షిఫ్టులవారీ బోధనతో ఇబ్బందులు | shifts teaching problems | Sakshi
Sakshi News home page

షిఫ్టులవారీ బోధనతో ఇబ్బందులు

Published Sat, Sep 3 2016 9:51 PM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

తహసీల్దార్‌కు మెమోరాండం అందజేత - Sakshi

తహసీల్దార్‌కు మెమోరాండం అందజేత

శివ్వంపేట: షిఫ్టులవారీ బోధనతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని శివ్వంపేట ఉన్నత పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌ కల్లూరి పద్మయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు లక్ష్మినర్సయ్య, అజీజ్‌, కొండల్‌, శ్రీనివాస్‌ అన్నారు. శివ్వంపేటలోని ఉన్నత పాఠశాలలో ఉదయం వేల పాఠశాల, మధ్యాహ్నం నుంచి జూనియర్‌ కాలేజీ నిర్వహించాలని ఆదేశాలు వెలువడ్డాయని, దీంతో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతోందని అన్నారు.

మధ్యాహ్నం వరకు పాఠశాల ముగియడంతో విద్యార్థులు ఇళ్ల వద్ద ఆడుకోవడంతో పాటు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సి వస్తోందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్‌ పర్హీన్‌షేక్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కాలేజీ, పాఠశాల తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నిర్మాణానికి రూ.10 కోట్లు సిద్ధంగా ఉన్నాయని, భూమి కేటాయించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. త్వరలోనే కాలేజీకి భూమి కేటాయిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement