నిస్సిగ్గుగా దిగజారుడు రాజకీయాలా: ఉత్తమ్ | Shameless degrading politics: Uttam | Sakshi
Sakshi News home page

నిస్సిగ్గుగా దిగజారుడు రాజకీయాలా: ఉత్తమ్

Published Mon, Jun 20 2016 2:48 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

నిస్సిగ్గుగా దిగజారుడు రాజకీయాలా: ఉత్తమ్ - Sakshi

నిస్సిగ్గుగా దిగజారుడు రాజకీయాలా: ఉత్తమ్

హుజూర్‌నగర్: అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య విలువలను దెబ్బ తీస్తున్నారన్నారు.

ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికీ మేలు జరగలేదన్నారు. కాంగ్రెస్‌కు ఫిరాయింపులతో వచ్చే ఆటుపోటులు కొత్త కాదన్నారు. 2019లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజకీయ విలువలను నేర్పింది గాంధీ, నెహ్రూ, ఇందిర కుటుంబాలేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement