reborn
-
అప్పట్లో జైలు.. త్వరలోనే విలాసవంతమైన హోటల్‌గా..!
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సువిశాల భవంతి ఆరేళ్ల కిందటి వరకు జైలుగా ఉండేది. దీనిని 2017 మార్చిలో మూసివేశారు. ఇప్పుడు దీనిని పర్యాటకులకు బస కల్పించే హోటల్‌గా మారుస్తున్నారు. జపాన్‌లో హోన్షు దీవిలోని నారా నగరంలో ఉన్న ఈ జైలు బాల నేరస్థుల కారాగారంగా ఉండేది. దాదాపు 115 ఏళ్ల పాటు ఇది బాల నేరస్థుల కారాగారంగానే కొనసాగింది. ఖైదీలు బాగా తగ్గిపోవడంతో జపాన్ ప్రభుత్వం ఈ జైలును మూసివేసింది. ప్రభుత్వం నుంచి దీనిని ఇటీవల హోషినో రిసార్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. పర్యాటకులను ఆకట్టుకునేలా దీనిని హోటల్‌గా మార్చడానికి సన్నాహాలు ప్రారంభించింది. జైలు నిర్మాణాన్ని పెద్దగా మార్చకుండానే, ఇందులో పర్యాటకులకు ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించింది. అతిథులకు జైలులో బస చేసిన అనుభూతి కలిగించడానికి అనువుగా దీని మౌలిక నిర్మాణంలో మార్పులేవీ చేయడం లేదని, అదనంగా ఆధునిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని హోషినో రిసార్ట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ అసాకో సాటో మీడియాకు చెప్పారు. ఇందులో 48 మంది అతిథులు బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని, హోటల్‌గా మారుస్తున్న జైలు ప్రాంగణంలోని గార్డ్స్ క్వార్టర్లు యథాతథంగా ఉంటాయని, వాటిలో గార్డులు ఎప్పటి మాదిరిగానే ఉంటారని తెలిపారు. ఈ ప్రాంగణంలో రెస్టారెంట్, మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిని 2026 నాటికి ప్రారంభించనున్నట్లు చెప్పారు. (చదవండి: పిల్లల గణతంత్ర ప్రపంచం!) -
ఉక్రెయిన్‌కి ఇది పునర్జన్మ! ఇక రాజీపడేదే లే!: జెలెన్స్కీ
Volodymyr Zelensky emotional speech: రష్యాతో ఆధిపత్యం నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ఇది 'పునర్జన్మ' అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఎప్పటికీ తన పోరాట స్ఫూర్తిని వదులుకోదు అని ఉక్రెయిన్ 31వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం చేసిన ప్రసంగంలో భావోద్వేగంగా మాట్లాడారు. ఈ మేరకు జెలెన్ స్కీ మాట్లాడుతూ... ఫిబ్రవరి 24 తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమైంది యుద్ధం. ఆ రోజు ప్రపంచంలో ఒక కొత్త దేశం కనిపించింది. ఏడ్చి కేకలు వేయని, భయపడని దేశం. తమ దేశాన్ని పరుల వశం కానివ్వం. ఆ దురాక్రమణను అంత తేలిగ్గా మరిచిపోం అని అన్నారు. గత ఆరు నెలల యుద్ధ కాలంలో తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న రష్యాతో ఇక రాజీపడేది లేదని, తాడో పేడో తేల్చుకోవడమేనని నొక్కి చెప్పారు. తలపై తుపాకి పెట్టినా తాము భయపడమని, తమను యుద్ధ ట్యాంకులు, విమానాలు, క్షిపణులు భయపట్టవని, కేవలం తమ స్వేచ్ఛను బంధించే సంకెళ్లను చూసే భయపడతామని అన్నారు. అంతేకాదు 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పంతో పాటు తూర్పున పారిశ్రామిక డాన్బాస్ ప్రాంతంలోని కోల్పోయిన భూభాగాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవ వేళ రష్యా మరింతగా విధ్వసం సృష్టింస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాజధాని కీవ్ వీధులన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. చదవండి: యుద్ధంపై విమర్శ... రష్యాన్ రాజకీయవేత్తపై వేటు..) -
కాంగ్రెస్‌కు పునర్జన్మ లేదు
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు : రాష్ట్రంలో కాంగ్రెస్ పర్టీ బతికి బట్ట కట్టే పరిస్థితే లేదని, ఆ పార్టీకి పునర్జన్మ లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. ఎన్నికల సమయంలో పార్టీల ప్రచారం కోసం నిందలు మోపడం సర్వసాధారణమని, కానీ రాజకీయ మనుగడ కోసం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పెట్టుబడులు రాకుండా ప్రయత్నాలు చేసి రాష్ట్రాభివృద్ధి కుంటు పడితే దాన్ని అస్త్రాలుగా చేసుకుని విషప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 106 చెరువులకు నీరు నింపే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.550 కోట్లతో అధికారులు డీపీఆర్ రూపొందించారని, ముఖ్యమంత్రికి నివేదించి నిధుల విడుదలకు కృషి చేస్తామని తెలిపారు. -
పునరుత్థానం....భక్తుల ఆనందపరవశం
– భక్తిశ్రద్ధలతో ఈస్టర్ – క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు – ఆకట్టుకున్న క్రీస్తు జన్మదిన నాటక కథలు – జిల్లా వ్యాప్తంగా సంబరాలు కర్నూలు సీ క్యాంప్ : ఏసుక్రీస్తు పునరుత్థానుడైన సందర్భంగా ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా చర్చిల్లో వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లాలోని ఆదోని, నంద్యాల, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. సూర్యోదయ ఆరాధనతో ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే నాడు సిలువలో బందీఅయి చనిపోయిన క్రీస్తు తిరిగి లేచి తాను చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడని, దీన్నే విశ్వాస పండుగ అని కూడా క్రైస్తవులు చెబుతుంటారు. నగరంలోని బిషప్చర్చి, కోల్స్ సెంటీనియక్ తెలుగు బాప్టిస్ట్ చర్చి, సీఎస్ఐ చర్చి, రాక్‌వుడ్ చర్చి, హోసన్న మందిరం, స్టాంటన్, ఇమ్మానియేలు ప్రార్థన మందిరం, లాంటి ప్రధాన ఆలయాల్లో పాస్టర్లు దైవ సందేశం వినిపించారు. ఈస్టర్ అంటే విశ్వాసం, నమ్మకం అని చనిపోడానికి ముందు క్రీస్తు తాను తిరిగిలేస్తానని చెబుతాడని, ఆమాట నిజమైతే పునరుత్థానం ఉంటుందని ఈస్టర్‌నాడు యేసుక్రీస్తు తిరిగి లేచాడుకాబట్టి పునరుత్థానం ఉంటుందని పాస్టర్లు పేర్కొన్నారు. ప్రతి మనిషి విశ్వాసం, ప్రేమ, నమ్మకం, జాలి, కరుణ, కలిగి ఉండాలని అవి లేని వారికి పరలోక రాజ్యం ఉండదని చెప్పారు. ఏటా గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పండుగలు వస్తుంటాయని, పండుగ వచ్చిన ప్రతీసారి ఒక కొత్త నిర్ణయంతో జీవితంలో ముందుకు సాగాలని కోరారు. సాయంత్రం యేసుక్రీస్తును స్మరిస్తూ క్రీస్తుజన్మ ఇతివృత్తంపై క్రైస్తవులు నాటకాలు ప్రదర్శించారు. -
100 ఏళ్ల క్రితం చనిపోయి.. మళ్లీ పుట్టాడు
అతనికిప్పుడు నాలుగేళ్లు.. కానీ, వందేళ్ల క్రితమే అతను చనిపోయాడు.. ఇప్పుడు సెకండ్‌లైఫ్ స్టార్ట్ చేశాడు... నిజం.. యూరప్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో అతను రెండోసారి జీవిస్తున్నాడు. అతని పేరు ఎడ్వర్డ్.. తల్లి కడుపులో పుట్టడానికి ముందే అతను జీవించాడు. వందేళ్ల క్రితం వీరుడిగా బతికాడు. మొదటి ప్రపంచ సంగ్రామంలో ఫ్రెంచి సైన్యాలకు బాసటగా నిలిచి వీరమరణం పొందాడు. ఇప్పుడు మళ్లీ జీవిస్తున్నాడు. ఇదేమీ కట్టుకథ కాదు.. నిజం. నాలుగేళ్ల బాలుడు తన పూర్వ జన్మ గురించి చెప్తున్న వాస్తవం.. తల్లిదండ్రులకు.. వైద్యులకు సైతం విస్మయం కలిగించే విచిత్రకథ. ఎడ్వర్డ్ ఆస్ట్రియన్ అనే ఈ నాలుగేళ్ల పిల్లాడికి గొంతులో ఏదో సమస్య రావటంతో అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అతని గొంతులో ఒక గడ్డ ఉందని, దానిచుట్టూ టాన్సిల్స్ ఉన్నాయని తేల్చారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక తల్లి ప్యాట్రీషియా అతను అతి కష్టం మీద అన్న మాట.. ‘నాకు బుల్లెట్ తగిలింది’! అని.. మొదట ప్యాట్రీషియా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. డాక్టర్లు శస్త్రచికిత్స చేయడానికి తేదీ నిర్ణయించారు. మొదటి దశలో గడ్డ చుట్టూ ఉన్న టాన్సిల్స్‌ను తొలగించారు. గొంతు లోని ఇబ్బంది కొంచెం తొలగడంతో ఎడ్వర్డ్ ఒక రోజు అమ్మా నీతో మాట్లాడాలి అన్నాడు. ఈ మాటతో ప్యాట్రీషియాలో ఆనందం మొదలైంది. కానీ ఎడ్వర్డ్ మాటలు విన్నాక భయం, ఆశ్చర్యం ఆమెను వెంటాడాయి. 2015 - 1915... ‘‘మీరు అనుకుంటున్నట్టుగా నా పేరు ఎడ్వర్డ్ కాదు.. జేమ్స్! ఫ్రాన్స్‌లోని మారుమూల పల్లెటూరు మాది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవ్వడంతో కుర్రాళ్లందరిలాగే సైన్యంలో చేరాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. నేను మరణించిన రోజు, ప్రదేశం నాకింకా గుర్తున్నాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన చెట్లతో నిండి ఉంది. అక్కడి వాతావరణం కూడా వాన పడుతూ అసౌకర్యంగా ఉంది. నా చుట్టూ చాలా మంది సైనికులున్నారు. ఒక్కసారిగా శత్రుసైన్యం మాపై ఒక్కసారిగా విరుచుకుపడింది. ఒక బుల్లెట్ వేరే సైనికుడికి తగిలి అతని శరీరంలోంచి బయటకు వచ్చి నా గొంతులో దిగింది. నేను మరణించాను అన్నాడు ఎడ్వర్డ్. ఈ కథ విన్న ప్యాట్రీషియా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అంతే కాదు.. రెండో దశలో టాన్సిల్స్ మధ్యలో ఉన్న గడ్డను తొలగించే ఆపరేషన్ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన ఎడ్వర్డ్ ను పరీక్షించిన వైద్యులకు మరోషాక్. అతని గొంతులోని గడ్డ మాయమైంది. ఇది సహజంగా మాయమయ్యేది కాదని.. ఎలా జరిగిందో అర్థం కావటం లేదని వైద్యులే అవాక్కయ్యారు. పునర్జన్మ గురించి కథలు వినడమే కానీ.. ఎడ్వర్డ్ చెప్పిన కథనం మరింత ఆసక్తికరంగా మారింది. - సాక్షి, సెంట్రల్ డెస్క్