
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ సహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ప్రజాధనంతో ఇచ్చే రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసీసీ ఆదివారం ఓ లేఖ రాసింది.
తెలంగాణలోని ఆపద్ధర్మ ప్రభుత్వం, నాలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం భారీ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రసార మాధ్యమాలకు, పత్రికలకు, వెబ్‌సైట్లకు ప్రకటనలు ఇస్తున్నాయని లేఖలో పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోతో ఇచ్చే ప్రకటనలకు ప్రజాధనం ఖర్చు చేయకుండా తెలంగాణ సీఎస్‌కు ఆదేశాలివ్వాలని కోరింది.