సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాల్లో ప్రజల డిపాజిట్లపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, ప్రజల సొమ్ము భద్రంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. డిపాజిట్‌దారుల ప్రయోజనాలకు ఏ రకంగానూ విఘాతం కలగదని స్పష్టం చేశారు. ప్రధాని బుధవారం ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపాదిత ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ఫలితంగా డిపాజిట్‌దారుల సొమ్ము ప్రశ్నార్థకమవుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసే చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, అయితే సోషల్ మీడియాలో ఎఫ్ఆర్‌డీఐ బిల్లుపై వదంతులు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. తాము డిపాజిట్‌దారులు, బ్యాంకుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లులోని బెయిల్ ఇన్ నిబంధనపై నెలకొన్న వివాదాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులు దివాలా తీసే పక్షంలో డిపాజిట్‌దారుల ఖాతాల్లో నగదును సర్దుబాటు చేసుకునేందుకు బ్యాంకులను బెయిల్ ఇన్ నిబంధన అనుమతిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment