Bank depositors
-
జనాల మీదకు యుద్ధ ట్యాంకర్లు.. మళ్లీ మారణహోమం?!
బీజింగ్: చైనాలో వరుస సంక్షోభాలు అక్కడి ప్రజలను అరిగోస పెడుతున్నాయి. తాజాగా కొన్ని బ్యాంకులు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో.. ఖాతాదారులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోనుపోనూ ఈ నిరసనలు పెను ఉద్యమంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రజలను నిలువరించేందుకు యద్ధ ట్యాంకర్లను రంగంలోకి దించించి జింగ్‌పిన్ సర్కార్. కొన్ని బ్యాంకులు ఏప్రిల్ నుంచి తమ ఖాతాదారులు నగదును విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుకుంటున్నాయి.హెనన్ ప్రావిన్స్‌లో గ్రామీణ, పట్టణ బ్యాంకులు కారణాలు చెప్పకుండా ఖాతాదారులకు షాకులు ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల స్కామ్‌కు ప్రభుత్వం నుంచి అండ లభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నివారాలుగా బ్యాంక్ ఖాతాదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలుచోటు చేసుకుంటున్నాయి. బ్యాంకుల మీద దాడులు జరుగుతాయనే ఉద్దేశం, బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవద్దనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో.. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ ట్యాంకర్లను బ్యాంకుల వద్ద మోహరిస్తోంది. నిరసనకారులు దాడులకు పాల్పడకుండా భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే నిరసనకారులు మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. నిధుల నిలిపివేతను ఉపసంహరించుకుని.. తమ డబ్బుల్ని ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 🚨🚨🚨🚨Breaking news🚨🚨🚨🚨 Tanks are being put on the streets in China to protect the banks. This is because the Henan branch of the Bank of China declaring that people's savings in their branch are now 'investment products' and can't be withdrawn. 🔊sound pic.twitter.com/cwTPjGz84K — Wall Street Silver (@WallStreetSilv) July 20, 2022 చరిత్ర పునరావృతం అయ్యేనా.. తాజా వీడియోలతో అక్కడి జనాల వెన్నులో వణుకుపుడుతోంది. అందుకు కారణం.. టియానన్మెన్ స్క్వేర్ మారణహోమం గుర్తుకు రావడం. ప్రజాస్వామ్య పద్దతులు కావాలని, స్వేచ్ఛను కోరుతూ వేల మంది విద్యార్థులు బీజింగ్‌లోని టియానన్మెన్ స్క్వేర్ వద్ద నిరసనలు కొనసాగించారు. వాళ్లను అక్కడి నుంచి క్లియర్ చేయడానికి భారీగా ఆర్మీని రంగంలోకి దించింది ప్రభుత్వం. సుమారు నెలపాటు జరిగిన మారణ హోమంలో వందల మంది(వేల మంది అని చెప్తుంటారు) మరణించారు. వాళ్లకు స్మారకంగా.. అక్కడొక స్థూపాన్ని సైతం నిర్మించేందుకు అనుమతించలేదు. దీంతో హాంకాంగ్‌లో ఓ యూనివర్సిటీ బయట ఏర్పాటు చేశారు. అయితే.. ఆ స్మారకాన్ని సైతం బలవంతంగా తొలగించింది చైనా. అన్నట్లు మొన్న జూన్ 4వ తేదీకి టియానన్ మారణహోమానికి 33 ఏళ్లు నిండాయి. ఆ ఘటనలో.. యుద్ధ ట్యాంకర్ల ఎదురుగా ఓ వ్యక్తి ధైర్యంగా నిల్చున్న ఫొటో ఒకటి చరిత్రకెక్కింది కూడా. -
డిపాజిటర్లకు మరింత రక్షణ
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభాల్లో చిక్కుకున్న బ్యాంకు డిపాజిటర్లకు గరిష్టంగా రూ.5లక్షల వరకు బీమా సదుపాయం కల్పించే డీఐసీజీసీ సవరణ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 90 రోజుల్లోపు సంక్షోభాల్లోని బ్యాంకు డిపాజిటర్లకు చెల్లింపులు ప్రారంభమవుతాయి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టానికి చేసిన సవరణలను కేంద్ర సర్కారు సోమవారం నోటిఫై చేసింది. ఈ నెల మొదట్లో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు 2021కి పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటికే డిపాజిట్ల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) డిపాజిటర్లకు ఊరట లభించనుంది. ప్రస్తుతానికి బ్యాంకులు విఫలం అయితే డిపాజిట్లకు డీఐసీజీసీ కింద చెల్లింపులకు 8–10 ఏళ్ల సమయం తీసుకుంటోంది. బ్యాంకు డిపాజిటర్లకు గతంలో రూ.లక్ష వరకే బీమా సదుపాయం ఉండేది. పీఎంసీ బ్యాంకు, యస్ బ్యాంకు తదితర సంక్షోభాలతో బీమ సదుపాయాన్ని రూ.5లక్షలకు పెంచుతూ కేంద్ర సర్కారు గతేడాది నిర్ణయం తీసుకుంది. అంతేకాదు 2020 ఫిబ్రవరి 4 నుంచే పెంచిన కవరేజీ అమల్లోకి కూడా వచ్చింది. ఇందుకు సంబంధించి చట్టంలోనూ మార్పులను తీసుకొచ్చింది. ‘‘మొదటి 45 రోజుల సమయంలో బ్యాంకు అన్ని ఖాతాల వివరాలను తీసుకోవాలి. ఈ సమయంలోనే డిపాజిట్ దారులు క్లెయిమ్ చేసుకోవాలి. తర్వాత ఈ వివరాలను డీఐసీజీసీకి పంపుతారు. 90వ రోజు నుంచి డిపాజిట్లకు చెల్లింపులు మొదలువతాయి’’ అని ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. -
డిపాజిట్లపై బీమా పెంపు... మాకు సమాచారం లేదు
న్యూఢిల్లీ: బ్యాంక్ డిపాజిట్‌దారుడు ప్రస్తుతం రూ. లక్ష వరకూ మాత్రమే తన డిపాజిట్‌కు రక్షణ పొందగలుగుతాడు. ఇందులో ఎటువంటి మార్పూ లేదు. బ్యాంక్‌లో వేసే డిపాజిట్లపై బీమా పెంపు సమాచారం ఏదీ తమకు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుబంధ విభాగం డీఐసీజీసీ(డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్) స్పష్టంచేసింది. ప్రస్తుతం బ్యాంక్ డిపాజట్లపై బీమా రక్షణ రూ. లక్ష వరకూ ఉంది. అయితే ఈ బీమా రక్షణను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని గతనెల్లో ఆరి్థకశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందనీ సూచించారు. వ్యక్తిగత డిపాజిట్లకు సంబంధించి రూ. 5 లక్షల వరకూ బీమా పెంపు నిర్ణయం తీసుకోవాలని శంకర భారతీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన డిమాండ్ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. శంకర్ భారతీ ఆఫీస్ బేరర్లలో పలువురు ఆర్ఎస్ఎస్కు దగ్గరివారు కావడం గమనార్హం. ఆర్టీఐ కింద డీఐసీజీసీ సమాచారం... సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వచి్చన ఒక దరఖాస్తుకు డీఐసీజీసీ సమాధానం ఇస్తూ, ‘‘బీమా పెంపునకు సంబంధించిన సమాచారం ఏదీ కార్పొరేషన్‌కు చేరలేదు’’ అని తెలిపింది. డీఐసీజీసీ చట్టం, 1961 సెక్షన్ 16 (1) ప్రకారం దివాలా చర్యల కిందకు వెళ్లిన బ్యాంక్‌కు సంబంధించిన ఒక డిపాజిట్దారునకు అసలు, వడ్డీతో కలిపి రూ. లక్ష వరకే బీమా ఉంటుంది. అంటే రూ.లక్షలోపు డిపాజిట్‌దారు తన సొమ్మును పూర్తిస్థాయిలో పొందగలుగుతాడు. రూ. లక్ష పైన ఎంత డిపాజిట్ ఉన్నా... సంబంధిత డిపాజిట్ దారుకు రూ. లక్ష మొత్తమే బీమా కింద అందుతుంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ ఏరియా బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ బ్రాంచీలుసహా అన్ని కమర్షియల్ బ్యాంకులకు కార్పొరేషన్ నుంచి బీమా కవరేజ్ ఉంటుంది. పలు బ్యాంకులు తీవ్ర మోసాల్లో ఇరుక్కుంటూ, ప్రజల పొదుపులను ఇబ్బందుల్లోకి నెడుతున్న నేపథ్యంలో తాజా అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎంసీ బ్యాంక్ ఇటీవలే ఈ తరహా ఇబ్బందుల్లోకి జారిన విషయం ఇక్కడ గమనార్హం. -
బ్యాంకుల్లో మీ సొమ్ము భద్రం
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాల్లో ప్రజల డిపాజిట్లపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, ప్రజల సొమ్ము భద్రంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. డిపాజిట్‌దారుల ప్రయోజనాలకు ఏ రకంగానూ విఘాతం కలగదని స్పష్టం చేశారు. ప్రధాని బుధవారం ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపాదిత ఎఫ్ఆర్డీఐ బిల్లు ఫలితంగా డిపాజిట్‌దారుల సొమ్ము ప్రశ్నార్థకమవుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసే చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, అయితే సోషల్ మీడియాలో ఎఫ్ఆర్డీఐ బిల్లుపై వదంతులు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. తాము డిపాజిట్‌దారులు, బ్యాంకుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎఫ్ఆర్డీఐ బిల్లులోని బెయిల్ ఇన్ నిబంధనపై నెలకొన్న వివాదాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులు దివాలా తీసే పక్షంలో డిపాజిట్‌దారుల ఖాతాల్లో నగదును సర్దుబాటు చేసుకునేందుకు బ్యాంకులను బెయిల్ ఇన్ నిబంధన అనుమతిస్తుంది. -
ఎఫ్ఆర్డీఐ బిల్లు డిపాజిటర్లకు వరమా? శాపమా?
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్న వివాదాస్పద ఎఫ్ఆర్డీఐ బిల్లు డిపాజిటరీ ఫ్రెండ్లీగా ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీల వాదనలకు విరుద్ధంగా, డిపాజిటర్ల హక్కులను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రం ప్రభుత్వం తీసుకురానున్న కొత్త ఎఫ్ఆర్డీఐ బిల్లు చట్టం రూపం దాలిస్తే డిపాజిట్లర్లకు తీవ్ర నష్టం కలగనుందనే వార్తలు మార్కెట్లో హల్ చల్ చేయడంతో గురువారం జైట్లీ ట్విట్టర్ ద్వారా ఈ వివరణ ఇచ్చారు. ముఖ్యంగా 'బెయిల్ ఇన్' క్లాజ్ పై చెలరేగిన ఆందోళనపై జైట్లీ ట్వీట్ చేశారు ఫైనాన్షియల్ రిజుల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు, 2017 (ఎఫ్ఆర్డీఐ బిల్) లోని "బెయిల్-ఇన్" (దివాలా తీసే పరిస్థితిలో ఉన్న బ్యాంకుకు కొంత ఊరట కల్పించడానికి సెక్షన్ 52(1)) నిబంధనలపై అనేక అందోళనలు వార్తల్లో నిలిచాయి. బిల్లులో ఈ కార్పొరేషన్‌కు తిరుగులేని అధికారాలు కట్టబెట్టే అవకాశంఉందని, దివాలా తీసిన బ్యాంకు అప్పులన్నింటినీ ఈ కార్పొరేషన్ రద్దు చేయడంతోపాటు, ఖాతాదారుల సొమ్మును రద్దు చేసేయవచ్చనీ, దీంతో ఖాతాదారుల డబ్బును కూడా బ్యాంకులు తిరిగి ఇవ్వక్కర్లేదను వార్తలు ఆందోళనకు తెరతీశాయి. నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న నిబంధనలతో పోల్చిస్తే మరింత భద్రత కల్పిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనలు డిపాజిటర్లకు ప్రస్తుత రక్షణలను ప్రతికూలంగాఉండవని స్పష్టం చేశారు. డిపాజిటర్ల సొమ్మకు తమది హామీఅని , మరింత పారదర్శక పద్ధతిలో అదనపు రక్షణలను అందిస్తోందని తెలిపింది. 2017, ఆగస్టు 10న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు పార్లమెంటరీ జాయింట్ కమిటీ పరిశీలనలో ఉంది. దీని విధివిధానాలు, నిబంధనల రూపకల్పనపై వివిధ వర్గాల వారితో కమిటీ ఇప్పటికే చర్చలు నిర్వహిస్తోంది. -
గుజరాత్‌కు పెట్టుబడుల వెల్లువ!
వైబ్రంట్ గుజరాత్ సదస్సులో కార్పొరేట్ల క్యూ ⇒ రూ. లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రకటించిన ⇒ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ⇒ ఆదిత్య బిర్లా రూ.20,000 కోట్ల పెట్టుబడులు... ⇒ జాబితాలో విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు కూడా.. గాంధీనగర్: గుజరాత్‌కు పెట్టుబడులు పోటెత్తనున్నాయి. ఆదివారం ఇక్కడ ప్రధాని మోదీ ప్రారంభించిన ఏడో వైబ్రంట్ గుజరాత్ సదస్సు(వీజీఎస్)లో దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గజాలు పోటాపోటీగా భారీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు. ఈ మూడు రోజుల సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులు, వివిధ దేశాల నేతలు హాజరయ్యారు. గుజరాత్ సీఎంగా మోదీ హయాంలో 2003లో తొలిసారిగా ఆరంభించిన వీజీఎస్ అప్పటినుంచీ ప్రతి రెండేళ్లకోసారి జరుగుతూ వస్తోంది. కాగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, తీవ్ర ఒడిదుడుకులు ఆందోళన కలిగిస్తున్నాయని మోదీ ఈ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. స్థిరమైన, సమ్మిళిత ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌తో కలిసికట్టుగా సాగేందుకు ప్రపంచంలో అనేక దేశాలు ముందుకొస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ముకేశ్ అంబానీ జోష్... వీజీఎస్ ప్రారంభం రోజే రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడులను గుజరాత్లో వెచ్చించనున్నట్లు ప్రకటించారు. రానున్న 12-18 నెలల కాలంలో తమ గ్రూప్‌లోని పలు వ్యాపార విభాగాల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ సారథ్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించనుందని ముకేశ్ చెప్పారు. పెట్రోకెమికల్ ప్లాంట్లలో సామర్థ్య విస్తరణ, 4జీ టెలికం బ్రాడ్‌బ్యాండ్ సేవల ప్రారంభంతోపాటు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యకలాపాల్లో రిలయన్స్ తమవంతు సహకారాన్ని అందిస్తుందన్నారు. ఇప్పటిదాకా జరిగిన వీజీఎస్లన్నింటికీ తాను హాజరయ్యానన్న ముకేశ్... మోదీని ప్రపంచ నాయకుడిగా అభివర్ణించారు. భారత్‌కు ఆయన గర్వకారణమని వ్యాఖ్యానించారు. గుజరాత్‌కే ప్రాధాన్యం: బిర్లా కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా వీజీఎస్ సందర్భంగా గుజరాత్లో రూ.20,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సిమెంట్ ఇతరత్రా ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు బిర్లా తెలిపారు. గ్రూప్‌నకు గుజరాత్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడుల గమ్యస్థానమని కూడా పేర్కొన్నారు. హాజరైన ఇతర కార్పొరేట్లలో అడాగ్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీ, హిందూజా గ్రూప్‌నకు చెందిన శశి రూయా, భారతీ గ్రూప్ సునీల్ మిట్టల్, ఆది గోద్రెజ్, ఉదయ్ కొటక్, ఏఎం నాయక్, ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ, ఓఎన్జీసీ సీఎండీ డీకే షరాఫ్ తదితరులు ఉన్నారు. ఇక విదేశీ కంపెనీల విషయానికొస్తే.. ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం రియో టింటో గుజరాత్‌లోని వజ్రాలు సానబట్టే పరిశ్రమలో 30,000 కొత్త ఉద్యోగాల కల్పించనున్నట్లు వెల్లడించింది. అంత్యంత నమ్మకమైన వ్యాపార గమ్యంగా నిలుస్తున్న గుజరాత్‌తో మున్ముందు మరింతగా కలిసి పనిచేస్తామని కంపెనీ సీఈఓ శామ్ వాల్ష్ చెప్పారు. తమ కంపెనీ భారత్‌పై చాలా ఆశావహంగా ఉందని.. గడిచిన ఏడాది వ్యవధిలో 25 కోట్ల డాలర్లను ఇక్కడ వెచ్చించినట్లు మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం కానుందని జపాన్ వాహన దిగ్గజం సుజుకీ చైర్మన్ ఒసాము సుజుకీ పేర్కొన్నారు. గుజరాత్లో నిర్మిస్తున్న తమ కొత్త ప్లాంట్ 2017కల్లా ఉత్పత్తికి సిద్ధమవుతుందన్నారు. ఈ ప్లాంట్కోసం రూ.4,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మరిన్ని సంస్కరణలు అవసరం... వీజీఎస్లో పాల్గొన్న కార్పొరేట్ దిగ్గజాలు, నిపుణులు భారత్‌లో మరిన్ని ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాలని సూచించారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి పన్నులు, సబ్సిడీల్లో కీలక సంస్కరణలు ఆవశ్యకమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా మోదీ అద్భుత పాలనను ఇప్పుడు భారత్‌వ్యాప్తంగా ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారని మాస్టర్ కార్డ్ చీఫ్, అమెరికా-ఇండియా వ్యాపార మండలి చైర్మన్ అజయ్ బంగా చెప్పా రు. అమెరికా ఇన్వెస్టర్లు భారత్‌పై చాలా ఆసక్తిగా ఉన్నారని.. ఇరు దేశాల మధ్య వారధిగా వ్యహరించేందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అదానీ హల్చల్.. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్, అమెరికా కంపెనీ సన్ ఎడిసన్ కలిపి గుజరాత్లో భారీ సోలార్(సౌర విద్యుత్) పార్క్‌ను నెలకొల్పనున్నాయి. ఇరు కంపెనీలు జాయింట్ వెంచర్(జేవీ)గా నిర్మించే ఈ సోలార్ పార్కు కోసం రూ.25,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వైబ్రంట్ అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు 20,000 ఉద్యోగాలను ఇది కల్పించనుందని కూడా తెలిపింది. అదానీ గ్రూప్‌తో జట్టుకట్టడం ద్వారా భారత్‌లోనే అతిపెద్ద ఫోటోవోల్టాయిక్(సోలార్) ప్యానల్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండం తమకు గర్వకారణమని సన్ ఎడిసన్ సీఈఓ అహ్మద్ చాటిలా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ద్రవీకృత సహజవాయువు(ఎన్ఎన్జీ) దిగుమతితోపాటు చమురు-గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తిలో సహకారం కోసం ఆస్ట్రేలియా ఇంధన దిగ్గజం ఉడ్‌సైడ్ ఎనర్జీతో అదానీ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్య ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఉడ్‌సైడ్ ఎనర్జీ సీఈఓ పీటర్ కోల్మన్ సంతకాలు చేశారు. మోదీతో అదానీకి సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వెలుగురేఖ భారత్: కిమ్ గాంధీనగర్: మందగమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగురేఖగా నిలుస్తోందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పేర్కొన్నారు. ఆదివారమిక్కడ మొదలైన వైబ్రంట్ గుజరాత్ సదస్సులో మాట్లాడుతూ... ఈ ఏడాది(2015)లో ఇండియా వృద్ది రేటు 6.4 శాతానికి పుంజుకోవచ్చని అంచనా వేశారు. వచ్చే ఏడాది ఈ జోరు మరింత పెరగనుందని కూడా చెప్పారు. అయితే, కుల పరమైన పక్షపాత ధోరణలు, ఇతరత్రా అంశాలు ప్రగతికి అడ్డంకిగా నిలుస్తాయని ఆయన హెచ్చరించారు. దేశ ఆర్థిక ఫలాలను ప్రజలందరికీ పంచే విధంగా ప్రధాని మోదీ పలు పథకాలపై దృష్టిపెట్టారని... దీనివల్ల వృద్ధి రేటు కూడా పుంజుకోవడానికి దోహదపడుతుందని కిమ్ అభిప్రాయపడ్డారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 5 శాతం దిగువకు పడిపోయిన వృద్ధి రేటు ప్రస్తుత 2014-15 సంవత్సరంలో కొంత మెరుగుపడిన(క్యూ1లో 5.7%, క్యూ2లో 5.3%) సంగతి తెలిసిందే. ఈ ఏడాది 7 శాతం వృద్ధి: పీడబ్ల్యూసీ నిర్మాణాత్మక సంస్కరణల నేపథ్యంలో భారత్‌లో ఈ ఏడాది(2015) వృద్ధి రేటు 7 శాతాన్ని అందుకోవచ్చని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ముడి చమురు ధరల భారీ క్షీణత స్వల్పకాలంలో జీడీపీకి చేయూతనిస్తాయని అభిప్రాయపడింది. మరోపక్క, చైనాలో వృద్ధి రేటు మందగించొచ్చని పేర్కొంది. కాగా, పెట్టుబడులు ఇంకా పుంజుకోవాల్సిన నేపథ్యంలో 2014-15 ద్వితీయార్ధంలో(క్యూ3, క్యూ4) వృద్ధి రేటు కాస్త తగ్గే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. అయితే, సంస్కరణలను వేగంగా అమలు చేయడం, ముడిచమురు దరల తగ్గుముఖం... వృద్ధికి చేయూతనిస్తాయని హెచ్ఎస్బీసీ తెలిపింది. -
డిపాజిటర్ల అవగాహన కోసం ఆర్బీఐ గ్రాంట్లు
స్వచ్ఛంద సంస్థల దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 27 న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిటర్లకు అవగాహన కల్పించటానికి రిజర్వుబ్యాంక్ నూతన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దీనికోసం ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’ను ఏర్పాటుచేసింది. డిపాజిటర్లకు అవగాహన కల్పించే వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక తోడ్పాటునివ్వటానికి ఈ ఫండ్ నుంచి వాటికి గ్రాంట్లను మంజూరుచేయనుంది. గ్రాంట్లు పొందే సంస్థలు డిపాజిటర్లకు సురక్షితమైన బ్యాంకు లావాదేవీలు, భద్రత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాల్ని, సదస్సులను నిర్వహించాలని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక విధానాలు, విషయాలపట్ల ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాల్ని కూడా చేపట్టవచ్చని తెలిపింది. డిపాజిటర్లకు అవగాహన కల్పించేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు గ్రాంటు కోసం ఫిబ్రవరి 27 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అలాగే ఫండ్ కోసం ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలను విడుదలచేసింది. పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని, వినియోగంలోలేని అకౌంట్ల డబ్బుల్ని బ్యాంకులు వడ్డీతో సహా ఈ ఫండ్‌కు బదిలీ చేయాలని సూచించింది. ఈ ఫండ్ ఒక కమిటీ ఆధీనంలో ఉంటుందని పేర్కొంది.