సూచిక బోర్డులేవీ?
• అందోలు, అన్నాసాగర్ మూలమలుపుల వద్ద తరచూ ప్రమాదాలు
• పట్టించుకోని అధికారులు
జోగిపేట: అందోలు మండల పరిధిలోని అందోలు, అన్నాసాగర్ గ్రామాల శివారుల్లో గల మూలమలుపుల వద్ద ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నారుు. అందోలు ఎస్టీ హాస్టల్, జోగిపేట ఫైర్‌స్టేషన్, అన్నాసాగర్ చెరువు కట్ట టర్నింగ్ వద్ద ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ మూల మలుపుల వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటి వరకు 10 మందికిపైగా మరణించిన సంఘటనలున్నారుు. అన్నాసాగర్ అలుగు వద్ద బైపాస్ రోడ్డు వైపు బైక్‌ను మలుపుతుండగా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు సారుులు మరణించారు.
ఫైర్ స్టేషన్ వద్ద మూల మలుపులోనే ఎక్కువ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోరుున సంఘటనలున్నారుు. సంగారెడ్డి వైపు నుంచి జోగిపేట హౌసింగ్ బోర్డు వద్ద గల మూలమలుపు వద్ద పెద్ద మట్టిగడ్డ ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నారుు. ఫైర్‌స్టేషన్ ముందు వాహనాలను మలుపుకోవడానికి వీలుగా రోడ్డును వదలడంతో సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు కనిపించడం లేదు. అందోలు ఎస్టీ హాస్టల్ వద్ద రోడ్డు పక్కన ముళ్ల పొదళ్లు ఏపుగా పెరగడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నారుు. సింగిల్ రోడ్డు కావడంతో జోగిపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారుు.
అన్నాసాగర్ చెరువు కట్ట ప్రమాదకరమే..
అన్నాసాగర్ చెరువుకట్టపై ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు జరిగారుు. జోగిపేట వైపు నుంచి నారాయణఖేడ్ వెళ్లే వాహనాలు చాలా వరకు ప్రమాదానికి గురయ్యారుు. నారాయణఖేడ్ వైపు నుంచి జోగిపేటకు వెళ్తుండగా టర్నింగ్‌లో బ్రిడ్జిపై అదుపుతప్పి కిందకు పడి ప్రమాదాలు జరిగారుు. రాత్రిపూట జోగిపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎడమ వైపు టర్నింగ్ కాకపోవడంతో ఎదురుగా దూసుకుపోరుు ప్రమాదానికి గురై ప్రాణనష్టం జరిగిన సంఘటనలున్నారుు. నారాయణఖేడ్ నుంచి జోగిపేటకు వ స్తుండగా చెరువుకట్టపై ప్రమాదాలు జరిగారుు. సూచిక బోర్డులు లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నారుు. అధికారులు స్పందించి మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పా టు చేయాలని స్థానికులు కోరుతున్నారు.