కళ్యాణదుర్గం : ధనికులతో సమానంగా నిరుపేదలు కూడా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెల్లకార్డు వినియోగదారులకు ఉచితంగా సంక్రాంతి కానుకలను అందజేస్తోంది. అయితే కొందరు డీలర్లు వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కానులను కాజేశారు. మరికొందరు ఇవ్వాల్సిన 6 కానుకల్లో కేవలం నాలుగు లేదా అయిదు సరుకులే పంపిణీ చేసినట్లు సమాచారం.
= కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి 36 వ చౌక డిపోలో మాలమ్మ ( కార్డునం.డబ్ల్యూఏపీ 122303600197), లేపాక్షమ్మ (కార్డు నం.డబ్ల్యూఏపీ122303600136), భూలక్ష్మి (కార్డునం.డబ్ల్యూఏపీ122303600102)లతో పాటు వందలాది మందికి శనగబేడలు ఇవ్వలేదు.
= బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి చౌకడిపో షాప్ నంబర్ 11లో తిప్పేస్వామి (వ్యాప్ 122001011ఏ0025)అనే వినియోగదారునికి బియ్యం వేసి, వేలిముద్ర పడలేదంటూ కానుకలు ఇవ్వలేదు. పిల్లలపల్లి షాప్ నంబర్ 15లో అలివేలమ్మ, గంగన్న దంపతులు (ర్యాప్ 12201500349)కు ఇంతవరకు కానుకలే ఇవ్వలేదు. కుమారుడు అభినాష్ వేలిముద్రలు ఈపాస్‌లో నమోదవుతున్నా డీలర్ వేలిముద్రల సాకుతో కానుకలు ఇవ్వకుండా పంపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 30 శాతంకు పైగానే డీలర్లు కానుకలను కాజేసి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
-----
తనిఖీలు నిర్వహిస్తాం...
చౌకధాన్య డిపోల వారీగా సంక్రాంతి కానుకలు సరఫరా ఆధారంగా వినియోగదారులకు అందాయో లేదో అధికార బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తాం. ప్రతి వినియోగదారుడికి సంక్రాంతి కానుక (ఆరు సరుకులు) ఇవ్వాలి. తప్పుదారి పట్టించినట్లు తనిఖీల్లో తేలితే చర్యలు తప్పవు.
– కేఎస్ రామారావు, ఆర్డీఓ, కళ్యాణదుర్గం
సంక్రాంతి కానుకల్లో డీలర్ల మాయాజాలం
Published Thu, Jan 12 2017 12:13 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement
Advertisement