గారకుంటతండాలో తీజ్ పండుగ
గారకుంటతండాలో తీజ్ పండుగ
Published Thu, Jul 21 2016 7:06 PM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM
గారకుంటతండా (గరిడేపల్లి) : మండలంలోని గారకుంటతండాలో గురువారం తీజ్ పండుగను గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు మోతీ మాట్లాడుతూ గిరిజనులు సంప్రదాయబద్ధంగా ప్రతిఏటా జరుపుకునే పండుగే తీజ్ అన్నారు. తీజ్ ఉత్సవాలను జరుపుకునేందుకు ప్రభుత్వం గిరిజన తండాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుజాత, సక్రు లకుపతి, సురభి వెంకన్న, దశరథ నాయక్, పూల్‌సింగ్, డేంజర్, భవాని, మంగి పాల్గొన్నారు.
Advertisement
Advertisement