* పాఠశాల తెరిచిన రెండో రోజే ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుడు
* ఆవు తల విదల్చడంతో బైక్‌పై నుంచి కిందపడి దుర్మరణం
భట్టిప్రోలు : పరిగెత్తుతూ వస్తున్న ఆవు తలతో విదల్చడంతో ద్విచక్రవాహనంపై విధులకు వెళుతున్న ఓ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన ఇది. ఐలవరం గ్రామానికి చెందిన అందె వెంకట సుబ్బారావు(53) భట్టిప్రోలు టీఎం రావు హైస్కూల్లో ఉపాధ్యాయుడు. మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై హైస్కూల్‌కు బయలుదేరారు.
ఐలవరం- భట్టిప్రోలు రహదారి మధ్య చెరువు వద్దకు రాగానే ఆవుల మంద రోడ్డు దాటుతున్నాయి. ఓ ఆవు విసురుగా వస్తూ అటువైపుగా వస్తున్న వెంకట సుబ్బారావు వైపు తల విదల్చడంతో బైక్‌పై నుంచి పడడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంతలో అటువైపుగా వెళుతున్న భట్టిప్రోలు ఎస్‌ఐ ఆర్ రవీంద్రారెడ్డి వెంటనే ఆటోలో చెరుకుపల్లి ప్రైవేట్ వైద్యశాలకు తరలించి సమాచారాన్ని హైస్కూల్ సిబ్బం దికి తెలియజేశారు. మెరుగైన చికిత్సకోసం తెనాలిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో విజయవాడ తీసుకెళ్లారు.
అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్కూల్ తెరిచిన రెండోరోజే సుబ్బారావును మృత్యువు ఇలా కబళించటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
స్కూల్‌కు వెళుతూ మృత్యు ఒడిలోకి..
Published Wed, Jun 15 2016 8:28 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM
Advertisement
Advertisement