Suburbs
-
ఔటర్.. సూపర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతోంది. కొత్త గహాల లాంచింగ్స్‌లో ప్రధాన నగరంలో కంటే ఔటర్ ప్రాంతాలదే హవా కొనసాగుతుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 30,340 గృహాలు లాంచింగ్ కాగా.. ఇందులో 45 శాతం ఔటర్ ప్రాంతాల్లోనే ప్రారంభమయ్యాయి. మేడ్చల్, మియాపూర్, నిజాంపేట, శంషాబాద్, కోకాపేట, పటాన్చెరు, తెల్లాపూర్ శివార్లలోనే కేంద్రీకృతమయ్యాయి. ఎఫ్వై 19లోని మొత్తం 18,460 యూనిట్లలో 35 శాతం శివారుల్లోనే లాంచింగ్ అయ్యాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ తెలిపింది. 58 శాతం హౌసింగ్స్ ఔటర్‌లోనే.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021 ఆర్థ్ధిక సంవత్సరంలో 1.49 లక్షల గృహాలు లాంచింగ్ కాగా.. ఇందులో 58 శాతం శివారు ప్రాంతాలలోనే ప్రారంభమయ్యాయి. ఎఫ్వై20లో 2.07 లక్షల యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో 53 శాతం, అలాగే ఎఫ్వై 19లో 2.29 లక్షల ఇళ్లు ప్రారంభం కాగా.. ఇందులో 51 శాతం గృహాలు శివారు ప్రాంతాల్లోనే లాంచింగ్ అయ్యాయి. శివారు ప్రాంతాలలో ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌లో పుణే ప్రథమ స్థానంలో.. కోల్‌కతా చివరి స్థానంలో నిలిచింది. ఎఫ్వై 21లో పుణేలో 29,950 గృహాలు ప్రారంభం కాగా.. 76 శాతం ముల్శీ, పిరంగట్, దౌండ్, కంషేట్, రావేట్, చకాన్, చికాళీ, వాడ్గావ్ బుద్రక్, తలేగావ్ దభాడే, ఉంద్రీ శివారుల్లోనే ఉన్నాయి. -
Hyderabad Real Estate: శివారు జోరు!
సాక్షి, హైదరాబాద్: శివారు ప్రాంతాలలో రియల్టీ జోరు కొనసాగుతుంది. పరిధిలోనే కాదు.. కొత్త గృహాల ప్రారంభాల్లోనూ శివారు ప్రాంతాలు ప్రధాన నగరాన్ని దాటేశాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 30,340 గృహాలు లాంచింగ్ కాగా.. ఇందులో 45 శాతం ఔటర్ ప్రాంతాల్లోనే ప్రారంభమయ్యాయి. మేడ్చల్, మియాపూర్, నిజాంపేట, శంషాబాద్, కోకాపేట, పటాన్చెరు, తెల్లాపూర్ శివార్లలోనే కేంద్రీకృతమయ్యాయి. ఎఫ్వై 19లోని మొత్తం 18,460 యూనిట్లలో 35 శాతం శివారుల్లోనే లాంచింగ్ అయ్యాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ తెలిపింది. పుణే ఫస్ట్, కోల్‌కతా లాస్ట్.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021) 1.49 లక్షల గృహాలు లాంచింగ్ కాగా.. ఇందులో 58 శాతం శివారు ప్రాంతాలలోనే ప్రారంభమయ్యాయి. ఎఫ్వై 20లో 2.07 లక్షల యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో 53 శాతం, అలాగే ఎఫ్వై 19లో 2.29 లక్షల ఇళ్లు ప్రారంభం కాగా.. ఇందులో 51 శాతం గృహాలు శివారు ప్రాంతాల్లోనే లాంచింగ్ అయ్యాయి. శివారు ప్రాంతాలలో ప్రాజెక్ట్స్ల లాంచింగ్స్‌లో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. కోల్‌కతా చివరి స్థానంలో నిలిచింది. ఎఫ్వై 21లో పుణేలో 29,950 గృహాలు ప్రారంభం కాగా.. ఇందులో 76 శాతం ముల్శీ, పిరంగట్, దౌండ్, కంషేట్, రావేట్, చకాన్, చికాళీ, వాడ్గావ్ బుద్రక్, తలేగావ్ దభాడే, ఉంద్రీ శివారుల్లోనే ఉన్నాయి. ఎఫ్వై 19లోని 39,210 హౌసింగ్‌లో ఔటర్ వాటా 67 శాతం. కోల్‌కతాలో 4,250 గృహాలు లాంచింగ్ కాగా.. కేవలం 26 శాతం యూనిట్లు బరాసత్, బరాక్‌పూర్, సెరాంపూర్, గారియా, హౌరాల్లోనే ప్రారంభమయ్యాయి. ఇతర నగరాల్లో.. ► ఎఫ్వై 21లో ముంబైలో 34,620 యూనిట్లు లాంచింగ్ కాగా.. 67 శాతం గృహాలు పన్వేల్, పాల్ఘర్, వాసాయి, విరార్, బద్లాపూర్, భీవండి, డొంబివ్లీ ప్రాంతాలలోనే ప్రారంభమయ్యాయి. ఎఫ్వై 19లో వీటి వాటా 60 శాతంగా ఉంది. ► ఎన్సీఆర్లోని 19,090 గృహాలలో 57 శాతం సోహ్నా, గ్రేటర్ నోయిడా వెస్ట్, యమునా ఎక్స్‌ప్రెస్ వేలో ఉన్నాయి. ఎఫ్వై 19లోని మొత్తం 29,500 యూనిట్లలో ఔటర్ వాటా 49 శాతం. ► చెన్నైలోని 10,110 యూనిట్లలో 54 శాతం పూనమల్లె, అవడి, వండలూర్, షోలినాగ్నలూర్, గుడువాంచెరి, చెంగల్పట్టు ప్రాంతాలలో జరిగాయి. ఎఫ్వై 19లోని 16,130 యూనిట్లలో 44 శాతం వాటా శివారుదే. ► బెంగళూరులోని 20,520 గృహాలలో 46 శాతం చందపుర–అనెకల్ రోడ్, సర్జాపుర, యలహనక, దేవనహళ్లి, సర్జాపూర్–అట్టిబెల్ రోడ్లో ప్రారంభమయ్యాయి. ఎఫ్వై 19లోని 36,620 గృహాలలో శివారుల వాటా 37 శాతంగా ఉంది. డిమాండ్ ఎందుకంటే? కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారిపోయాయి. గతంలో వాక్–టు–వర్క్ కల్చర్ ప్రాజెక్ట్‌లకు పరుగులు పెట్టిన కస్టమర్లు ప్రస్తుతం విశాలమైన, గ్రీనరీ ఎక్కువగా ఉండే నివాసాలు, వాయు, శబ్ధ కాలుష్యం తక్కు వగా ఉండే ప్రాంతాలలో అఫర్డబుల్ గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్, ఈ–స్కూల్, ఆరోగ్య భద్రత వంటి వసతులున్న ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. శివారు ప్రాంతాలలో ల్యాండ్‌బ్యాంక్ ఉన్న డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని సూచించారు. అంతేకాకండా శివారు, కొత్త ప్రాంతాలలో నివాస సముదాయాల నిర్మాణాలతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్ వంటి మౌలిక వసతులతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. -
జనం గుండెల్లో.. హిస్స్..
సాక్షి, హైదరాబాద్: చీమలు పెట్టన పుట్టలో పాములు దూరినట్లు... పాముల పుట్టల ప్రాంతాల్లో జనావాసాలు వెలుస్తున్నాయి. నగరంలో జనాభా పెరగడంతో శివారు ప్రాంతాలు కూడా సిటీలో కలిసిపోతున్నాయి. శివారు ప్రాంతాలను ఆక్రమించి చెట్టూపుట్టా అంటూ లేకుండా వెంచర్లు, నిర్మాణాలు చేపడుతుండటంతో పాములు ఇళ్ల మధ్యకు వచ్చి బుస కొడుతున్నాయి. దీంతో పాము కాటు బాధితులు పెరిగిపోతున్నారు. చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కేవలం నెలన్నర రోజుల్లోనే ఉస్మానియాలో 92 కేసులు, గాంధీలో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు మరో యాభై మందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల పాము కాటు కేసులు పెరగడంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లోని వైద్యులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పాముల పుట్టల్లోకి జనావాసాలు... నగరం శివారు ప్రాంతాలకు కూడా విస్తరించింది. రోజుకో కొత్త వెంచర్ ఏర్పడటంతో పాటు నిర్మాణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సిటీకి దూరంగా ఉన్న కాలనీల్లో వీధిలైట్లు లేవు. ఉన్నవాటిలో చాలా వెలగడం లేదు. చాలా చోట్ల ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉండటం, అవి చెట్ల పొదలు, రాళ్లు, పుట్టలతో నిండిపోతున్నాయి. నిర్మాణ సమయంలో పిల్లర్ల కోసం గుంతలు తవ్వాల్సి వచ్చినప్పుడు పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. అక్కడ పని చేసేందుకు వచ్చిన కార్మికులు బయట నిద్రించేటప్పుడో, రాత్రిపూట మలమూత్ర విసర్జనకు వెళ్లినప్పుడో కాటేస్తున్నాయి. వైద్యులు అందుబాటులో లేక... నగరం నాలుగు వైపులా 40 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను అంబులెన్స్‌లో తీసుకుని సిటీ రోడ్లపై రద్దీని దాటుకుని ఆస్పత్రులకు చేరుకోవడం చాలా కష్టంగా మారింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో చాలా మంది మార్గమధ్యలోనే మృత్యువాతపడుతున్నారు. బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం వనస్థలిపురం, గోల్కొండ, కొండాపూర్, మలక్‌పేట్‌లో ఏరియా ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. అయితే వాటిలో వైద్య పరికరాలు, మందులు, తక్షణ సేవలు అందించే వైద్యులు లేకపోవడంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. నల్లగొండ, భువనగిరి, మేడ్చల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఆయా జిల్లాల బాధితులు కూడా ఇక్కడికే వస్తున్నారు. ఆందోళన వద్దు.. పాముకాటుకు గురైన వెంటనే కాటు వేసిన చోటుకు పైభాగాన తాడుతో గట్టిగా కట్టాలి. వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. 10 నిమిషాలకోసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి. పాముకాటుకు గురైన వారిలో అధిక శాతం మంది ఆందోళనకు గురై రక్త ప్రసరణ పెరిగి విషం శరీరమంతా వ్యాపించి చనిపోతున్నారు. ఆ వ్యక్తికి పక్కనే ఉండి ధైర్యం చెప్పడం ఎంతో అవసరం. – డాక్టర్ శ్రవణ్‌కుమార్, జనరల్ ఫిజీషియన్, ఉస్మానియా ఆస్పత్రి -
ప్లాట్లకు తగ్గని గిరాకీ!
ఆదిభట్ల, యాదాద్రి, షామీర్పేట, షాద్‌నగర్.. దశాబ్ధ క్రితం దాకా శివారు ప్రాంతాలు! కానీ, ఇప్పుడు అభివృద్ధికి హాట్‌స్పాట్స్. ఇంకా చెప్పాలంటే ప్రధాన నగరంతో సమానమైన ధరలున్న ప్రాంతాలు! గతంలో గజానికి రూ. 2–3 వేలు కూడా పలకని స్థలాల ధరలు నేడు ఆకాశాన్నంటాయి. మరీ ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కొత్త జిల్లాల విభజనతో స్థలాల ధరలు మరింత పెరిగాయి. సాక్షి, హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ అభివృద్ధికి సెంటిమెంటే ప్రధానం. ప్రత్యేకించి ప్లాట్ల విషయంలో! ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశముందంటే చాలు ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు ప్లాట్లు కొంటుంటారు. ఉద్యోగావకాశాలను కల్పించే సంస్థలు ఏ ప్రాంతంలో వస్తున్నాయో పరిశోధన చేసి మరీ పెట్టుబడులు పెడుతుంటారు. అప్పు చేసో.. ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టో.. బ్యాంకు రుణం తీసుకుని మరీ ఆయా ప్రాంతాల్లోని స్థలాలపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. భవిష్యత్తులో రేటు పెరిగి పిల్లల చదువులకో, పెళ్లికో అక్కరకొస్తుందనే దూరదృష్టితో ఉంటారు. వ్యాపారులు, పెట్టుబడిదారులు జట్టుగా ఏర్పడి ఎకరాల విస్తీర్ణాల్లో భూములను కొంటారు.పొరపాటున ధరలు తగ్గినా.. మార్కెట్ మందగమనానికి చేరినా.. ముందడుగు వేయరు. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారముందని తెలిసినా కొనడానికి సందేహిస్తుంటారు. ⇔ 2002 వరకూ శివారు ప్రాంతాల్లో గజం ధర రూ.2–3 వేలు పలకడమే ఎక్కువ. తెలంగాణ ఏర్పడ్డాక, కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక రూ.20 వేల పైకి చేరాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ధరలు తక్కువగా ఉండటం, సానుకూల వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, జీవన వ్యయం తక్కువగా ఉండటం వంటి కారణాలతో ప్రవాసాంధ్రులు, పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో స్థలాలను కొనుగోలు చేశారు. చేస్తున్నారు కూడా. ఐటీతో జోరు.. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, మణికొండ వంటి ప్రాంతాలపై అమ్మకాలు ఏనాడు కూడా ప్రతికూల పరిస్థితులకు చేరవు. కారణం ఐటీ హబ్‌గా పేరొం దడమే. ఇప్పుడిదే తరహా వాతావరణాన్ని తూర్పు ప్రాంతం సంతరించుకుంటోంది. మెట్రో రైలు తొలిసారిగా పరుగులు పెట్టేది ఇక్కడి నుంచే కావటం అదనపు అంశం. ఉప్పల్, ఆదిభట్ల ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు, ఏరో స్పేస్ సంస్థలొచ్చాక స్థిరాస్తికి మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పుడీ ప్రాంతాల్లో ప్లాట్ల మార్కెట్టే కాదు అపార్ట్మెంట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాలు కూడా భారీగా వెలుస్తున్నాయి. ప్రధాన ర హదారికి ఎంత చేరువలో ఉంది? ప్లాటు దిక్కు ఆధారంగా తుది రేటు ఆధారపడి ఉంటుందనేది మరిచిపోవద్దు. ⇔ మెట్రో రైలు ప్రయాణించే మార్గంలో, డిపోలు ఏర్పాటుకానున్న ప్రాంతాల్లోని స్థలాలకు గిరాకీ పెరిగింది. మెట్రో పనులు జోరుగా జరుగుతుండటం వల్ల ప్లాట్ల ధరల్ని అంతే స్పీడుగా పెంచేశారు కొందరు డెవలపర్లు. అయితే గత కొంతకాలంగా మియాపూర్, బాచుపల్లి, ప్రగతినగర్, చందానగర్ తదిత ర ప్రాంతాల్లో అమ్మకాలు కాసింత తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ పరిస్థితి కొంత కాలమేనని రియల్టర్లు దీమా వ్యక్తం చేస్తున్నారు. -
సూచిక బోర్డులేవీ?
• అందోలు, అన్నాసాగర్ మూలమలుపుల వద్ద తరచూ ప్రమాదాలు • పట్టించుకోని అధికారులు జోగిపేట: అందోలు మండల పరిధిలోని అందోలు, అన్నాసాగర్ గ్రామాల శివారుల్లో గల మూలమలుపుల వద్ద ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నారుు. అందోలు ఎస్టీ హాస్టల్, జోగిపేట ఫైర్‌స్టేషన్, అన్నాసాగర్ చెరువు కట్ట టర్నింగ్ వద్ద ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ మూల మలుపుల వద్ద జరిగిన ప్రమాదాల్లో ఇప్పటి వరకు 10 మందికిపైగా మరణించిన సంఘటనలున్నారుు. అన్నాసాగర్ అలుగు వద్ద బైపాస్ రోడ్డు వైపు బైక్‌ను మలుపుతుండగా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు సారుులు మరణించారు. ఫైర్ స్టేషన్ వద్ద మూల మలుపులోనే ఎక్కువ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోరుున సంఘటనలున్నారుు. సంగారెడ్డి వైపు నుంచి జోగిపేట హౌసింగ్ బోర్డు వద్ద గల మూలమలుపు వద్ద పెద్ద మట్టిగడ్డ ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నారుు. ఫైర్‌స్టేషన్ ముందు వాహనాలను మలుపుకోవడానికి వీలుగా రోడ్డును వదలడంతో సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు కనిపించడం లేదు. అందోలు ఎస్టీ హాస్టల్ వద్ద రోడ్డు పక్కన ముళ్ల పొదళ్లు ఏపుగా పెరగడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నారుు. సింగిల్ రోడ్డు కావడంతో జోగిపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారుు. అన్నాసాగర్ చెరువు కట్ట ప్రమాదకరమే.. అన్నాసాగర్ చెరువుకట్టపై ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు జరిగారుు. జోగిపేట వైపు నుంచి నారాయణఖేడ్ వెళ్లే వాహనాలు చాలా వరకు ప్రమాదానికి గురయ్యారుు. నారాయణఖేడ్ వైపు నుంచి జోగిపేటకు వెళ్తుండగా టర్నింగ్లో బ్రిడ్జిపై అదుపుతప్పి కిందకు పడి ప్రమాదాలు జరిగారుు. రాత్రిపూట జోగిపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎడమ వైపు టర్నింగ్ కాకపోవడంతో ఎదురుగా దూసుకుపోరుు ప్రమాదానికి గురై ప్రాణనష్టం జరిగిన సంఘటనలున్నారుు. నారాయణఖేడ్ నుంచి జోగిపేటకు వ స్తుండగా చెరువుకట్టపై ప్రమాదాలు జరిగారుు. సూచిక బోర్డులు లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నారుు. అధికారులు స్పందించి మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పా టు చేయాలని స్థానికులు కోరుతున్నారు.