పాలకొండ: ఈ స్థలం మాది అంటూ రెవెన్యూ శాఖ అక్కడ బోర్డు పాతింది. కానీ చాలా ఈజీగా ఆక్రమణదారులు ఆ బోర్డును పీకిపారేశారు. ఈ జాగా ప్రభుత్వానిది అంటూ సాక్షాత్తు ఆర్డీఓనే సరిహద్దులు చూసి మరీ చెప్పారు. కానీ అక్రమార్కులకు ఈ మాటలు పట్టలేదు. ఏ సరిహద్దులు పరిశీలించారో అదే చోట చక్కగా కంచె వేసుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పల్లెత్తి మాట్లాడడం లేదు. పాలకొండలో జరుగుతున్న ఈ ఆక్రమణ సీను అధికార పార్టీ నాయకుల దురాగతాన్ని, అధికారుల నిస్సత్తువను తేటతెల్లం చేస్తోంది.
పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆనుకొని సర్వే నం బర్20/1, 20/2లో సుమారు ముప్పై సెంట్ల స్థలం ఉంది. దీని విలువ రూ.రెండు కోట్లు దాటే ఉంటుంది. ఈ స్థలాన్ని కాజేసేందుకు కొంత కాలం కిందట కొందరు పెద్దలు ప్రయత్నించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో చాలా కష్టపడ్డారు. అయితే అప్పట్లో అధికారులు అడ్డుకోవడంతో వారి పప్పులు ఉడకలేదు. కానీ ఇప్పు డు మళ్లీ అదే సీను రిపీటవుతోంది. కానీ రెవె న్యూ అధికారులు ఈ విషయం పైకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.
ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు ఈ స్థలాన్ని ఓ వ్యక్తికి అప్పగించి నజ రానా పొందేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు సహకారం అందిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల చర్యలు కూడా వీరికి బలం చేకూర్చేలా ఉన్నాయి. గతంలో స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తి ఇప్పుడు దాని చుట్టూ దర్జాగా కంచె వేసుకున్నాడు. అందులో రెవెన్యూ వారు ఇదివరకు ఏర్పాటు చేసిన బోర్డులను కూడా తీసివేశారు.
ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
గతంలో ఒక సారి రెవెన్యూ స్వాధీనం చేసుకున్న స్థలం తిరిగి ఆక్రమణ దారులు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఎందుకు మౌనం గా ఉంటున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆక్రమణదారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి స్థలాన్ని కాజేందుకు మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇందులో లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు ప్రచారం సాగుతోంది. అయితే రెవెన్యూ రికార్డుల్లో రహదారి పోరంబోకుగా ఉన్న ఈ స్థలానికి ఎలాం టి పట్టాలు ఇచ్చేందుకు అనుమతి లేదని అధికారులే చెబుతుండడం విశేషం.
తక్షణ చర్యలు తీసుకుంటాం
రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న స్థలంలో కంచె వేయటంపై ఆర్డీవో రెడ్డి గున్నయ్య వద్ద ’సాక్షి’ ప్రస్తావిస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలోనే ఆక్రమణ దారులపై కేసు నమోదు చేయాలని తెలి పామని, స్థలంలో బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం కంచెను తొలగించేందుకు తహశీల్దార్‌కు ఆ దేశాలు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాజే సేందుకు ప్రయత్నించిన వారి పైన, వారికి సహకరించిన వారిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ముప్పై సెంట్లు మింగేద్దామనే..
Published Sat, Jun 18 2016 12:40 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement