చెంగావిరంగుచీర..
కృత్తివెన్ను :
చీరను అందంగా ధరించడం అతివలకే సాధ్యం. అటువంటిది తాను పెంచుకుంటున్న కూరగాయలు, ఆకుకూరల మొక్కలకు ఏకంగా ఆ చీరనే రక్షణ ఏర్పాటు చేసి ఔరా అనిపించాడు. ఈ రైతు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం సినిమాహాలు సమీపంలో గ్రామానికి చెందిన పి.నాగబాబు తాను పెంచుకుంటున్న చిన్నపాటి కూరగాయల తోటకు పశువులు, పక్షుల నుంచి రక్షణ కోసం ఏకంగా వివిధ రంగుల చీరలను కంచెగా ఏర్పాటు చేశారు. బెండ, బీరలతో పాటు ఆకు కూరలైన తోటకూర, గోంగూరలకు మంచి రక్షణ దొరికింది. 216 జాతీయ రహదారి పక్కనే ఉండటంతో చూపరులను ఆకర్షిస్తున్న రక్షణ కవచం వాటెన్ ఐడియా గురూ.. అనిపించేలా చేస్తుంది.