం పొందే వీలుంది. అయితే, వారు విశాఖ బస్‌స్టేషన్‌లోని డ్యూటీ కంట్రోలర్ వద్ద ప్రయాణపు టికెట్టుపై స్టాంపు, సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయం నుంచి వారు రెండు గంటల వరకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించినట్లు విశాఖ రీజినల్ మేనేజర్ సుధీష్కుమార్ పేర్కొన్నారు.