సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్న వివాదాస్పద ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు డిపాజిటరీ ఫ్రెండ్లీగా ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీల వాదనలకు విరుద్ధంగా, డిపాజిటర్ల హక్కులను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రం ప్రభుత్వం తీసుకురానున్న కొత్త ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు చట్టం రూపం దాలిస్తే డిపాజిట్లర్లకు తీవ్ర నష్టం కలగనుందనే వార‍్తలు మార్కెట్లో హల్ చల్ చేయడంతో గురువారం జైట్లీ ట్విట్టర్ ద్వారా ఈ వివరణ ఇచ్చారు. ముఖ్యంగా 'బెయిల్ ఇన్' క్లాజ్ పై చెలరేగిన ఆందోళనపై జైట్లీ ట్వీట్ చేశారు
ఫైనాన్షియల్ రిజుల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు, 2017 (ఎఫ్‌ఆర్‌డీఐ బిల్) లోని "బెయిల్-ఇన్" (దివాలా తీసే పరిస్థితిలో ఉన్న బ్యాంకుకు కొంత ఊరట కల్పించడానికి సెక్షన్ 52(1)) నిబంధనలపై అనేక అందోళనలు వార్తల్లో నిలిచాయి. బిల్లులో ఈ కార్పొరేషన్‌కు తిరుగులేని అధికారాలు కట్టబెట్టే అవకాశంఉందని, దివాలా తీసిన బ్యాంకు అప్పులన్నింటినీ ఈ కార్పొరేషన్ రద్దు చేయడంతోపాటు, ఖాతాదారుల సొమ్మును రద్దు చేసేయవచ్చనీ, దీంతో ఖాతాదారుల డబ్బును కూడా బ్యాంకులు తిరిగి ఇవ్వక్కర్లేదను వార్తలు ఆందోళనకు తెరతీశాయి. నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న నిబంధనలతో పోల్చిస్తే మరింత భద్రత కల్పిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనలు డిపాజిటర్లకు ప్రస్తుత రక్షణలను ప్రతికూలంగాఉండవని స్పష్టం చేశారు. డిపాజిటర్ల సొమ్మకు తమది హామీఅని , మరింత పారదర్శక పద్ధతిలో అదనపు రక్షణలను అందిస్తోందని తెలిపింది.
2017, ఆగస్టు 10న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు పార్లమెంటరీ జాయింట్ కమిటీ పరిశీలనలో ఉంది. దీని విధివిధానాలు, నిబంధనల రూపకల్పనపై వివిధ వర్గాల వారితో కమిటీ ఇప్పటికే చర్చలు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment