
తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ తక్కువగా ఉంది.
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ తక్కువగా ఉంది. బుధవారం ఉదయం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి రెండు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల్లోపే దర్శన భాగ్యం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం వెంటవెంటనే పూర్తవుతోంది.