ఊరికేమిచ్చారు? | Recently adopted two years later, some things in the village | Sakshi
Sakshi News home page

ఊరికేమిచ్చారు?

Published Mon, Jul 4 2016 1:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ఊరికేమిచ్చారు? - Sakshi

ఊరికేమిచ్చారు?

స్మార్ట్ విలేజ్.. స్మార్ట్ వార్డు... టీడీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కొత్తలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన పథకం. ఆచరణకు నోచుకోకుండానే అటకెక్కేసింది. దత్తత తీసుకున్న పెద్దలంతా పత్తా లేకుండా పోయారు. కోట్లు కుమ్మరిస్తామన్న ఈ శ్రీమంతులు కాస్తా ఉత్తచేతులు చూపారు. ఆదిలో హడావుడి చేసిన సర్కార్ సైతం ఆ తర్వాత మిన్నకుండిపోయింది. ఆర్నెల్లుగా ఈ వెబ్‌సైట్ మూగబోవడమే ఇందుకు నిదర్శనం.


ముఖ్యమంత్రి మొదలు గ్రామ సర్పంచ్ వరకు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల మొదలు మండల స్థాయి అధికారుల వరకు ఏ ఒక్కరూ వారు దత్తత తీసుకున్న గ్రామాలలో అడుగు పెట్టిన దాఖలాలే లేవు. జేబులో రూపాయి ఖర్చు పెట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగు పెట్టకున్నప్పటికీ తాను దత్తత తీసుకున్న గ్రామంలో రెండేళ్ల తర్వాత ఇటీవలే కొన్ని పనులు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement