లింగనిర్ధారణ నేరం
జిల్లా జాయింట్ కలెక్టర్–2 రామస్వామి
కర్నూలు(హాస్పిటల్): లింగనిర్ధారణ నేరమని జిల్లా జాయింట్ కలెక్టర్–2 రామస్వామి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో స్కానింగ్ సెంటర్ల యజమానులు, అప్రాప్రియేట్ కమిటీ సభ్యులతో పీసీ పీఎన్‌డీటీ యాక్ట్‌పై జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ–2 రామస్వామి మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించామన్నారు. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోక్ అదాలత్ న్యాయమూర్తి సోమశేఖర్, డీఎస్పీ కృష్ణమూర్తి , ప్రైవేటు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడారు. సమావేశంలో ఆదోని ఆర్‌డీవో ఓబులేసు, ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్షుడు డాక్టర్ బి. శంకరశర్మ, ఎన్‌జీవో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.