-
శాతవాహన రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి
కమాన్‌చౌరస్తా : మాతృభాష తెలుగును సంరక్షించుకోవాలని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి కోరారు. శుక్రవారం ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ‘నేటి విద్యావిధానం –మాధ్యమం–ఆవశ్యకత’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టెబల్ సమావేశంలో పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఎల్లారెడ్డిపేట ఎంఈవో రాజయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యా బోధనలో ప్రమాణాలు తగ్గుతున్నాయన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు బండి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను, అవశ్యకతను వివరించారు. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు 5 శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత, లక్ష్మీప్రసాద్, యశ్వంత్, ఉమేరా తస్మిన్, విజయ్‌కుమార్, విజయ ప్రకాశ్, ప్రదీప్‌రాజ్, రమేశ్, హరికృష్ణ, విద్యార్థులు రాందాస్, జనార్దన్, మౌనిక, సౌజన్య, రాజు, వెంకటేశ్, రంజిత్ పాల్గొన్నారు.
వివేకనందలో..
వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివాస్, ఉపన్యాసకులు ఎండీ అలీఖాన్, వేణుగోపాలశర్మ, శ్రీలత, సాగర్, శ్రీనాథ్‌రెడ్డి, అకడామిక్ కో–ఆర్టినేటర్ బి.సంపత్‌కుమార్, ఏవో శ్రావణ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
కాళోజీ జయంతి వేడుకలు
కరీంనగర్‌కల్చరల్ : శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో తెలంగాణ భాష దినోత్సవం నిర్వహించారు. సాహితీవేత్త దాస్యం సేనాధిపతిని సన్మానించారు. కళాశాల డైరెక్టర్ బి.మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి ముద్దసాని రమేశ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జి.మల్లారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రాంగోపాల్‌రావు, తెలుగుశాఖ అధ్యక్షుడు మధుసూదనస్వామి పాల్గొన్నారు. వివేకానంద విద్యానికేతన్ స్కూల్‌లో విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి, అధ్యాపకులు సంపత్, రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. పారమిత స్కూల్‌లో విద్యార్థులు ‘కాళోజీ కవిత్వం–భాష–యాస’ అంశంపై కవిత్వాలు రాశారు. ప్రిన్సిపాల్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపాల్ తివారి, కో ఆర్డినేటర్స్ అరుణ, హేమ, శ్రీలత, ఉపాధ్యాయినీలు గీతాంజలి, విజయ, మధులత, శ్రీలత, రమ, స్వప్న, అభినవ్, చిరంజీవచారి పాల్గొన్నారు.
‘తెలంగాణ తెలుగు’ డాక్యుమెంటరీ ప్రారంభం
ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ తెలుగు’ అనే డాక్యుమెంటరీ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. శతాధిక గ్రంథకర్త మలయశ్రీపై ముహుర్తం షాట్‌ను చిత్రీకరించారు. కళాశాల ప్రిన్సిపల్ పి.నితిన్, విశ్రాంత లైబ్రేరియన్ వారాల ఆనంద్, చిత్ర దర్శకుడు కొత్తిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు. మలయశ్రీ రచించిన 128వ పుస్తకం ‘తెలంగాణ పోరుకేక జయ పతాకం’ ఆవిష్కరించారు. అధ్యాపకులు మస్రూర్ సుల్తానా, శ్రీనివాస్‌రెడ్డి, రాజేష్, రాజు, సత్యనారాయణ, జార్జ్, శ్రీనివాస్, ఎలిజాబెత్‌రాణి, సుబ్బారాంరెడ్డి, ప్రేమ్‌చంద్, నాగరాజు పాల్గొన్నారు.
సత్యంగౌడ్‌కు సత్కారం
కరీంనగర్ కల్చరల్ : కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యంగౌడ్‌ను ఏజేసీ నాగేంద్ర సత్కరించారు.