నేడు మల్లన్నకు రుద్రాభిషేకం
– సాయంత్రం ఉత్సవమూర్తులతో పాతాళగంగవరకు ఊరేగింపు
– నదీమాతల్లికి విశేషపూజలు, దశవిధ నదీహారతులు
– 1,116 మంది దంపతుల కలశజలాభిషేకం
– 10 కేజీల పూలతో వస్తేనే పుష్పాభిషేకానికి అర్హులు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కృష్ణాపుష్కరాల చివరి రోజు మంగళవారం శ్రీశైల మల్లికార్జునస్వామివార్లకు కృష్ణా జలాలతో రుద్రాభిషేకం, పుష్పార్చనను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మహా పుణ్యకార్యంలో భక్తులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ముందుగా శ్రీశైల దేవస్థానంలో నమోదు చేసుకున్న 1,116 మంది దంపతులకు మొదటి ప్రాధాన్యతన్నిచి వారితో కలిసి పాతాళగంగ యాత్ర చేపడుతారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు వేదమంత్రోచ్చరణలతో మంగవాయిద్యాల నడుమ శ్రీభ్రమరాంబామల్లికార్జునేస్వామివార్ల ఉత్సవమూర్లును పల్లకీలో పాతాళగంగవ ద్దకు తీసుకెళ్తారు. అనంతరం పవిత్ర పాతాళగంగ నదీ తీరాన కృష్ణవేణీ నదీమాతల్లికి విశేషపూజలను నిర్వహించి, దశవిధ హారతులతో కృష్ణమ్మకు నదీహారతులను సమర్పిస్తారు. అనంతరం ప్రత్యేకపూజలలో పాల్గొనే దంపతులందరూ పుష్కర స్నానం చేసి కలశంలో కృష్ణా జలాలను నింపుకుని పాతాలగంగ మెట్ల మార్గం ద్వారా పైకిS చేరుకుని అక్కడినుంచ కలశాయత్రతో స్వామివార్ల ఆలయాన్ని చేరుకుంటారు. అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తరీతిలో పుష్పోత్సవ సేవను నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొనే దంపతులు కచ్చితంగా 10 కేజీల పూలను (బంతిపూలు మినహా) తీసుకురావాల్సి ఉంటుంది. అలా తీసుకువచ్చిన వారికి మాత్రమే దేవస్థానం అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే పాతాళగంగ కలశ జలాలతో వచ్చిన దంపతులు శ్రీమల్లికార్జునస్వామివార్ల మూలవిరాట్‌కు వేదగోష్టి మ«ధ్య రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు
సేవాకర్తలకు మహాదాశీర్వచనాలు:
మంగళవారం సాయం్రం శ్రీ మల్లికార్జునస్వామివారికి జరిగే కృష్ణాజలాల కలశాభిషేకం, పుష్పోత్సవ సేవలో పాల్గొనే సేవాకర్తలకు ఆలయ అర్చకులు, వేదపండితులు వేద మంత్రోచ్చరణలతో మహాదాశీర్వచనాలను 1,116 మంది జంటలకు అందజేస్తారు. శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల దేవస్థానం తరుపున ఈ క్రతువులో పాల్గొన్న భక్తులకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు (కండువా, చీర,రవికె, పసుపు,కుంకుమలు), లడ్డూప్రసాదాలను ఆలయ అధికారులు అందజేస్తారు.