రిటైర్డ్‌ పీపీకి వీడ్కోలు | sendoff to retaired pp | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ పీపీకి వీడ్కోలు

Published Wed, Aug 31 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

రిటైర్డ్‌ పీపీకి  వీడ్కోలు

రిటైర్డ్‌ పీపీకి వీడ్కోలు

కమాన్‌చౌరస్తా: జిల్లా ప్రధాన న్యాయస్థానం గ్రేడ్‌వన్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉద్యోగ విరమణ చేసిన పి.హరిశంకర్‌ను జిల్లా కోర్టు న్యాయమూర్తు, న్యాయవాదులు బుధవారం సన్మానించారు. ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన హరిశంకర్‌రావు మొదట సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఎంపికయ్యారు. జిల్లాలో వివిధస్థాయిల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో వీడ్కోలు కార్యక్రమంలో నిర్వహించారు. జిల్లా జడ్జి వై.రేణుక, అదనపు జడ్జి సురేశ్, ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్‌రావు, సబ్‌జడ్జిలు కుష, భవానీచంద్ర, మెజిస్ట్రేట్‌లు మాధవి, శ్రీనివాస్, అజహర్‌హుస్సేన్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్, ప్రధాన కార్యధర్శి బి.రఘునందన్‌రావు, ఏపీపీలు రాంరెడ్డి, ప్రవీణ్, న్యాయవాదులు హరిశంకర్‌రావును శాలువాతో సత్కరించారు.
 

Advertisement

పోల్

Advertisement