పునరుత్థానం....భక్తుల ఆనందపరవశం
పునరుత్థానం....భక్తుల ఆనందపరవశం
Published Mon, Apr 17 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM
– భక్తిశ్రద్ధలతో ఈస్టర్
– క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
– ఆకట్టుకున్న క్రీస్తు జన్మదిన నాటక కథలు
– జిల్లా వ్యాప్తంగా సంబరాలు
కర్నూలు సీ క్యాంప్ : ఏసుక్రీస్తు పునరుత్థానుడైన సందర్భంగా ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా చర్చిల్లో వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లాలోని ఆదోని, నంద్యాల, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. సూర్యోదయ ఆరాధనతో ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే నాడు సిలువలో బందీఅయి చనిపోయిన క్రీస్తు తిరిగి లేచి తాను చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడని, దీన్నే విశ్వాస పండుగ అని కూడా క్రైస్తవులు చెబుతుంటారు. నగరంలోని బిషప్‌చర్చి, కోల్స్ సెంటీనియక్ తెలుగు బాప్టిస్ట్ చర్చి, సీఎస్‌ఐ చర్చి, రాక్‌వుడ్ చర్చి, హోసన్న మందిరం, స్టాంటన్, ఇమ్మానియేలు ప్రార్థన మందిరం, లాంటి ప్రధాన ఆలయాల్లో పాస్టర్లు దైవ సందేశం వినిపించారు. ఈస్టర్ అంటే విశ్వాసం, నమ్మకం అని చనిపోడానికి ముందు క్రీస్తు తాను తిరిగిలేస్తానని చెబుతాడని, ఆమాట నిజమైతే పునరుత్థానం ఉంటుందని ఈస్టర్‌నాడు యేసుక్రీస్తు తిరిగి లేచాడుకాబట్టి పునరుత్థానం ఉంటుందని పాస్టర్లు పేర్కొన్నారు. ప్రతి మనిషి విశ్వాసం, ప్రేమ, నమ్మకం, జాలి, కరుణ, కలిగి ఉండాలని అవి లేని వారికి పరలోక రాజ్యం ఉండదని చెప్పారు. ఏటా గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పండుగలు వస్తుంటాయని, పండుగ వచ్చిన ప్రతీసారి ఒక కొత్త నిర్ణయంతో జీవితంలో ముందుకు సాగాలని కోరారు. సాయంత్రం యేసుక్రీస్తును స్మరిస్తూ క్రీస్తుజన్మ ఇతివృత్తంపై క్రైస్తవులు నాటకాలు ప్రదర్శించారు.
Advertisement