నిబంధనలతో నాకేం పని.. | Rules floated in MCN | Sakshi
Sakshi News home page

నిబంధనలతో నాకేం పని..

Published Fri, Sep 30 2016 1:41 AM | Last Updated on Sat, Oct 20 2018 6:29 PM

నిబంధనలతో నాకేం పని.. - Sakshi

నిబంధనలతో నాకేం పని..

  • ఈ–పేపర్‌ ఎడిటర్‌కి రూ.50వేలు జీతం
  • అధికారులకు మేయర్‌ అజీజ్‌ ఆదేశాలు
  • నెల్లూరు సిటీ : నెల్లూరు మేయర్‌ తాను అనుకున్నదే చేశారు. ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా నిబంధనలను పక్కనపెట్టి తన సొంత మనిషిని కార్పొరేషన్‌ ఈ–పేపర్‌ ఎడిటర్‌గా నియమించుకుని రూ.50 వేలు జీతం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గురువారం షేక్‌ మహ్మద్‌ రఫీని ఈ–పేపర్‌ ఎడిటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈవ్యవహారంపై ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీతో పాటు సొంత పార్టీ టీడీపీ కార్పొరేటర్‌ల నుంచి వ్యతిరేకత వచ్చినా మేయర్‌ ఏ మాత్రం చలించలేదు. నిబంధనలు తనకు కాదన్నట్లుగా రఫీకి నియామకపత్రం అందజేశారు.

    దీనిపై కార్పొరేషన్‌ అధికారుల్లో తీవ్ర చర్చజరుగుతోంది. ప్రజలు పన్నుల రూపంలో కార్పొరేషన్‌కు కట్టిన ధనాన్ని, సొంత మనుషుల కోసం ఖర్చు చేయడంపై అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఓ అధికారి కూడా మేయర్‌కు అంతమొత్తంలో చెల్లించడంపై విమర్శలు వస్తాయని సలహా ఇచ్చారు. అయితే మేయర్‌ అజీజ్‌ మాత్రం అవేం పట్టించుకోలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement