కళ్లుగప్పి.. కొల్లగొట్టి...
-
‘ఉచితం’ ముసుగులో బరితెగిస్తున్న అక్రమార్కులు
-
అనధికార ర్యాంపుల్లో రేయింబవళ్లు ఇసుక తవ్వకాలు
-
గుట్టుగా.. గుట్టలుగా పోసి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు
-
సీతానగరం మండలంలో యథేచ్ఛగా అర్ధరాత్రి తవ్వకాలు
-
ట్రాక్టర్లను పట్టుకున్నా విడిపించుకున్న ప్రజాప్రతినిధి
-
కేసులు నమోదు చేస్తే ఆందోళన చేస్తామంటూ బెదిరింపులు
సాక్షి, రాజమహేంద్రవరం :
ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులతో సంబంధం లే కుండా.. కనిపించినచోటల్లా ‘ఉచితం’ ము సుగులో అక్రమంగా ఇసుక తవ్వేసి.. గుట్టు గా తరలించేసి.. గ్రామాల్లో గుట్టలుగా పోసి.. దర్జాగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి.. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. పైసా పెట్టుబడి కూడా లేకపోవడంతో ఈ ‘ఉచిత’ వ్యాపారం మూడు ఇసుక డంపులు.. ఆరు ట్రాక్టర్లుగా సాగి పోతోంది. అనధికార ర్యాంపుల్లో రేయింబవళ్లు ఇసుక తవ్వేస్తూ రెవెన్యూ, పోలీసు అధికారులకు సవాలు విసురుతున్నారు. అడపాదడపా అధికారులు దాడులు చేస్తున్నా బెదరడంలేదు. ఒకటి రెండు రోజులు స్తబ్దుగా ఉండి మర్నాటి నుంచి షరా మామూలుగానే తమ ‘పని’ చేసుకుపోతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలున్నాయని, అధికారులెవ్వరూ తమను ఏమీ చేయలేరన్న తెగింపుతో యథేచ్ఛగా ఇసుక తరలించుకుపోతున్నారు.
అనుమతి లేకుండానే..
జిల్లాలోని 31 ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాజమహేంద్రవరం శివారు గ్రామమైన కాతేరులో ర్యాంపునకు అనుమతి లేదు. కానీ, ఇక్కడ యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. రాత్రి వేళల్లో అధిక సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. అదును చూసుకుని పగటి పూట కూడా తవ్వేస్తున్నారు. కాతేరు వాటర్ ఇ¯ŒSటేక్ పాయింట్ సమీపంలో నాణ్యమైన ఇసుక ఉన్న ప్రతిచోటా విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. దీంతో వాటర్ ఇ¯ŒSటేక్ పాయింట్ చుట్టూ మోకాలు లోతు గుంతలు ఏర్పడ్డాయి. అడుగు భాగంలో మట్టి కనిపిస్తోంది. సీతానగరం మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఇదేవిధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.
ఎక్కడ చూసినా ఇసుక డంపులే
కూలీలతో రాత్రి, కుదిరితే పగటి పూట ట్రాక్టర్లలో ఇసుక నింపి ఆయా గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. కాతేరులోని అనధికార ఇసుక ర్యాంపునకు వెళ్లేదారిలో ఎక్కడ చూసినా ఇసుక డంపులే కనిపిస్తున్నాయి. చుట్టూ ప్రహరీలు ఉన్న ప్రదేశంలో కొత్తవారికి కనిపించకుండా ఇసుక నిల్వ చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాన రహదారిని ఆనుకుని గ్రామ శివారులో కూడా పెద్ద పెద్ద ఇసుక డంపులు కనిపిస్తున్నాయి. గామ¯ŒS వంతెన రోడ్డు దాటిన తర్వాత సీతానగరం వైపు వెళ్లేదారిలోని పంట పొలాల్లో కూడా ఇసుక డంపులున్నాయి. ట్రాక్టర్లలో ఇసుకను నింపేందుకు కూలీలను ఉపయోగిస్తుండగా, డంపుల వద్ద లారీల్లో నింపేందుకు పొక్లయిన్లు వాడుతున్నారు. అక్కడినుంచి లారీలతో విశాఖ, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. ఇసుకను వ్యాపారంగా మలచుకున్న కొందరు సొంతంగా ట్రాక్టర్లు, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు లారీలు, లారీల్లో ఇసుకను నింపేందుకు పొక్లెయిన్లను కూడా కొనుగోలు చేశారంటే వారి వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
అధికారులనే బెదిరిస్తూ..
రెవెన్యూ అధికారులు అడపాదడపా దాడులు చేసి వాహనాలను పట్టుకుంటున్నా ఇసుక అక్రమార్కులు బెదరడంలేదు. పైగా అధికారులనే బెదిరిస్తూ వాహనాలను విడిపించుకుపోయి మళ్లీ యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. గత నెల 18న సీతానగరం మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయ కృష్ణ¯ŒS తన సిబ్బందితో కలసి అర్ధరాత్రి దాడులు చేశారు. నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేశారు. వాటిని స్థానిక పోలీస్ స్టేష¯ŒSకు తరలించారు. వెంటనే అధికార పార్టీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. అయినా ఫలితం లేకపోవడంతో మరుసటి రోజు ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులను పోలీస్ స్టేష¯ŒSకు పంపారు. పోలీస్ స్టేష¯ŒSకు చేరుకున్న స్థానిక నాయకులు ఖాళీగా వెళుతున్న ట్రాక్టర్లను అన్యాయంగా పట్టుకుని, స్టేష¯ŒSకు తరలించారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేసులు నమోదు చేస్తే స్టేష¯ŒS ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్టర్లను పోలీసులు రాజమహేంద్రవరం అర్బ¯ŒS తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఇసుక ఉన్న ఒక ట్రాక్టర్‌పై కేసు నమోదు చేయగా, బరితెగించిన ఇసుకాసురులు మిగిలిన మూ డింటినీ విడిపించుకపోయారు. అధికార మ దంతో ఇసుక అక్రమార్కులు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు.