public money
-
ప్రజాధనంతో చంద్రబాబు పబ్లిసిటీ
-
ఒక్కరోజు సభా నిర్వహణకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?.. స్పీకర్ ఫైర్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి సస్పెన్షన్ గురయ్యారు. రెండు రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయిస్తూ సభా కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలిగించడంతో స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేల తీరును స్పీకర్ తప్పుపట్టారు. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. ఒక రోజు శాసనసభ నిర్వహణకు రూ.53.28లక్షలు ఖర్చవుతుంది. ఒక నిమిషం సభ నిర్వహణకు రూ. 88,802 ప్రజాధనం ఖర్చవుతుంది. ప్రభుత్వం ప్రజా సమస్యల్ని చర్చిండానికి ఇంత ఖర్చుపెడుతుంటే టీడీపీ సభ్యులు సభా సమయాన్ని ఇలా నిరుపయోగం చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విగ్రహాల ఖర్చును చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లక్నో, నోయిడాలోని పార్కుల్లో ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఏనుగు(బీఎస్పీ చిహ్నం), తన నిలువెత్తు విగ్రహాలకు ఖర్చయిన మొత్తాన్ని మాయావతి తిరిగి చెల్లించాల్సిందేనని కోర్టు తెలిపింది. ఇది తమ ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనంది. రవికాంత్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. ఈ సందర్భంగా పిటిషనర్ వాదిస్తూ.. రాజకీయ నేతల సొంత విగ్రహాల ఏర్పాటుకు, పార్టీల ప్రచారానికి ప్రజాధనాన్ని వినియోగించడం సరికాదన్నారు. అప్పట్లో యూపీ పర్యాటక శాఖకు కేటాయించిన నిధుల్లో 90 శాతం ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడానికే ఖర్చయిపోయాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ పిటిషన్‌పై మే నెలలో విచారణ జరపాలని మాయావతి తరఫు న్యాయవాది ఎస్సీ మిశ్రా కోర్టును కోరారు. దీంతో ఈ విషయంలో పూర్తిస్థాయిలో వాదనలు వినాల్సి ఉందన్న సుప్రీంకోర్టు, తదుపరి విచారణను 2019, ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. 2008–09 మధ్యకాలంలో మాయావతి రూ.2,000 కోట్లతో బీఎస్పీ ఎన్నికల చిహ్నమైన ఏనుగుతో పాటు తన విగ్రహాలను యూపీలో ఏర్పాటుచేసుకోవడాన్ని సవాలుచేస్తూ రవికాంత్ సుప్రీంలో పిల్ దాఖలుచేశారు. -
చంద్రబాబే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ
సాక్షి, విశాఖపట్నం: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాష్ట్రానికి గొప్ప ఆస్తి అంటూ తెలుగుదేశం నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు.. ఆయన ఈ రాష్ట్రానికి ఆస్తి కాదు చీడ..చెద’ అని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం ఏమాత్రం పెరగలేదు కానీ. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయన్నారు. 2014 వరకు రూ.90 వేల కోట్ల అప్పులు నేడు రూ.2.50 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఎన్టీపీసీ తమకు ప్రభుత్వం కట్టాల్సిన రూ.2,130 కోట్లు బకాయిలు కట్టకపోతే రాష్ట్రానికి కరెంట్ కట్ చేస్తామని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిందంటే ఇంతకంటే దివాలాకోరుతనం ఇంకేముంటుందని బొత్స ప్రశ్నించారు. గురువారం విశాఖ సిటీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా ఓ సంక్షేమ పథకానికి అడ్వాన్స్ చెక్కులు ఇచ్చిన దాఖలాలున్నాయా? అని అన్నారు. ఉదయం లేచింది మొదలు జగన్ నామస్మరణ చేస్తున్నాడే తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఓ ప్రతిపక్ష నేతను సంస్కారహీనంగా మాట్లాడడం చూస్తుంటేæ బాబులో అహంకారం, పొగరు, తలబిరుసుతనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. ఢిల్లీ దీక్ష కోసం రైళ్లలో జనాల్ని తరలించేందుకు రూ.1.38 కోట్లు రైల్వే శాఖకు కట్టారంటే ప్రజాధనం ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. నేతలు గుడివాడ అమర్నా«థ్, మళ్ల విజయప్రసాద్, పలువురు పార్టీ కో–ఆర్డినేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. -
జనం సొమ్ముతో సొంత ప్రచారమా?
సాక్షి, అమరావతి: అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ప్రజాధనంతో సొంత ప్రచారం నిర్వహించుకోవడాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుబట్టింది. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా అధికార పార్టీకి అనుకూలంగా ప్రచార ప్రకటనల కోసం ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించింది. 2015 మే నెలలో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ రూ.13.76 కోట్లతో సర్కారు ప్రచార ప్రకటనలు జారీ చేయడం పట్ల కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రకటనల జారీపై సుప్రీం స్పష్టమైన మార్గదర్శకాలు... ‘ప్రకటనల పేరుతో రాజకీయ లబ్ధి కోసం ప్రజాధనాన్ని వినియోగించరాదు. ప్రభుత్వం బాధ్యతతో పనిచేసేలా మాత్రమే ప్రచార ప్రకటనలు ఉండాలి. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రచార మెటీరియల్ ఆబ్జెక్టివ్‌గా ఉండాలి. అధికార పార్టీ ఇమేజ్ పెంచేలా, వ్యక్తులకు రాజకీయంగా ఉపకరించేలా ప్రజాధనంతో ప్రచార ప్రకటనలు జారీ చేయరాదు. న్యాయపరంగా, ఆర్థిక నియంత్రణతో కూడినవిగా ప్రకటనలు ఉండాలి’ అని సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందని కాగ్ తెలిపింది. అయితే చంద్రబాబు సర్కారు సుప్రీం మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించిందని కాగ్ తప్పుబట్టింది. సీఎం, సీఎంవో ఆదేశాల మేరకే... సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా, టీడీపీ సర్కారుకు అనుకూలంగా ప్రజాధనంతో ప్రచారం నిర్వహించడంపై వివరణ ఇవ్వాలని సమాచారశాఖ కమిషనర్‌ను ‘కాగ్’ లిఖిత పూర్వకంగా కోరింది. ఈ నేపథ్యంలో సమాచార శాఖ కమిషనర్ దీనిపై స్పందిస్తూ చివరి నిమిషంలో ముఖ్యమంత్రితోపాటు ఆయన కార్యాలయం మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తుందని, వాటిని అమలు చేయడం తమ బాధ్యతంటూ వివరణ అందచేశారు. సీఎం, ఆయన కార్యాలయం ఆదేశాల మేరకే తాము వ్యవహరించినట్లు అందులో సమాచార శాఖ కమిషనర్ పేర్కొన్నారు. అయితే ఈ వివరణపై సంతృప్తి చెందని ‘కాగ్’ అసలు సుప్రీం కోర్టు తీర్పు మార్గదర్శకాలను అమలు చేసేందుకు ఏవైనా ఆదేశాలను జారీ చేశారా? లేదా? ఒకవేళ జారీ చేయకుంటే అందుకు కారణాలను వెల్లడించాలని సమాచారశాఖకు సూచించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల అమలుకు కమిటీని ఏర్పాటు చేయలేదని సమాచార శాఖ కమిషనర్ వివరణలో పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసమే సీఎం దీక్షలు గత ఏడాది ఏప్రిల్ 20వతేదీన తన పుట్టిన రోజు సందర్భంగా జన్మనిచ్చిన భూమి కోసం చంద్రబాబు నిరాహార దీక్ష పేరుతో రూ.1.91 కోట్లతో ప్రచార ప్రకటనలు జారీ చేశారని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దీక్ష చేశారని, అయితే పూర్తిగా చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునేందుకే దీక్ష చేశారని కాగ్ తూర్పారబట్టింది. గత ఏడాది జూన్ 30వ తేదీన ‘అంబేడ్కర్ ఆశయం.. చంద్రన్న ఆచరణ’ పేరుతో రూ.3.01 కోట్లతో ప్రచార ప్రకటనలు జారీ చేశారు. చంద్రన్న ఆచరణ అనడం పూర్తిగా చంద్రబాబు వ్యక్తిత్వాన్ని పెంచడానికేనని, ఈ ప్రకటన సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధమేనని కాగ్ పేర్కొంది. గత ఏడాది జూన్ 2వ తేదీన నవ నిర్మాణ దీక్ష పేరుతో కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబును పొగుడుతూ ఏకంగా రూ.4.08 కోట్ల ఖర్చుతో సమాచార శాఖ ప్రచార ప్రకటనలు జారీ చేయడాన్ని కాగ్ తప్పుబట్టింది. ఏరువాక పౌర్ణమి పేరుతో రూ. 0.77 కోట్లతో ప్రచార ప్రకటనలు జారీ చేయడం సుప్రీం మార్గదర్శకాల ఉల్లంఘన కిందకే వస్తుందని కాగ్ స్పష్టం చేసింది. గత ఏడాది ఏప్రిల్ 20వ తేదీన ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు ఫొటోలతో హోర్డింగుల ఏర్పాటుకు రూ.3.99 కోట్ల ఖర్చు చేయడాన్ని కూడా కాగ్ తప్పుబట్టింది. -
విజయ్ మాల్యా ట్వీట్ల సంచలనం
ఆర్థిక నేరస్తుడు, లిక్కర్‌బ్యారన్ విజయ్ మాల్యా (62) మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. రూ. 9వేలకోట్లకు పైగా రుణాలను ప్రభుత్వ బ్యాంకులకు ఎగనామం పెట్టి లండన్‌కు చెక్కేసిన మాల్యా ట్వీట్లు ఇపుడు సంచలనంగా మారాయి. ప్రభుత్వ బ్యాంకుల వద్ద తీసుక్ను రుణాలు మొత్తం (100 శాతం) ఆయా బ్యాంకులకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బుధవారం ట్వీట్ చేశాడు. మొత్తం రుణాలను తిరిగి చెల్లించాలనే తన ప్రతిపాదనను అంగీకరించాలంటూ వరుస ట్వీట్లలో బ్యాంకులను అభ్యర్థించాడు. అదీ అగస్టా వెండ్ల్యాండ్ కేసులో మాకెల్ను స్వదేశానికి రప్పించిన కేవలం కొన్ని గంటల్లోనే మాల్యా స్పందించడం విశేషం. అధిక ఇంధన ధరలతో విమానయాన సంస్థలు పాక్షికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ధరాభారంతో నష్టాలెదుర్కొంటున్న తన సంస్థ కింగ్‌ఫిషర్ కోసం బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో రుణాలను తీసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. బారెల్ చమురు140 బిలియన్ డాలర్ల గరిష్ఠ ధరకు చేరడంతో బంగారంలాంటి తన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మరింత నష్టాల్లోకి కూరుకుపోయిందనీ, అయితే ప్రధాన మూలధనాన్ని 100శాతం తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను, దయచేసిన అంగీకరించాలంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు రాజకీయ నాయకులు, మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మరోసారి పాత పల్లవినే ఎత్తుకున్నాడు. కాగా సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైకేల్(57)ను దుబాయ్ నుంచి ఇండియాకు రప్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించే కేసులో మరో 5రోజుల్లో(డిసెంబరు 10) లండన్ కోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే రుణాలు మొత్తం చెల్లిస్తానని మాల్యా ప్రకటించడం ఇదే మొదటిసారికాదు...అలాగే బ్యాంకులు ఈ ప్రతిపాదనను నిరాకరించాయి కూడా. వేలకోట్ల రూపాయల మేర రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తులను తిరిగి దేశానికి తేవడానికి కేంద్రం చర్యల్ని వేగవంతం చేయడంతో మాల్యా గుండెల్లో గుబులు మొదలైనట్టుందని బిజినెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. Airlines struggling financially partly becoz of high ATF prices. Kingfisher was a fab airline that faced the highest ever crude prices of $ 140/barrel. Losses mounted and that’s where Banks money went.I have offered to repay 100 % of the Principal amount to them. Please take it. — Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018 For three decades running India’s largest alcoholic beverage group, we contributed thousands of crores to the State exchequers. Kingfisher Airlines also contributed handsomely to the States. Sad loss of the finest Airline but still I offer to pay Banks so no loss. Please take it. — Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018 -
‘ప్రజాధనంతో ఇచ్చే ప్రకటనలు నిషేధించండి’
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ప్రజాధనంతో ఇచ్చే రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసీసీ ఆదివారం ఓ లేఖ రాసింది. తెలంగాణలోని ఆపద్ధర్మ ప్రభుత్వం, నాలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం భారీ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రసార మాధ్యమాలకు, పత్రికలకు, వెబ్సైట్లకు ప్రకటనలు ఇస్తున్నాయని లేఖలో పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోతో ఇచ్చే ప్రకటనలకు ప్రజాధనం ఖర్చు చేయకుండా తెలంగాణ సీఎస్‌కు ఆదేశాలివ్వాలని కోరింది. -
ప్రజా సొమ్ము వృథా కూడా అవినీతే!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ప్రభుత్వం నిధులను భారీగా ఖర్చు చేయడం ఎంత మేరకు భావ్యమని విజ్ఞులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. భారీ ఎత్తున సభకు తరలి వచ్చిన ప్రజల రవాణా సౌకర్యాల కోసం 7.23 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. సభకు వచ్చిన ప్రజల అన్న పానీయాల కోసం, ముందస్తుగా వచ్చిన వారి వసతి కోసం మరిన్ని కోట్ల రూపాయలను రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రధాని మాట్లాడిందీ రాజకీయ సభలోకాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ప్రభుత్వ స్కీముల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం ప్రభుత్వమే ఏర్పాటు చేసిన సభని ఎవరైన వాదించవచ్చు. సభలో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలే ఎక్కువ మాట్లాడారని సభకు హాజరైన ఎవరినడిగినా చెబుతారు. కాంగ్రెస్‌ను ‘బెయిల్ బండి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ఎవరు మరచిపోలేరు. అయినా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే వాటిని సక్రమంగా అమలు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టాలిగానీ ఇలా సభల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడం ఏమిటన విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ భారీ సభను ఏర్పాటు చేశారని వారు విమర్శిస్తున్నారు. కేంద్ర, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలను వాణిజ్య ప్రకటనల రూపంలో ఖర్చు పెట్టారు. ఇప్పుడు సభల కోసం భారీగా నిధులు ఖర్చు చేయడం వల్ల ప్రజా జీవితాల్లో మార్పులు వస్తాయా, వారి జీవణ ప్రమాణాలు పెరుగుతాయా? డబ్బును ఇలా వృథా చేయడానికి బదులు ప్రజల అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తే వారి జీవన ప్రమాణాలు మెరగుపడవా? అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాల అవినీతి గురించి ప్రస్తావించే మోదీకి ఇలా ప్రజా సొమ్మును వృథా చేయడం కూడా ఓ రకమైన అవినీతేనని అనిపించలేదా? అంటూ విజ్ఞులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చుచేస్తున్న బాబు
-
నమ్మకంగా నడిపించి.. నట్టేట ముంచి
శంకర్పల్లి : సంఘం పేరుతో చిట్టీలు, డిపాజిట్ చేయించుకొని రాత్రికి రాత్రి ఉడాయించిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధి తులిచ్చిన సమాచారం ప్రకారం... మండల కేంద్రంలో వీరభద్రియ సంఘం చాలా సంవత్సరాలుగా ఉంది. అందులోని సభ్యులు వీరభద్రియ సంఘం పేరు మీద చిట్టీల దందా చేసేవారు. చాలామంది రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు సంఘంలో డబ్బులు డిపాజిట్ చేసుకొని నెలనెలా వడ్డీ తీసుకునేవారు. ఎక్కువ వడ్డీ వస్తుండటంతో వీరభద్రియ సంఘంలో కోట్ల రూపాయల డిపాజిట్లు చేశారు. అయితే నెలనెలా చిట్టీల డబ్బులను సంఘం వారు వాడుకోవడంతోపాటు ఇతర కార్యక్రమాలకు ఉపయోగించేవారు. గత రెండేళ్లుగా సంఘంలో డిపాజిట్ చేసిన వారి డబ్బులు సరిగా ఇవ్వకపోవడం, చిట్టీ డబ్బులు లేపిన తరువాత సరిగా ఇవ్వకపోవడంతో తమ డబ్బులు ఇచ్చేయాలని డిపాజిట్‌దారులు ఒత్తిడి చేయడం ఎక్కవైంది. సంఘం సభ్యులు నేడు రేపు నెలా, రెండు నెలలు అంటూ కాలం గడిపారు. ఈ నేపథ్యం లో శుక్రవారం రాత్రి సమయంలో సంఘం సభ్యు లు ఎవరికీ చెప్పకుండా ఇళ్లు ఖాళీ చేసి సంఘానికి తాళం వేసి వెళ్లిపోయారు. ఉదయం సంఘానికి తాళం వేసి ఉండటం చూసిన డిపాజిట్ దారులు ఆందోళనకు దిగారు. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న డబ్బులతో ఉడాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది సంఘం ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూశారు. అయితే డబ్బులు సంఘంలో డిపాజిట్ చేసిన వారు ఒక్కరూ పోలీస్‌స్టేషకు వెళ్లి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అయితే సంఘంలో ఎంత మంది ఎంతెంత డబ్బులు డిపాజిట్ చేశారనే వివరాలు పోలీసులకు అందిన ఫిర్యాదులను బట్టే తెలియరానున్నాయి. -
బ్యాంకుల్లో మీ సొమ్ము భద్రం
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాల్లో ప్రజల డిపాజిట్లపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, ప్రజల సొమ్ము భద్రంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. డిపాజిట్‌దారుల ప్రయోజనాలకు ఏ రకంగానూ విఘాతం కలగదని స్పష్టం చేశారు. ప్రధాని బుధవారం ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపాదిత ఎఫ్ఆర్డీఐ బిల్లు ఫలితంగా డిపాజిట్‌దారుల సొమ్ము ప్రశ్నార్థకమవుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసే చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, అయితే సోషల్ మీడియాలో ఎఫ్ఆర్డీఐ బిల్లుపై వదంతులు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. తాము డిపాజిట్‌దారులు, బ్యాంకుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎఫ్ఆర్డీఐ బిల్లులోని బెయిల్ ఇన్ నిబంధనపై నెలకొన్న వివాదాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులు దివాలా తీసే పక్షంలో డిపాజిట్‌దారుల ఖాతాల్లో నగదును సర్దుబాటు చేసుకునేందుకు బ్యాంకులను బెయిల్ ఇన్ నిబంధన అనుమతిస్తుంది. -
వృథా వ్యయం
♦ ప్రచారం కోసం ప్రజాధనం దుర్వినియోగం ♦ సీఎం పర్యటనపై సర్వత్రా విమర్శలు ♦ కార్యక్రమం వల్ల ప్రయోజనమేమిటని విసుర్లు విజయనగరం గంటస్తంభం: చేసింది గోరంతయితే... ప్రచారం కొండంత... ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి. సొంత ప్రచారం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలకు బుధవారం చీపురుపల్లి పర్యటన అద్దం పట్టింది. ప్రచారానికి తప్ప జిల్లా ప్రజలకు ఈ కార్యక్రమం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చర్చనడుస్తోంది. ప్రభుత్వం ప్రచారం కోసం ఎన్నో కార్యక్రమాలు గడచిన మూడేళ్లలో చేపట్టిన విషయం విదితమే. ఈ తరహాలోనే బుధవారం నుంచి మూడురోజులపాటు జలసిరికి జనహారతి పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా నదులు, కాలువల వద్ద కార్యక్రమాలు పెడుతోంది. ఇందులో భాగంగానే బుధవారం చీపురుపల్లిలో తోటపల్లి కాలువ వద్ద జనహారతి కార్యక్రమం చేపట్టింది. కాలువ వద్ద ముఖ్యమంత్రి హారతి ఇచ్చారు. అనంతరం చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమం ఎందుకోసం నిర్వహిస్తున్నారన్నది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. దాదాపు రూ. కోటి వృథా.... వాస్తవానికి జనహారతి కార్యక్రమం కోసం జిల్లాలో దాదాపుగా రూ.కోటి ఖర్చువుతుందని అధికారవర్గాలు చెబుతున్న మాట. కాలువ వద్ద హారతికి ఏర్పాట్లు, బహిరంగ సభకు వేదిక, అక్కడకు రైతులు, ఇతర వర్గాలను తెప్పించడానికి, వారికి ఉపశమన చర్యలకు, ముఖ్యమంత్రికి ఏర్పాటు చేసిన కాన్వాయ్ అద్దె, ఇతర ఖర్చులు అన్నీ కలిపితే ఆ మాత్రం ఖర్చు తప్పదు. రెండు రోజులుగా అధికారులు ఏర్పాట్లకు, వారి తిండి, రవాణా ఖర్చులు ఇందులో కలిపితే ఇంకా ఎక్కువే ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఏమి ప్రయోజనం ఇంత ప్రజాధనం వినియోగించిన తర్వాత ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఏమైనా మేలు జరిగిదంటే లేదనే చెప్పుకోవాలి. ఒకసారి కార్యక్రమాన్ని చూస్తే తోటపల్లి నుంచి వస్తున్న కాలువ వద్ద ముఖ్యమంత్రి నిల్చున్నారు. హారతి ఇచ్చి వెళ్లిపోయారు. బహిరంగ సభ వద్ద మాట్లాడారు. అంతే అంతటితో కార్యక్రమం ముగిసింది. ఇదంతా చూస్తే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రచారం కోసమేనన్నమాట నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే హారతి ఇవ్వకపోయినా తోటపల్లి నీరు కాలువల ద్వారా ప్రవహించడం ఆగదు. ప్రకృతి సహకరించి... ఒడిశాలో భారీ వర్షాలు పడితే తోటపల్లికి నీరు చేరక తప్పదు. ముఖ్యమంత్రి హారతి ఇవ్వకపోయినా పంట పొలాలకు నీరు అందుతుంది. పోనీ అదనంగా ఆయకట్టుకు నీరించేందుకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసుంటే ముఖ్యమంత్రి కార్యక్రమం వల్ల ప్రయోజనం ఉండేదన్న అభిప్రాయం జనాల్లో ఉంది. ఇదే కార్యక్రమం ఇతర సాగునీటి ప్రాజెక్టులు, పధకాలు నిర్మాణానికి పెడితే రైతులు సంతోషించేవారని, పాత ప్రాజెక్టుల వద్ద హారతిలు ఇచ్చి ఏమి ప్రయోజనం ఉంటుందని పలువురు చెప్పుకుంటున్నారు. -
ప్రజల సొమ్మే పెట్టుబడిగా
నిధుల సమీకరణకు కొత్త ప్రతిపాదన ప్రభుత్వ హామీతో బాండ్లు జారీ స్మార్ట్ కాకినాడకు ట్రిఫుల్–బి గ్రేడ్ విధి విధానాలపై అధికారుల అధ్యయనం కాకినాడ : ప్రజల సొమ్మే పెట్టుబడిగా నిధుల సమీకరణకు ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఇందుకోసం స్మార్ట్‌సిటీ కాకినాడలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి బాండ్లు ఇచ్చే దిశగా కార్పొరేష¯ŒS కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి గతవారం ఢిల్లీలో జరిగిన స్మార్ట్‌సిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు గ్రీ¯ŒSసిగ్నల్ ఇచ్చారు. దీంతో డిపాజిట్ల సేకరణ, బాండ్లు జారీ విధివిధానాలపై కార్పొరేష¯ŒS యంత్రాంగం దృష్టి సారించింది. స్మార్ట్‌సిటీగా ఎంపికైన కాకినాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏటా రూ.300–400 కోట్లు వరకు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు వేగవంతం చేశారు. మరో వైపు స్మార్ట్‌సిటీ పరిధిలో లేదా, జిల్లా కేంద్రంలో ఏమైనా కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదిస్తే వాటికి అవసరమయ్యే రూ.కోట్ల నిధులను ప్రజల నుంచి సేకరించే దిశగా ఆలోచన చేశారు. అయితే ప్రజల నుంచి ఈ తరహాలో సొమ్ములురాబట్టి బాండ్లు జారీ చేయాలంటే కొన్ని అర్హతలు అవసరం కావడంతో ప్రస్తుతం ఆ దిశగా దృష్టి సారించారు. కాకినాడకు అర్హత... బాండ్లు జారీ ద్వారా నిధులు సేకరించే విధానానికి కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాథమికంగా అర్హత సాధించింది. దేశ వ్యాప్తంగా ఈ విధానంలో ఎనిమిది నగరాలకు అవకాశం ఉందని కేంద్ర స్థాయిలో నిర్ధారణకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ, విశాఖ నగరాల్లో ఈ విధానం ద్వారా నిధులు సమీకరించనున్నారు. రేటింగ్‌లో ట్రిఫుల్–బి... స్మార్ట్‌సిటీ కార్పొరేష¯ŒS తరుపున ప్రజల నుంచి నిధులు సేకరించాలంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ద్వారా గ్రేడింగ్‌ను నిర్ణయిస్తారు. కాకినాడకు వచ్చే ఆదాయం, ఖర్చు, ఆడిటింగ్ ద్వారా ఈ రేటింగ్‌ను నిర్ధారిస్తారు. అర్హత కలిగిన ఎంపేనల్ ఏజెన్సీ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. కార్పొరేష¯ŒS అధికారుల సమాచారం మేరకు విశాఖకు ట్రిఫుల్–ఎ, కాకినాడకు ట్రిఫుల్–బి రేటింగ్ వచ్చింది. ఈ రేటింగ్ మరింత పెంచడం ద్వారా నూరుశాతం అర్హత సాధించే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు నుంచి వచ్చే నిధులకు పూర్తి సెక్యూరిటీ ఉండే విధంగా ప్రభుత్వం మధ్యలో హమీగా ఉండి ఈ బాండ్లను జారీ చేస్తారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో వచ్చిన నిధులను వినియోగంలోకి తెస్తారు. విధి విధానాలపై కసరత్తు... బాండ్లు జారీకి విధానాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. వచ్చే డిపాజిట్లకు బాండ్లు జారీ చేసి ఆ సొమ్ముకు ప్రాజెక్టులో వచ్చే వాటా? లేదా వడ్డీ రూపంలో ఇవ్వాలా? తదితర అంశాలపై కూడా కేంద్రం నుంచి వచ్చే సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. కసరత్తు చేస్తున్నాం... స్మార్ట్‌సిటీ సమావేశంలో బాండ్లు జారీ ద్వారా నిధులు సమీకరణ అంశంపై సూచనలిచ్చారు. అయితే క్రెడిట్‌రేటింగ్ ఏజెన్సీ ద్వారా కాకినాడకు ట్రిఫుల్–బి వచ్చి కొంత మేరకు అర్హత సాధించగలిగాం. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేశాక విధివిధానాలు ప్రకటిస్తాం. – ఎస్.అలీమ్‌భాషా, కాకినాడ కార్పొరేష¯ŒS కమిషనర్ -
జనధనం..అద్దెల పర్వం
చెత్త తరలింపు వాహనాలకు అద్దెగా భారీ మొత్తం చెల్లిస్తున్న నగరపాలక సంస్థ 10 ట్రాక్టర్ల 5 నెలల అద్దె రూ.43.5 లక్షలు, ఏడాదికి రూ.1.04 కోట్లు ఆ సొమ్ముతో 17 కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేసే అవకాశం అయినా ఆ దిశగా ఆలోచించని అధికార యంత్రాంగం ప్రజలు రకరకాల పన్నులుగా చెల్లించగా సమకూరిన సొమ్ములో ప్రతి రూపాయినీ ఆచితూచి వెచ్చించాల్సిన రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. నగరంలోని చెత్త తరలింపులో అధికారులు అనుసరిస్తున్న అనాలోచిత విధానమే ఇందుకు సాక్ష్యం. ‘జనధనం అద్దెలపరం’ అన్న చందంగా.. చెత్త తరలించేందుకు ట్రాక్టర్లు, టిప్పర్ల అద్దెకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వారు ఆ మొత్తంతో కొత్త వాహనాలనే సమకూర్చుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచించకపోవడం గమనార్హం. సాక్షి, రాజమహేంద్రవరం : ప్రస్తుతం అద్దె ప్రాతిపాదికన నడుస్తున్న చెత్త తరలింపు ట్రాక్టర్ల కాంట్రాక్ట్‌ను మరో ఐదు నెలలు పొడిగించి, అందుకు అవసరమయ్యే నిధుల ఆమోదానికి సంబంధించిన ప్రతిపాదనలను యంత్రాంగం స్థాయీ సంఘం ముందుకు తెచ్చింది. ఐదు నెలల పాటు చెత్తను తరలించేందుకు 10 ట్రాక్టర్లకు రూ.43,50,000 చెల్లించేందుకు నిర్ణయించింది. అదే విధంగా చెత్త తరలించేందుకే మరో 8 టిప్పర్లు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు ఐదు నెలలకు రూ. 45,12,000 చెల్లించేందుకు టెండర్లు ఖరారు చేసింది. ఈ టెండరును షా క¯ŒSస్ట్రక్ష¯ŒS దఖలు చే సింది. ఐదు నెలల కాలానికి 10 ట్రాక్టర్లు, 8 టిప్పర్లకు రూ.87,62,000 నగరపాలక సంస్థ ఆ కంపెనీకి చెల్లించనుంది. ఇందుకు సంబంధించి అవసరమైన నిధులు కేటాయించాలంటూ అధికార యంత్రాంగం స్థాయీ సంఘం ముందుకు ప్రతిపాదనలు తెచ్చింది. అయితే గత నెలలో జరగాల్సిన స్థాయి సంఘం సమావేశం వాయిదా పడడంతో ఈ ప్రతిపాదనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ.2900 చొప్పున నెలకు రూ.87,000 నగరపాలక సంస్థ సంబంధిత కంపెనీకి చెల్లిస్తోంది. ఇలా ఏడాదికి రూ.10,44,000 ఖర్చు అవుతుంది. కొత్త ట్రాక్టర్, హైడ్రాలిక్ ట్రక్కు వెల దాదాపు రూ.6 లక్షలు ఉంటుంది. 10 ట్రాక్టర్ల ఏడు నెలల అద్దెతో 10 కొత్త ట్రాక్టర్లను కొనుగోలు చేయవచ్చు. ఏడాదికి ట్రాక్టర్ల అద్దె కోసం ఖర్చు చేసే రూ.1.04 కోట్లతో 17 ట్రాక్టర్లు కొనుగోలు చేయవచ్చు. ఇదే విధంగా టిప్పర్లకు కేటాయించే నిధులతో సొంత వాహనాలను సమకూర్చుకోవచ్చు. అయితే ఈ దిశగా యంత్రాంగం ఆలోచించకపోవడం గమనార్హం. కౌన్సిల్‌కు రాకుండా ఐదు నెలలకే టెండర్లు.. నగరంలోని 50 వార్డుల్లో చెత్తను తరలించేందుకు నగరపాలక సంస్థకు 36 వాహనాలు ఉన్నాయి. ఇందులో 12 ట్రాక్టర్లు, ఆరు టిప్పర్లు నగరపాలక సంస్థ సొంత వాహనాలు కాగా మిగిలిన 18 వాహనాలు అద్దె ప్రాతిపదికన తిప్పుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 9 ట్రాక్టర్లు, మరో 9 టిప్పర్లు ఉన్నాయి. ప్రస్తుతం 10 ట్రాక్టర్లు, 8 టిప్పర్లు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ. 2,840.50 ఇస్తుండగా ఈ సారి రూ.3,150.50లకు మిగతా కంపెనీల కన్నా తక్కువ ధరకు షా క¯ŒSస్ట్రక్ష¯ŒS టెండర్ దాఖలు చేసింది. అయితే షా ధర కూడా గతం కన్నా ఎక్కువగా ఉండడంతో యంత్రాగం బేరమాడి చివరకు రూ.2,900లకు నిర్ణయించినట్లు స్థాయీ సంఘానికి పంపిన ఎజెండాలో పేర్కొంది. ఇదే విధంగా టిప్పర్ రోజు వారీ అద్దె రూ. 3,760గా నిర్ణయించింది. ఐదు నెలల కాలానికి 10 ట్రాక్టర్లకు రూ.43,50,000, 8 టిప్పర్లకు రూ.45,12,000 కలిపి మొత్తం రూ.87,62,000 సంబంధిత కంపెనీకి చెల్లించనుంది. రూ.50 లక్షలు మించిన పనులకు కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉండడంతో ఏడాదికి కాకుండా రూ. 50 లక్షల లోపు ప్రతిపాదనలు వచ్చేలా ఐదు నెలలకే అధికార యంత్రాంగం టెండర్లు పిలవడం గమనార్హం. అద్దె ట్రాక్టర్లపై కార్పొరేష¯ŒS సిబ్బంది విధులు నగరపాలక సంస్థలో ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 1,350 మంది ఉన్నారు. వీరు ఆయా డివిజన్లలో ఎప్పటికప్పడు చెత్తను తొలగిస్తుంటారు. అద్దె ట్రాక్టర్లు, టిప్పర్లపై డ్రైవర్, పారిశుద్ధ్య సిబ్బందిని సంబంధిత కంపెనీ నియమించాల్సి ఉంటుంది. కానీ పారిశుద్ధ్య సిబ్బందిని నియమించకుండా నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులనే ఉపయోగిస్తున్నట్లు పలువురు కార్పొరేటర్లు పేర్కొంటున్నారు. ఇలాంటప్పుడు కేవలం ట్రాక్టర్ల అద్దె కోసమే కోట్ల రూపాయల ప్రజాధనం ఎవరికో చెల్లించడం కన్నా నగరపాలక సంస్థ సొంతంగా ఆ సొమ్ముతో కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే భారీగా ప్రజా ధనం ఆదా అవుతుందని సూచిస్తున్నారు. ప్రజాధనం వృథా చేయడం తగదు కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయడం తగదు. 10 అద్దె ట్రాక్టర్లు, 8 టిప్పర్లకు ఏడాదిపాటు చెల్లించే నిధులతో సొంతవి కొనుగోలు చేయవచ్చు. ఒక్కసారి కొనుగోలు చేస్తే అవి నరగపాలక సంస్థ ఆస్తులుగా ఉంటాయి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అద్దె ట్రాక్టర్లు, టిప్పర్లపై డ్రైవర్లు, సిబ్బందిని సంబంధిత కంపెనీ నియమించాల్సి ఉండగా నగరపాలక సిబ్బందినే ఉపయోగిస్తున్నారు. – మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ -
రూ.1600 కోట్లు ప్రజాధనం వృథా
కమీషన్ల కోసమే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపణ పేరవరం(ఆత్రేయపురం): రూ.1600 కోట్లతో పురషోత్తపట్నం ఎత్తిపోతల ప«థకం నిర్మించడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్ లో ఎత్తిపోతల పథకం నిర్మాణం వ్యయం రూ.1600 కోట్లులో 22.5 శాతం టెండర్లు ఖారారు చేసి తద్వారా వచ్చే రూ.400 కోట్లు కమీషన్లు సీఎం చంద్రబాబు , లోకేష్ జేబుల్లోకి చేరుతాయని ఆరోపించారు. నదుల అనుసందానం పేరుతో నిధుల అనుసంధానం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చి గెలుపించినందువల్ల ఇక్కడి రైతులకు ఏవిధమైన ప్రయోజనం ప్రభుత్వం చేకూర్చలేదని కేంద్రం ఇచ్చిన పథకాలు మినహ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పధకాలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. అలాగే పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాంట్రక్టర్‌కే ఈ కాంట్రక్టు దక్కుతుందని రైతుల పేరు చెప్పి కోట్లు ప్రజాధనం దోపిడి చేయడం దారణమన్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసి బహిరంగగా పార్టీలు మార్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై ప్రశ్నించినట్లు తెలిపారు. పరోక్షంగా పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రజాస్వామ్యహితం గా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని కేంద్రం ముందు తాకట్టుపెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు ప్రతి సంవత్సరం నియోజక అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నారన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు వారి నియోజక వర్గ అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఓడిన వారికి నిధులు కేటాయిస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్, జిల్లా వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం సభ్యులు రాయి వెంకటేశ్వరరావు, జిల్లా వైఎస్సార్సీపీ కార్యదర్శి మార్గన గంగాదరరావు, ఎంపీపీ కోట చెల్లయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్య వర్మ తదితరులు పాల్గొన్నారు. -
''సొంత సొమ్ముతో సీఎం మొక్కులు చెల్లించాలి''
-
ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోండి
సుప్రీంకోర్టుకు విద్యార్థి లేఖ.. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం హైదరాబాద్: జాతీయ జెండా రంగులు రాజకీయ పార్టీలకు ఉండటం, ఎన్నికల్లో ఒకే అభ్యర్థి రెండు మూడు స్థానాల్లో పోటీ చేసి అనంతరం రాజీనామా చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తదితర అంశాలపై చైతన్యపురికి చెందిన రామిని ఈశ్వరచంద్ర రాసిన లేఖకు సుప్రీం కోర్టు స్పందించింది. గత ఏప్రిల్‌లో ఈశ్వరచంద్ర సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రెండు పేజీల లేఖను రాశాడు. ఉమ, శ్రీనివాస్ దంపతుల కుమారుడు ఈశ్వర చంద్ర స్థానిక జీనియస్ గ్రామర్ స్కూల్లో 7వతరగతి చదువుతున్నాడు. జాతీయ జెండాను పోలిన పార్టీ జెండాలు ఉండటం, గవర్నర్లుగా మాజీ మంత్రులు, మాజీ గవర్నర్లను తిరిగి మంత్రులుగా తీసుకోవటం ఎంతవరకు సబబని ఆ లేఖలో ఈశ్వరచంద్ర ప్రశ్నించాడు. మాజీ గవర్నర్ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉండకుండా, ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒకే చోటి నుంచి మాత్రమే పోటీ చేసేలా చూడాలని కోరాడు. ఈ అంశాలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ, ఏపీ ఎన్నికల అధికారికి, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అతని లేఖ ప్రతులను పంపించింది. -
వాస్తు బాగోలేదు.. కూల్చి పారేయ్
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధినాయకులు అందరూ వాస్తు పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు. అసలే ఒకపక్క రాష్ట్రం లోటులో ఉందని, కొత్త రాజధాని నిర్మాణానికి ప్రజలంతా విరివిగా విరాళాలు ఇవ్వాలని జోలె పట్టి మరీ అడుగుతున్న టీడీపీ నాయకులు.. వాస్తు పేరుతో పదే పదే భవనాలు మారుస్తూ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబు తాత్కాలికంగా పరిపాలన సాగించడానికి సచివాలయంలోని హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించి సర్వహంగులూ పూర్తి చేశారు. అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన సన్నిహితులు, జ్యోతిష్యులు దాన్ని పరిశీలించి వాస్తు సరిగా లేదంటూ.. సీఎం కోసం ఎల్ బ్లాకును ఎంపిక చేశారు. దాంతో హెచ్ బ్లాకులో వెచ్చించిన రూ. 3 కోట్లు వృథా అయ్యాయి. తర్వాత మళ్లీ పది కోట్ల రూపాయలు వెచ్చించి ఎల్ బ్లాకులో కొత్తగా పనులు చేపడుతున్నారు. ఇవి మూడునెలల్లో పూర్తవుతాయని, ఆ తర్వాత ఆయన అందులోకి వెళ్తారని చెప్పారు. ఇక ఆయన బాటలోనే ఆయన అనుంగు సహచరుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా పయనిస్తున్నారు. తాజాగా విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో ఉమా ఆదేశాల మేరకు ఓ భవంతిని కూల్చారు. వాస్తు ప్రకారం లేదని ఆమాత్యులు హుకుం జారీ చేయడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ బిల్డింగ్‌ను కూల్చేశారు. ఈ భవనంలో రెండో అంతస్తు కోసం ఇటీవలే పదిలక్షల రూపాయల మేర ఖర్చు పెట్టాటి అధికారులు.. మంత్రి ఆదేశంతో మరోమాట మాట లేకుండా కూల్చేశారు. ఇలా టీడీపీ నాయకులు ఎవరికి తోచిన స్థాయిలో వాళ్లు ప్రజాధనాన్ని వృథా చేస్తూనే ఉన్నారు.