ఫాతిమానగర్‌లో బ్రిడ్జి నిర్మాణం కోసం డ్రిల్లింగ్ పనులు చేపట్టిన సిబ్బంది
-
డ్రిల్లింగ్ పనులు ప్రారంభం
-
మట్టి నమూనాల సేకరణ..
-
ల్యాబ్‌లో పరీక్ష తర్వాత నిర్మాణ పనులు
కాజీపేట: కాజీపేట రైల్వేలైన్‌పై మరో సమాంతర బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి కృషికి ఫలితం దక్కింది. జిల్లా ప్రజల చిరకాల వాంఛగా ఉన్న బ్రిడ్జి విస్తరణకు ఇటీవల సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజీపేట- ఫాతిమానగర్ దారిలో కుడి వైపున బ్రిడ్జి నిర్మిస్తే బాగుంటుందని, భూసేకరణకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు కడియం శ్రీహరి దృష్టికి తీసుకొచ్చారు.
కాగా, రాష్ట్రప్రభుత్వ ఆదేశం మేరకు హైవే బ్రిడ్జి సెక్టార్స్ సంస్థ(హెచ్‌బీఎస్), ఇన్ ఫా ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది బ్రిడ్జి నిర్మాణం కోసం నిర్ధేశించిన స్థలంలో బుధవారం డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. రెండు కంపెనీల ప్రతినిధులు నాలుగు జట్లుగా విడిపోయి 14 మీటర్ల లోతులో డ్రిల్లింగ్ చేశారు. డ్రిల్లింగ్ చేయడం ద్వారా వచ్చిన మట్టిని వివిధ లోతుల్లో సేకరించి పరీక్ష కోసం హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్‌కు పంపనున్నట్లు కంపెనీ ప్రతినిధి సంతోష్ తెలిపారు. పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభిస్తుందని సంతోష్ సాక్షికి తెలిపారు.