sendoff
-
శోక సంద్రం
-
భూమాకు కన్నీటి వీడ్కోలు
– అశ్రునయనాల మధ్య భూమా అంతిమ యాత్ర – భారీగా తరలివచ్చిన ప్రముఖులు – జనసంద్రమైన ఆళ్లగడ్డ – అధికార లాంఛనాలతో అంత్యక్రియలు అభిమాన నేత భూమా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు ఊర్లు ఊర్లే కదిలివచ్చాయి. ప్రియతమ నాయకుడు ఇక లేడని తెలిసి అభిమానుల కళ్లు చెమ్మగిల్లాయి. అన్న ఇక తిరిగి రాడని..ఆప్యాయ పలుకులు ఉండబోవని అనుచరులు కుమిలి కుమిలి ఏడ్చారు. నాన్నా..ఇక మాకెవరు దిక్కంటూ కుమార్తెలు అఖిల ప్రియ, నాగ మౌనిక రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ప్రజా నాయకుడిగా..సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా భూమా నిలిచిన తీరు నాయకగణం కీర్తించింది. ఆళ్లగడ్డలో సోమవారం నంద్యాల ఎమ్మెల్యే భూమా అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య కొనసాగాయి. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు, ముఖ్యనేతలు భూమా పార్థీవ శరీరంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. భూమా కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆళ్లగడ్డ: గుండె పోటుతో మృతి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సోమవారం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవను ప్రశంసించారు. అండగా నిలిచిన వారికోసం ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉండగా గుండెపోటు రావడంతో భూమా నాగిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. అభిమానుల సందర్శనార్థం భూమా పార్థీవ దేహాన్ని ఆళ్లగడ్డలోని ఆయన స్వగృహంలో ఉంచారు. భూమాకు నివాళులర్పించేందుకు సోమవారం ఉదయం నుంచే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. విగతజీవిగా ఉన్న ప్రియతమ నాయకుడిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. జై భూమా.. భూమా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ జనసమూహం మధ్య భూమా పార్థీవ దేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి వైపీపీఎం కళాశాల, పాత బస్టాండు మీదుగా శోభా ఘాట్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ప్రియతమ నాయకుడిని కడసారి చూసుకునేందుకు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గం నుంచే కాక రాయలసీమ జిల్లాల్లోని అనేక ప్రాంతాలనుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దీంతో భూమా గృహంతోపాటు ఆళ్లగడ్డలోని ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. నిబంధనల ప్రకారం పోలీస్ పరేడ్ నిర్వహించి, ఆకాశంలోకి తుపాకీతో కాల్పులు జరిపిన అనంతరం భూమా చితికి ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి నిప్పటించారు. హాజరైన పలువురు నేతలు భూమా అంత్యక్రియలకు రాష్ట్రంలోని పలువురు నాయకులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఉపముఖ్యమంత్రులు కేయి కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వర రావు, పీతల సుజాత, పరిటాల సునీత, అచ్చన్నాయుడు, కర్నూలు ఎంపీ బుట్టారేణుక, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, స్పీకర్ కోడెల శివప్రసాదు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి.. తదితరులు భూమా నాగిరెడ్డి మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
పాటల ‘సెమట సుక్క’కు కన్నీటి వీడ్కోలు
