పుట్టింది వైజాగ్‌లో.. గడిపింది రాజమండ్రిలోనే..
పుట్టింది వైజాగ్‌లో.. గడిపింది రాజమండ్రిలోనే..
Published Sun, Mar 12 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM
కథానాయకుడు రాజ్‌తరుణ్
కంబాలచెరువు : రాజమహేంద్రవరంలోని కుమారి థియేటర్‌లో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా యూనిట్ శనివారం సందడి చేసింది. చిత్రం విజయయాత్రలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన హీరో రాజ్ తరుణ్ థియేటర్‌లో ప్రేక్షకులతో మాట్లాడుతూ తాను పుట్టింది వైజాగ్‌లో అయినా గడిపిందంతా రాజమండ్రిలోనే అన్నారు. ఈ ప్రాంతంతో తనకు ఎనలేని బంధముందన్నారు. స్నేహితులతో ఎక్కువగా ఇక్కడే గడిపేవాడినని, నా సినిమాని హిట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ తాను ఈ జిల్లాకు చెందినవాడినేని రామచంద్రపురం తన పుట్టిన ఊరు అన్నారు. ఈ సినిమా ఊహించిన దానికంటే మంచి విజయం సాధించిందన్నారు. అనంతరం రాజ్‌తరుణ్ పేక్షకులతో కలిసి థియేటర్‌లో కూర్చుని చిత్రాన్ని తిలకించారు. కార్యక్రమంలో వింటేజ్ క్రియేష¯Œ్స జేకే.రామకృష్ణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement