అవే కష్టాలు
అవే కష్టాలు
Published Mon, Nov 14 2016 9:25 PM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
- నగదు మార్పిడికి జనం సతమతం
– తీరని వందనోట్ల కొరత
– పెట్రోలు బంకుల్లోను చెల్లుబాటు కాని పెద్దనోట్లు
– బ్యాంకులకు పెరిగిన తాకిడి
– జిల్లాకు చేరని కొత్త 500 నోట్లు
కర్నూలు(అగ్రిల్చర్): పెద్ద నోట్ల మార్పిడికి జనం పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కేంద్ర ప్రభుత్వం రూ. 500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు నుంచి జిల్లాలో నగదు కొరత తీవ్రం కావడంతో అన్ని వర్గాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వంద నోట్లకు తీవ్ర కరువు ఏర్పడింది.రూ.2000 నోట్లు వచ్చినా అన్ని బ్యాంకులకు చేరలేదు. ఏటీఎంలు శుక్రవారం నుంచే పని చేస్తాయని కేంద్రం ప్రకటించింది. నాలుగు రోజులు గడచిన నగదు కొరత కారణంగా 80 శాతం పైగా ఏటీఎంలు పనిచేయలేదు. ఏటీఎంలలో కేవలం రూ. 2వేలు మాత్రమే తీసుకునే అవకాశం ఉన్నా పెట్టిన నగదు గంట, రెండు గంటల్లోనే ఖాళీ అవుతోంది. దీంతో నగదు సమన్యలు మరింత పెరిగింది. జిల్లాలో 34 బ్యాంకులు ఉండగా 445 శాఖలు ఉన్నాయి. దాదాపు అన్ని బ్యాంకులకు ప్రస్తుతం ఏటీఎంలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 403 ఏటీఎంలు ఉన్నాయి. రూ.500 నోట్లు రాకపోవడం, రూ.100 నోట్లకు తీవ్రమైన కొరత ఏర్పడటంతో ఏటీఎంలు తెరవలేని పరిస్థితి ఏర్పడింది.
డిపాజిట్లు రూ. 1500 కోట్లు:
రద్దైన రూ.1000, 500 నోట్ల డిపాజిట్లు పెరుగుతున్నా నోట్ల మార్పిడి, నగదు విత్ డ్రా గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పటి వరకు డిపాజిట్ల రూపంలో దాదాపు రూ.1500 కోట్ల వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వందనోట్లతో పాటు రూ.50, 20 నోట్ల కొరత ఏర్పడింది. పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్రం సకాలంలో రూ.500, డిమాండ్‌కు తగ్గట్టుగా 100 నోట్ల సరఫరా చేయడంలో విఫలం కావడంతో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు పెరిగాయి. బ్యాంకు కౌంటరు నుంచి వారానికి 20వేల నుంచి రూ.24వేల వరకు పెంచిన నగదు కొరత వల్ల తూతూ మంత్రంగానే తీసుకోవాల్సివస్తోంది. నిన్న మొన్నటి వరకు పెట్రోలు బంకుల్లో రూ.1000,500 నోట్లు తీసుకున్నా సోమవారం నుంచి తీసుకోవడంలేదు. ఈ మేర కు అన్ని పెట్రోలు బంకుల్లో ప్లెక్సీ బ్యానర్లు పెట్టడం గమానార్హం.
బ్యాంకుల ఎదుట బారులు
బ్యాంకులు, ఏటీఎంలకు జనాల తాకిడి మరింత పెరిగింది. నిన్న, మొన్నటితో పోల్చి చూస్తే 10 నుంచి 20 శాతం వరకు జనాల తాకిడి పెరిగింది. కర్నూలుతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర పట్టణాల్లో ప్రజలు నోట్లు మార్పిడి, విత్‌డ్రా కోసం బారులుదీరారు. ఎస్‌బీఐ, ఆంధ్రబ్యాంకు, ఏపీజీబీ, సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు తదితర బ్యాంకుల్లో 100 నోట్ల కొరతతో నగదు మార్పిడి, విత్‌డ్రా బాగా తగ్గిపోయింది. దీంతో వివిధ వర్గాల ఆందోళన అంతా, ఇంతా కాదు. జిల్లాకు రోజుకు కనీసం రూ. 50 కోట్ల విలువ చేసే వందనోట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం రూ.10కోట్లు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రజల కష్టాలు వర్ణానాతీతం. ఒకవైపు ఆరోగ్య సమస్యలు మరోవైపు, ఫీజు కష్టాలు ఇలా ఎవరికి వారు తీవ్ర ఆర్థిక కష్టాల్లో పడ్డారు. బ్యాంకులకు ఉదయం 8 గంటలకు వచ్చి ఆరేడు గంటలు వరసలో నిబడినప్పటికి రూ.1000 ఇవ్వడం లేదు. రూ.500 నోట్లను కేంద్రం విడదల చేసినా అవి కర్నూలు జిల్లాకు చేరలేదు. రూ.500 నోట్లు, వందనోట్లు పుష్కలంగా లభ్యం అయితేనే ప్రజల సమస్యలు తీరుతాయి.
Advertisement