తుపాకులగూడెంలో ప్రారంభమైన ఇసుక క్వారీ
Published Mon, Jul 25 2016 11:59 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
ఏటూరునాగారం : మండలంలోని తుపాకులగూడెం ఇసుక క్వారీ ఏడాది తర్వాత మళ్లీ ప్రారంభమైంది. తుపాకులగూడెం వద్ద గోదావరి నది నుంచి తోడిన సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ ఉంది. దాన్ని విక్రయిస్తేనే సొసైటీ సభ్యులకు లాభాలు వస్తాయని భావించిన టీఎస్‌ఎండీసీ అధికారులు క్వారీ నుంచి విక్రయాల అనుమతిని ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.
దీంతో సోమవారం నుంచి ఇసుక క్వారీ అమ్మకాలు ప్రారంభమయ్యారు. దీంతో స్థానిక గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏటూరు సొసైటీ క్వారీ మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీనిపై ఇసుక క్వారీల ప్రాజెక్టు అధికారి వెంకటరమణను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో క్వారీలో విక్రయాలు ప్రారంభించామన్నారు. గోదావరి నుంచి ఇసుకను తీయకుండా గతంలో నిల్వ చేసిన ఇసుకను విక్రయిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
Advertisement