షీ టీం పోస్టర్
మహబూబ్‌నగర్ క్రైం : కష్ణా పుష్కరాలను సజావుగా నిర్వహించటానికి పోలీస్ శాఖ సకలచర్యలు చేపట్టిం దని ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. అందు లో భాగంగానే∙ప్రత్యే క షీ టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
– ఎస్పీ రెమారాజేశ్వరి
మహబూబ్‌నగర్ క్రైం : కష్ణా పుష్కరాలను సజావుగా నిర్వహించటానికి పోలీస్ శాఖ సకలచర్యలు చేపట్టిం దని ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. అందు లో భాగంగానే∙ప్రత్యే క షీ టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. షీ టీమ్ పోస్టర్లను ఆదివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, స్నానఘాట్టల వద్ద భక్తుల నియంత్రణ, ఆలయాల వద్ద దైవదర్శన ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కల్పన సహకారంతో పాటు భద్రత చర్యలకు మూడంచెల విధానం అవలంభిస్తున్నామని తెలిపారు. కష్ణా పరివాహక ప్రాంతం, నల్లమల అటవీప్రాంతం, సరిహద్దు గ్రామాలను పోలీస్ ప్రత్యేక బలగాలు, మావోయిస్టు నిరోధక దళాలు, బాంబు నిర్వీర్యం చేసే నిపుణులను అదుపులోకి తీసుకున్నామని, పుష్కరాలు పూర్తయ్యే వరకు ఆయాబలగాలు తమ విధులలో నిమగ్నమై ఉంటారని తెలిపారు. ఇక అంతర్గతంగా పోలీస్ నిఘావర్గాలు భక్తుల, జనసందోహం మధ్యన విధులు నిర్వహిస్తారని, సంఘ వ్యతిరేక శక్తులు, దొంగలపై సీసీ కెమెరాలు, నిఘా అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉంటుందని తెలిపారు. పుష్కరాలకు మహిళలు, అమ్మాయిలు అధికంగా హాజరయ్యే అవకాశంఉందని, ఈ విషయాన్ని దష్టిలో ఉంచుకోని స్నానఘట్టాలు, దేవాలయాలు బస్టాండ్స్ వద్ద షీ టీమ్ సభ్యులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పుష్కరాల సందర్భంగా మహిళలు, అమ్మాయిలు అధికంగా తిరిగే ప్రాంతాల్లో షీటీమ్‌లతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిపై అవగాహన కలిగే విధంగా పోస్టర్లను జాతీ య రహదారిపై, బస్టాండ్ల వద్ద అవసరమైన ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచుతామని తెలిపారు. ఇబ్బందికి గురైన మహిళలు నేరుగా పోలీసుల ను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో షీం టీంలలో పని చేయడానికి ఇతర జిల్లాలకు చెందిన పలువు రు మహిళా సిబ్బంది రెండ్రోజుల్లో జిల్లాకు రానున్నారని తెలిపారు.
తక్కువ లగేజీతో రండి
పుష్కరాలకు వచ్చే భక్తులు వీలైనంత తక్కువ లాగేజీతో రావాలని సూచిం చారు. ముఖ్యంగా మహిళా భక్తులు అతిగా ఆభరణాలు, విలువైన వస్తువులు వెంట తెచ్చుకోవటం క్షేమంకాదని చెప్పారు.