ఉద్యోగ బాటలో.. క్రీడా సంరంభం
-
మూడో రోజు ఈవెంట్స్‌కు హాజరైన 1696 మంది అభ్యర్థులు
-
ప్రశాంతంగా కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ
వరంగల్ : కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఈవెంట్స్ ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మూడోరోజున 966 మందికి పరుగు పందెం నిర్వహించారు. మొదటి రెండు రోజుల్లో పరుగు పందెంలో అర్హత సాధించిన వారికి షాట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 90 మంది మహిళా అభ్యర్థినులకు 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. వీటిలో అర్హత సాధించిన వారిని రాత పరీక్షలకు ఎంపిక చేయనున్నారు. కాగా, ఈ పోటీలను నగర పోలీస్ కమిషనర్(సీపీ) సుధీర్‌బాబు పర్యవేక్షించారు. ఈసందర్భంగా పోలీసు అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు.
కేయూ మైదానంలో...
కాకతీయ యూనివర్సిటీ మైదానంలోనూ మెుదటి రెండు రోజుల పోటీల్లో అర్హత సాధించిన 730 మంది అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించారు. పోటీలను రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా పర్యవేక్షించారు. ఈ పరీక్ష కేంద్రాల్లో జరిగిన పోటీలను అదనపు డీసీపీ యాదయ్య, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి, పరిపాలన అధికారి స్వరూపారాణి, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్ధన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్‌రావు, ఈశ్వర్‌రావు, రవీందర్‌రావు, రమేష్ కుమార్, డీఎస్పీలు రాజమహేంద్రనాయక్, సత్యనారాయణరెడ్డి, సుధీంద్ర, రాంచందర్‌రావు సమీక్షించారు. వీరితో పాటు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.