– ప్రజా కవి వాసు అంతిమయాత్రకు తరలివచ్చిన కళాకారులు – గఫూర్, గేయానంద్ తదితరులు నివాళులు కర్నూలు(కల్చరల్): పాటవై మళ్లీ వస్తావా..! మా వాసన్న..!.. పోరు బాటకు తోడై ఉంటావా.. మా వాసన్న..! సెమట సుక్కవై నింగికెగిసావా.. మా వాసన్న..! అంటూ ప్రజా కవి ఆర్ఏ వాసుకు ప్రజానాట్య మండలి కళాకారులు నివాళులు అర్పిస్తూ పాడిన గీతం అందరినీ కంటతడి పెట్టించింది. స్థానిక సీపీఎం కార్యాలయ ఆవరణలో వాసు భౌతిక కాయాన్ని ఉంచి సీపీఎం నాయకులు, ప్రజా కళాకారులు, కవులు, గాయకులు నివాళులు అర్పించారు. అంతకుముందు స్థానిక మార్కెట్‌యార్డు సమీపంలోని ఇందిరాగాంధీ నగర్లో వాసు స్వగృహం వద్ద ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, ఎమ్మెల్సీ గేయానంద్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, ప్రజావైద్యశాల డైరెక్టర్ డా.బ్రహ్మారెడ్డి, డా.వీవీ లక్ష్మీనారాయణ, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి, గాయకుడు మహమ్మద్‌మియా, సహాయ కార్యదర్శి, రచయిత ఇనాయతుల్లా, కోశాధికారి బాల వెంకటేశ్వర్లు, టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు, విశ్వకళాసమితి అధ్యక్షుడు హనుమంతరాయచౌదరి, రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నాయకుడు చంద్రన్న, ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం నాయకులు సుధారాణి, చంద్రకంటి మద్దయ్య, రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ పుల్లయ్య, తదితరులు నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో పేదల గాయకుడు వాసు అమర్ రహే, జోహార్.. జోహార్.. వాసు ఆశయాలు కొనసాగిస్తాం.. అనే నినాదాలు మార్మోగాయి. వాసు సతీమణి సుజాత, కుమార్తెలు లహరి, వెన్నెలను పలువురు పరామర్శించారు. స్థానిక సుంకేసుల రోడ్డులోని క్రై స్తవ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పాటల కెరటం వాసు: పేద ప్రజల కష్టాలను ప్రజా కవి వాసు సమీపం నుంచి పరిశీలిస్తూ దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్న శ్రమజీవులు, హమాలీలు, కూలీల జీవితాలను వాసు అక్షరీకరించి పాటల కెరటమై నిలిచారని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయ ఆవరణంలో వాసు భౌతికకాయానికి నివాళులు అర్పిస్తూ ఆయన సంతాప సందేశాన్ని అందించారు. వాసు ఆశయాలను కళాకారులు, కార్యకర్తలు కొనసాగించాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్ మాట్లాడుతూ వాసు తన జీవితాన్ని పాటలకే అంకితం చేసి ప్రజల్ని చైతన్యపరిచారన్నారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ పేదరికంపై, అణచివేతపై వాసు రాజీలేని పోరాటం చేశారన్నారు. తన పదునైన పాటలతో ప్రస్తుత రాజకీయ వ్యవస్థను తూర్పారబట్టారన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు విజయకుమార్, క్రాంతి, తెలంగాణా ప్రజానాట్య మండలి నాయకులు జగ్గరాజు, నరసింహా, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, సీఐటీయూ నాయకులు పుల్లారెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరంట్లప్ప, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మద్దయ్య, కర్నూలు ప్రజానాట్య మండలి కార్యదర్శి బసవరాజు, గాయకులు ఆశన్న, కళాకారులు లోకేష్, కరుణాకర్, సీపీఎం కార్యకర్తలు, డప్పు కళాకారులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. పాల్గొన్నారు. -
రిటైర్డ్ పీపీకి వీడ్కోలు
కమాన్‌చౌరస్తా: జిల్లా ప్రధాన న్యాయస్థానం గ్రేడ్‌వన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉద్యోగ విరమణ చేసిన పి.హరిశంకర్‌ను జిల్లా కోర్టు న్యాయమూర్తు, న్యాయవాదులు బుధవారం సన్మానించారు. ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన హరిశంకర్‌రావు మొదట సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపికయ్యారు. జిల్లాలో వివిధస్థాయిల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో వీడ్కోలు కార్యక్రమంలో నిర్వహించారు. జిల్లా జడ్జి వై.రేణుక, అదనపు జడ్జి సురేశ్, ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్‌రావు, సబ్‌జడ్జిలు కుష, భవానీచంద్ర, మెజిస్ట్రేట్లు మాధవి, శ్రీనివాస్, అజహర్‌హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్, ప్రధాన కార్యధర్శి బి.రఘునందన్‌రావు, ఏపీపీలు రాంరెడ్డి, ప్రవీణ్, న్యాయవాదులు హరిశంకర్‌రావును శాలువాతో సత్కరించారు. -
జేవీ రాముడికి ఆత్మీయ వీడ్కోలు