రెఫ్రెషర్‌ కోర్సులు ఉపయుక్తం | Rephresar useful courses | Sakshi
Sakshi News home page

రెఫ్రెషర్‌ కోర్సులు ఉపయుక్తం

Published Wed, Oct 19 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

రెఫ్రెషర్‌ కోర్సులు ఉపయుక్తం

రెఫ్రెషర్‌ కోర్సులు ఉపయుక్తం

వైవీయూ:
రెఫ్రెషర్‌ కోర్సులు అధ్యాపకులకు ఎంతో ఉపయోగపడతాయని కర్నాటక విశ్వవిద్యాలయం విశ్రాంత వైస్‌ చాన్సలర్‌ ఆచార్య శ్రీనివాస్‌ సైదాపూర్‌ పేర్కొన్నారు. మంగళవారం వైవీయూ వృక్షశాస్త్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెఫ్రెషర్‌ కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి అధ్యాపకుడు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఇటువంటి కోర్సులు ఉపయోగపడతాయన్నారు. వైవీయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వై.నజీర్‌అహ్మద్‌ మాట్లాడుతూ వైవీయూలో తొలిసారిగా రెఫ్రషర్‌ కోర్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. కోర్సు సమన్వయకర్త డాక్టర్‌ మధూసూధన్‌రెడ్డి మాట్లాడుతూ కోర్సు ఉద్దేశాలను అభ్యర్థులకు వివరించారు. బెంగుళూరు సైన్స్‌ అకాడమీ గౌరవ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.ఆర్‌. రావు మాట్లాడుతూ రెఫ్రషర్‌ కోర్సుల ద్వారా పరిశోధనలకు కావాల్సిన విషయాలు తెలుస్తాయన్నారు. ప్రిన్సిపల్‌ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి రెఫ్రషర్‌ కోర్సులను మరిన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆచార్య శివన్న జీవపరిణామ సిద్ధాంతం గురించి వివరించారు. వృక్షశాస్త్ర అధ్యాపకులు ఆచార్య షావలీఖాన్, చంద్ర ఓబులరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement