
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శుక్రవారం ఉదయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నడకదారిన వచ్చిన భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.