విజయవాడ : ఆంధ్రప్రదేశ్కు ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం మంజూరు అయినట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆయన శనివారం కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్ట్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విజయవాడలో త్వరలో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు కానున్నదని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, ఏపీలో రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.
మరోవైపు రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి నేటి ఉదయం విజయవాడలో వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యారు. కాగా 2012లోనే విజయవాడలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విజభన నేపథ్యంలో ఏపీలో మూడు పూర్తి స్థాయి పాస్ పోర్టు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే.