రవాణా సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే | ransport services in online | Sakshi
Sakshi News home page

రవాణా సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

Published Tue, Aug 2 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

ransport services in online

ఖమ్మం క్రైం: రవాణా శాఖ అందించే మొత్తం 57 సేవలు మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. రవాణా శాఖకు సంబంధించి ఇప్పటివరకు 15 రకాల సేవలే ఆన్‌లైన్‌లో అందుతున్నాయి. ఇకపై మొత్తం 57 సేవలు అందుబాటులోకి వస్తాయి.
దళారీ వ్యవస్థకు కొంతమేరకు చెక్‌
జిల్లాలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థ ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయింది. దీనికి తోడు కార్యాలయాలకు వచ్చే వాహనదారులు గంటలతరబడి వేచి చూడలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతి పెరిగింది. రవాణా సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తే దళారీ వ్యవస్థకు కొంతవరకు చెక్‌ పడుతుంది.
రవాణాశాఖ కార్యాలయాలన్నీ క్యాష్‌లెస్‌
ఆన్‌లైన్‌ సేవలతో జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాలన్నీ క్యాష్‌లెస్‌గా మారతాయి. మీ–సేవ కార్యాలయంలో నిర్ణీత నగదు చెల్లించి ఆన్‌లైన్‌లో సేవలు పొందవచ్చు. రవాణాశాఖ కార్యాలయాల్లో ఎటువంటి నగదు లావాదేవీలు జరగవు.
ఆన్‌లైన్‌లో సేవలు ఇలా పొందవచ్చు
వాహనదారులు లైసెన్స్, ఇతరత్రా సేవలు పొందేందుకు రవాణా శాఖ వెబ్‌సైట్‌(గిగిగి.్టట్చటఞౌట్ట.్ట్ఛl్చnజ్చn్చ.జౌఠి.జీn)లోకి వెళ్లాలి. కావాల్సిన సేవలను ఎంచుకున్న తరువాత, వివరాలతోపాటు వ్యక్తిగత సెల్‌æనెంబర్‌ నమోదు చేయాలి. సంబంధిత సేవ పొందేందుకు  తేదీ, సమయాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత రుసుమును నెట్‌ బ్యాంకింగ్, ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చు. ఈ సదుపాయం లేని వారు తమ ఆన్‌లైన్‌ దరఖాస్తు సంఖ్య ఆధారంగా ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లో 24 గంటల్లో రుసుము చెల్లించాలి. ఆ తరువాత, స్లాట్‌ ఖరారుకు సంబంధించిన సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్‌) మీరు ఇచ్చిన సెల్‌ ఫోన్‌ నంబర్‌కు వస్తుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌తో నిర్ణీత సమయానికి రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి పొందవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement