గిరిజనుల అభివృద్ధికి రూ.28.72 కోట్లు
Published Wed, Oct 26 2016 5:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
బుట్టాయగూడెం:
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్.షణ్మోహన్, డిప్యూటీ డైరెక్టర్ పి.మల్లిఖార్జున రెడ్డిలు తెలిపారు. బుధవారం ఐటీడీఏలోని పీవో ఛాంబర్‌లో వారు విలేఖరులతో మాట్లాడుతూ గడచిన రెండేళ్ళలో 28 కోట్ల 72 లక్షల రూపాయలతో వివిధ అభివద్ధి సంక్షేమ çపధకాల అమలుకు కృషి చేశామన్నారు. ముఖ్యంగా గిరిజన విధ్యార్ధులకు ఉన్నతమైన విధ్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో 25 ఆశ్రమ పాఠశాలలు, 11 కాలేజి హాస్టల్స్, 6 గురుకుల పాఠశాలలు, జీపీఎస్ పాఠశాలలు 60 ఉన్నాయని తెలిపారు. వీటిలో సుమారు 8వేల 6వందల మంది గిరిజన విధ్యార్ధులు విధ్యను అభ్యసిస్తున్నారన్నారు. అలాగే 875 మంది సిబ్బంది, 629 మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. విధ్యార్ధులకు మౌళిక సదుపాయాలు కల్పించే విధంగా కషి చేస్తున్నామన్నారు. పన్నెండున్నర కోట్ల రూపాయలతో 14 నూతన భవనాలు నిర్మించినట్లు తెలిపారు. అదేవిధంగా బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు సమీపంలో 3 కోట్ల 35 లక్షల రూపాయలతో ఐటీట కళాశాల నిర్మాణం జరుగుతుందన్నారు. 75 లక్షలతో వసతి గృహాల మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా 56 లక్షల 82 వేల రూపాయలతో బాలకల వసతి గృహాలకు కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే వసతి గృహాలు, పాఠశాలలలో లో వోలే్టజ్ సమస్య తలెత్తకుండా ప్రతీ పాఠశాలలోనే ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే గత ఏడాది నుంచి 26 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి వాటిలో దశ్యశ్రావణ పాఠ్యాంశ భోధన జరిగేలా కషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వసతి గృహాలకు జీసీసీ ద్వారా నాణ్యమైన సరుకులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2వేల 231 మంది విధ్యార్ధులకు 3 కోట్ల11 లక్షల 3వేల రూపాయలతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్‌టీఆర్ విధ్యాజ్యోతి స్కాలర్‌షిప్ కింద 9,10వ తరగతి విధ్యార్ధులకు 78 లక్షల 28 వేలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా గిరిపుత్రిక పధకం ద్వారా 85 జంటలకు 44 లక్షల రూపాయలు ప్రోత్సాహంగా ఇచ్చామన్నారు. అదేవిధంగా 50 యూనిట్లు తక్కువగా విధ్యుత్‌ను వినియోగించుకునే 7143 ఇళ్ళకు సుమారు 68 లక్షల 21 వేల వరకూ బిల్లులు చెల్లించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా ట్రైకర్ ద్వారా ఆసక్తి ఉన్న వారు వారు కోరిన యూనిట్లకు ధరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హులైన వారికి రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు. ఐటీడీఏ ద్వారా అందిస్తున్న సేవలను అందిపుచ్చుకొని గిరిజనులు అభివృద్ది చెందాలని వారు కోరారు.
Advertisement
Advertisement