పంచమఠాల్లో రుద్రాభిషేకాలు | rudrabhishakam in panchamathas | Sakshi
Sakshi News home page

పంచమఠాల్లో రుద్రాభిషేకాలు

Published Wed, Aug 31 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

పంచమఠాల్లో రుద్రాభిషేకాలు

పంచమఠాల్లో రుద్రాభిషేకాలు

శ్రీశైలం: పంచమఠాల్లోని శివలింగ స్వరూపాలకు లోక కల్యాణార్థం బుధవారం శాస్త్రోక్తంగా రుద్రాభిషేకాలను నిర్వహించారు. జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య స్వామీజీ సూచనల మేరకు వీరశైవ గురుకుల పాఠశాల వ్యవస్థాపకులు దానయ్యస్వామి చిత్రపటానికి ప్రత్యేకç ³Nజలు చేసి ఊరేగింపుగా పంచమఠాలకు చేరుకున్నారు. అక్కడి శివలింగాలకు నమకచమకాలతో శాస్త్రోక్తంగా ఆగమ పాఠశాల విద్యార్థులు అభిషేకాలను నిర్వహించారు. శ్రావణమాస అనుస్థానంలో భాగంగా ప్రతి ఏడాది చివరి బుధవారాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా జగద్గురు స్వామీజీ ఆదేశించినట్లు గురుకులపాఠశాల నిర్వాహకులు మల్లికార్జునస్వామి  తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement