ప్రజల సొమ్మే పెట్టుబడిగా
-
-
నిధుల సమీకరణకు కొత్త ప్రతిపాదన
-
ప్రభుత్వ హామీతో బాండ్లు జారీ
-
స్మార్ట్ కాకినాడకు ట్రిఫుల్–బి గ్రేడ్
-
విధి విధానాలపై అధికారుల అధ్యయనం
కాకినాడ :
ప్రజల సొమ్మే పెట్టుబడిగా నిధుల సమీకరణకు ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఇందుకోసం స్మార్ట్‌సిటీ కాకినాడలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి బాండ్లు ఇచ్చే దిశగా కార్పొరేష¯ŒS కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి గతవారం ఢిల్లీలో జరిగిన స్మార్ట్‌సిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు గ్రీ¯ŒSసిగ్నల్ ఇచ్చారు. దీంతో డిపాజిట్ల సేకరణ, బాండ్లు జారీ విధివిధానాలపై కార్పొరేష¯ŒS యంత్రాంగం దృష్టి సారించింది. స్మార్ట్‌సిటీగా ఎంపికైన కాకినాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏటా రూ.300–400 కోట్లు వరకు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు వేగవంతం చేశారు. మరో వైపు స్మార్ట్‌సిటీ పరిధిలో లేదా, జిల్లా కేంద్రంలో ఏమైనా కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదిస్తే వాటికి అవసరమయ్యే రూ.కోట్ల నిధులను ప్రజల నుంచి సేకరించే దిశగా ఆలోచన చేశారు. అయితే ప్రజల నుంచి ఈ తరహాలో సొమ్ములురాబట్టి బాండ్లు జారీ చేయాలంటే కొన్ని అర్హతలు అవసరం కావడంతో ప్రస్తుతం ఆ దిశగా దృష్టి సారించారు.
కాకినాడకు అర్హత...
బాండ్లు జారీ ద్వారా నిధులు సేకరించే విధానానికి కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాథమికంగా అర్హత సాధించింది. దేశ వ్యాప్తంగా ఈ విధానంలో ఎనిమిది నగరాలకు అవకాశం ఉందని కేంద్ర స్థాయిలో నిర్ధారణకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ, విశాఖ నగరాల్లో ఈ విధానం ద్వారా నిధులు సమీకరించనున్నారు.
రేటింగ్‌లో ట్రిఫుల్–బి...
స్మార్ట్‌సిటీ కార్పొరేష¯ŒS తరుపున ప్రజల నుంచి నిధులు సేకరించాలంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ద్వారా గ్రేడింగ్‌ను నిర్ణయిస్తారు. కాకినాడకు వచ్చే ఆదాయం, ఖర్చు, ఆడిటింగ్ ద్వారా ఈ రేటింగ్‌ను నిర్ధారిస్తారు. అర్హత కలిగిన ఎంపేనల్ ఏజెన్సీ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. కార్పొరేష¯ŒS అధికారుల సమాచారం మేరకు విశాఖకు ట్రిఫుల్–ఎ, కాకినాడకు ట్రిఫుల్–బి రేటింగ్ వచ్చింది. ఈ రేటింగ్ మరింత పెంచడం ద్వారా నూరుశాతం అర్హత సాధించే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు నుంచి వచ్చే నిధులకు పూర్తి సెక్యూరిటీ ఉండే విధంగా ప్రభుత్వం మధ్యలో హమీగా ఉండి ఈ బాండ్లను జారీ చేస్తారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో వచ్చిన నిధులను వినియోగంలోకి తెస్తారు.
విధి విధానాలపై కసరత్తు...
బాండ్లు జారీకి విధానాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. వచ్చే డిపాజిట్లకు బాండ్లు జారీ చేసి ఆ సొమ్ముకు ప్రాజెక్టులో వచ్చే వాటా? లేదా వడ్డీ రూపంలో ఇవ్వాలా? తదితర అంశాలపై కూడా కేంద్రం నుంచి వచ్చే సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు.
కసరత్తు చేస్తున్నాం...
స్మార్ట్‌సిటీ సమావేశంలో బాండ్లు జారీ ద్వారా నిధులు సమీకరణ అంశంపై సూచనలిచ్చారు. అయితే క్రెడిట్‌రేటింగ్ ఏజెన్సీ ద్వారా కాకినాడకు ట్రిఫుల్–బి వచ్చి కొంత మేరకు అర్హత సాధించగలిగాం. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేశాక విధివిధానాలు ప్రకటిస్తాం.
– ఎస్.అలీమ్‌భాషా,
కాకినాడ కార్పొరేష¯ŒS కమిషనర్