మధ్యాహ్న భోజనం పరిశీలన | school, food, students | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం పరిశీలన

Published Wed, Jul 27 2016 11:55 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

school, food, students

తాండూర్‌ : మండలంలోని బోయపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును ఎంపీపీ మాసాడి శ్రీదేవి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు రుచిగా ఉండే భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాజలింగు, ఉపాధ్యాయులు సురేశ్, తిరుపతి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement