అధునాతన వాహనంతో రోడ్డు సర్వే
ఉదయగిరి : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి-ఉదయగిరి ఆర్‌అండ్‌బీ రోడ్డును మంగళవారం అధునాతన వాహనం ద్వారా రోడ్డు సర్వే నిర్వహించారు. ఈ వాహనంలో ప్రత్యేక కెమెరాలు అమర్చారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఈ తరహా వాహనాన్ని ఉపయోగించి రోడ్డు సర్వే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా రోడ్డు సర్వే నంబరుతో పాటు రోడ్డు స్థితిగతులు క్షణాల్లో ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.