ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి
నెల్లూరు(పొగతోట):
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జీఎస్.కృష్ణప్రసాద్, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కాయల సతీష్‌కుమార్, సీపీఎస్ రాష్ట్ర అ«ధ్యక్షుడు ఎం.గిరీష్ అన్నారు. ఆదివారం స్థానిక ఏపీఆర్‌ఎస్‌ఏ అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీల్లో అన్యాయం జరుగుతోందని, డిప్యూటేషన్లకు నిబంధనల కొర్రీలు పెడుతున్నారని, ఇతరులకు గంటల వ్యవధిలోనే బదిలీ చేస్తున్నారన్నారు. కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఒక్క సూపరింటెండెంట్ లేడన్నారు. ఏపీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌వీఆర్‌సీ శేఖర్‌రావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి మద్దతు తెలుపుతామన్నారు. రాష్ట్ర దళిత సంఘం నాయకుడు బాలచెన్నయ్య మాట్లాడారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణం చేయించారు. ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.అశోక్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు ఎన్. మల్లిఖార్జున పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడి జీఎస్ కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి వై.అశోక్‌కుమార్, గౌరవాధ్యక్షుడు ఎం.గిరీష్, కోశాధికారి జి.అరుణ్‌కుమార్, సహాయకులు– కాయల సతీష్‌కుమార్, కె.రవికుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్.మల్లిఖార్జున్, అర్గనైజింగ్ సెక్రటరీ వై.ప్రభాకర్‌రావు, సహ అధ్యక్షుడిగాటి.రాజేష్‌బాబు, జి.మల్లిఖార్జున, బి.రాములు, జాయింట్ సెక్రటరీలుగా జి.మధు, సీహెచ్. బెన్ని, బి.తులసిమాల, ఈసీ మెంబర్స్– పి.దుర్గనగేంద్ర, బి.రాజేష్, కె.భాస్కర్, జి. రాఘురామయ్యను ఎన్నుకున్నారు.