Boon
-
మీర్పుర్ పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ
మీర్పుర్ వేదికగా బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇటీవల ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆసక్తికర రూలింగ్ ఇచ్చింది. మీర్పుర్ పిచ్ (షేర్ ఏ బంగ్లా స్టేడియం, ఢాకా) అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల పిచ్ కాదని ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పిచ్ నాసిరకంగా తయారు చేయబడిందని, పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యిందని, దీని వల్ల ఇరు జట్ల బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మ్యాచ్ రిఫరి డేవిడ్ బూన్ తన నివేదికలో పేర్కొన్నాడు. ప్రమాదకరమైన పిచ్‌ను తయారు చేసినందుకుగాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అక్షింతలు వేసిన ఐసీసీ.. మీర్పుర్ పిచ్‌కు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రిఫరి బూన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మీర్పుర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో న్యూజిలాండ్ 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. బ్యాటర్లకు ఏమాత్రం సహకరించని మీర్పుర్ పిచ్‌పై కివీస్ బౌలర్లు ఒకింత లబ్ది పొందారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 172, రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని (180 ఆలౌట్) పొంది, రెండో ఇన్నింగ్స్‌లో (139/6) అతి కష్టంమీద బంగ్లా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్ అయినప్పటికీ స్పిన్నర్లకు అత్యధిక వికెట్లు లభించడం విశేషం. -
అమ్మకు ఆరోగ్య రక్షణ
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం వారికి వరంగా మారింది. ఒకవైపు ప్రతినెలా ప్రభుత్వాస్పత్రుల్లో 9న ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎం) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా గర్భిణులకు మధుమేహం, బీపీ, రక్త పరీక్షలు, అవసరం మేరకు స్కానింగ్‌లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి గర్భిణికి గ్రామాల్లో నెలలో రెండుసార్లు వైద్యులు సేవలందిస్తున్నారు. నెలకు మూడుసార్లు గర్భిణులకు ప్రసవంలోగా నాలుగుసార్లు, బాలింతలకు ప్రసవానంతరం ఆరుసార్లు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించాలనేది కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధన. హైరిస్క్ గర్భిణులకు 8సార్లు ప్రసవంలోగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ.. ఇతర రాష్ట్రాల్లో లేనట్టుగా మన రాష్ట్రంలో నెలలో మూడుసార్లు గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందుతున్నాయి. పీఎంఎస్ఎం డే రోజున ఆస్పత్రుల్లో ఒకసారి, ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వచి్చన సందర్భంలో రెండుసార్లు చొప్పున వైద్యులు సేవలు అందిస్తున్నారు. మరోవైపు మిగిలిన రోజుల్లో గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో ఉండే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎం వాకబు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతినెలా గర్భిణులు, బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) టెస్ట్ నిర్వహించి రక్తహీనతను పర్యవేక్షిస్తున్నారు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి వారిపై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తీవ్ర రక్తహీనత ఉన్న వారికి కృత్రిమంగా రక్తం ఎక్కించడం, ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు వేయడం చేస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు ఆరోగ్యశ్రీ కింద మూడు స్కాన్లను ఉచితంగా ప్రభుత్వం చేయిస్తోంది. ఇందులో ఒక స్కాన్‌ను వైద్యుల సూచనల మేరకు టిఫ్ఫా స్కాన్ చేయిస్తున్నారు. ఆగస్టులో 2.04 లక్షల మందికి.. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఆగస్టు నెలలో 2.26 లక్షల మంది గర్భిణులకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా 90.41 శాతం 2.04 లక్షల మందికి సేవలు అందించారు. 64,092 బాలింతలకు గాను 92.29 శాతం 59,149 మంది బాలింతలకు వైద్యం చేశారు. గ్రామాలకు వెళుతున్న ఫ్యామిలీ డాక్టర్లు బాలింతల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేస్తున్నారు. మరోవైపు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి గ్రామాల్లోనే గర్భిణులకు 14.74 లక్షలు, బాలింతలకు 5.08 లక్షల సేవలను వైద్య శాఖ అందించింది. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రక్ష కొందరు గర్భిణులు యాంటీనేటల్ కేర్ (ఏఎన్సీ), పోస్ట్‌నేటల్(పీఎన్సీ)కు దూరమైన గర్భిణులు, బాలింతల వివరాలు ఫ్యామిలీ డాక్టర్‌కు ఆన్లైన్లో పంపుతున్నాం. వారికి గ్రామాల్లోనే వైద్యులు సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరం అనుకున్న వారిని దగ్గరలోని పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. మాతా, శిశు మరణాల కట్టడికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రభుత్వం రక్షగా నిలుస్తోంది. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, వైద్య శాఖ -
జగనన్న నాకు ఇచ్చిన గొప్ప వరం..!
-
గతి తప్పిన విధానాలే రైతుకు శాపాలు
నిర్ధేశిత లక్ష్యాల సాధనలో ప్రతియేటా ఆమడదూరంలో వెనుకబడిపోవడం భారత వ్యవసాయరంగం దుస్థితికి అద్దం పడుతుంది. ఆహారధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత.. మొత్తంగా వ్యవసాయాభివృద్ధి రేటును అనుకొన్నవిధంగా ఏ సంవత్సరంలోనూ అందుకోలేకపోవడం అనేక దశాబ్దాలుగా అనుభవంలోకి వచ్చిన వాస్తవం. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న జనాభాకు సరిపోయే పరిమాణంలో ఆహార ధాన్యాలను పండించలేకపోతున్నాం. గతేడాది (2017–18) దేశంలో 27.95 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. దాని ఆధారంగా, 2018–19లో 28.37 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను పండించడం లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. అంటే ఈ యేడాది అదనంగా 42 లక్షల టన్నులు పండించాలి. గత నాలుగేళ్లుగా సగటున ఆహార ధాన్యాల్లో పెరుగుదల కేవలం 15 లక్షల టన్నులు మాత్రమే. 2015లో దేశ జనాభా 125.91 కోట్లుగా ఉన్నప్పుడు ఒక్కోవ్యక్తికి రోజుకు 186 గ్రాముల బియ్యం అందుబాటులో ఉన్నట్లు గణాం కాలు తెలుపుతున్నాయి. ప్రస్తుత జనాభా 130.28 కోట్లకు చేరిన నేపథ్యంలో తలసరి బియ్యం లభ్యత తిరోగమనంలో ఉంది... 185 గ్రాములకు తగ్గింది. పలు కేంద్ర, రాష్ట్ర పథకాలు అమలవుతున్నప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడం లేదు. 2010–11లో దేశంలో 24.44 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు రాగా 2017–18లో.. అంటే 7Sఏళ్ల తర్వాత కూడా 27.95 కోట్ల టన్నుల దిగుబడులే నమోదయ్యాయి. ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వ్యవసాయరంగంలో క్షీణత మొదలయిందని చెప్పడానికి ఆహార ధాన్యాల దిగుబడులే ఓ ఉదాహరణ. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే.. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం చివరి సంవత్సరమైన 2013–14లో 26.50 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు దిగుబడి కాగా; 2014–15లో ఆ మొత్తం 25.20 కోట్ల టన్నులకు తగ్గింది. అది ఎన్డీఏ ప్రభుత్వానికి తొలి సంవత్సరం. అయితే, 2015–16లో ఉత్పత్తి తగ్గి 25.15 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలే చేతికందాయి. 2016–17లో ఆ మొత్తం 27.51 కోట్ల టన్నులకు పెరిగినా 2017–18లో స్వల్పవృద్ధి మాత్రమే సాధ్యపడి 27.95 కోట్ల టన్నుల వద్ద దిగుబడి నిలిచిపోయింది.దేశ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని.. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిం చడం లక్ష్యంగా నిర్ధేశించుకోకుండా.. ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి కేవలం ఆహార ధాన్యాల దిగుమతుల మీదనే కేంద్రం ఆధారపడుతున్నదని స్పష్టం అవుతున్నది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక గోధుమలు, బియ్యం (బాస్మతియేతర రకం), పప్పులు, నూనెగింజలు, ఇతర చిరు, తృణధాన్యాల దిగుమతుల విలువ మూడేళ్లల్లో రెట్టింపయింది. 2013–14లో ఆహార ధాన్యాల దిగుమతుల బిల్లు 15.03 బిలియన్ల డాలర్లు ఉండగా 2016–17 నాటికి ఆ మొత్తం 25.09 బిలియన్ల డాలర్లకు చేరింది. ఇక దేశం నుంచి ఎగుమతులయ్యే అన్ని ఉత్పత్తుల్లో వ్యవసాయరంగ వాటా 2014–15లో 12.59%గా ఉండగా, 201–17 నాటికి 12.26%కు పడిపోయింది. దిగుమతులు పెరుగుతుండగా ఎగుమతులు తగ్గుతున్నాయి. దీనివల్లనే రూపాయి మారకం విలువ పడిపోతోంది. గత రెండు, మూడేళ్లుగా దేశంలోకి విదేశీ కూరగాయలు, పండ్లు విస్తారంగా దిగుమతి అవుతున్నాయి. 2014–15లో దేశంలోకి రూ.5,414 కోట్ల విలువైన కూరగాయలు పండ్లు దిగుమతి కాగా, 2016–17 నాటికి ఆ మొత్తం విలువ రూ. 5,897 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ విధానాలను ఆసరా చేసుకొని వ్యాపారాలు ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి గోధుమలు, చిరుధాన్యాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి దేశీయ మార్కెట్లను ముంచెత్తుతున్నారు. ఫలితంగా.. రైతులకు కనీసమద్దతు ధర లభించని దుస్థితి ఎదురవుతున్నది. 1993–94లో దేశ అవసరాల్లో నూనెగింజల దిగుమతులు కేవలం 3% మాత్రమే. కానీ, ప్రస్తుతం దేశానికి అవసరమైన నూనెగింజల దిగుమతులపై సుమారు రూ.70,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశంలో 70 రకాలకు పైగా పంటల్ని పండిస్తున్నారు. కనీస మద్దతు ధర అందిస్తున్న పంటల సంఖ్య 26 మాత్రమే. పైగా, మద్దతు ధర నిర్ధారణ ప్రాతిపదికలు అసంబద్ధంగా ఉంటున్నాయి. అన్ని పంటలకు సహేతుకమైన రీతిలో మద్దతు ధరల్ని అందించాలని రైతులు డిమాండ్ చేస్తోంటే, అసలు మద్దతు ధరలకు పంటలను కొనే విధానం నుంచి పూర్తిగా తప్పుకోవాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇదే విధానం అమలైతే భారతదేశ రైతాంగానికి తీరని శరాఘాతంగా మిగిలిపోతుంది.2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకొంటామని మోదీ చెప్పారు. కానీ, దానికి తగ్గట్టుగా ప్రభుత్వ చర్యలు లేవు. పైగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నానాటికి పడిపోతూ ఉన్నాయి. డా‘‘ స్వామినాథన్ సిఫార్సుల పైన కనీస చర్యలు లేవు. ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ వ్యవసాయరంగంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులు సభ్యులుగా ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని.. ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్న ఎన్డీఏకు వ్యవసాయరంగంలో తీసుకోవాల్సిన మెరుగైన చర్యలను టాస్క్‌ఫోర్స్ ఎప్పటిలోగా సూచించగలదు? ఆ సూచనలను ఎన్డీఏ ఎప్పటి నుంచి అమలు చేయగలదు? విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వ్యవసాయరంగ అభివృద్ధిని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు రెండంకెల స్థాయిలో చూపడం రైతాంగాన్ని మోసం చేయడమే. రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా రుణమాఫీ కూడా చేయలేదు. నామ మాత్రంగా చేసిన రుణమాఫీ రైతుల వడ్డీల చెల్లింపులకు కూడా సరిపోలేదు. నాలుగేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల రైతులకు విశ్వాసం సన్నగిల్లే ఘట నలు అనేకం చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం క్రింద సగటున 50–60 పనిదినాలు మాత్రమే వ్యవసాయ కార్మికులు పొందగలుగుతున్న నేపథ్యంలో ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానిం చడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను, లాభాలను కూలంకషంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జాతీయ కర్షక విధానం రూపొం దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరి సంవత్సరంలోనైనా కేంద్రం వ్యవసాయరంగంలో దిద్దుబాటు చర్యలను తీసుకోగలిగితేనే రైతాంగానికి మేలు జరుగుతుంది తప్ప ప్రస్తుత గతి తప్పిన, కాలంచెల్లిన ప్రభుత్వాల విధానాలు రైతాంగానికి శాపాలే తప్ప 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపుకావడం హామీకే పరిమితమౌతుంది. వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు ‘ మొబైల్ : 99890 24579 -
నిరుపేదలకు వరం ‘కస్తూర్బా’
నేరడిగొండ : చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా కొందరికి కుటుంబ పరిస్థితులు అనుకూలించవు. మరికొందరికి ఆర్థిక స్థోమత సహకరించదు. ఎలాగోలా బడికి వెళ్తున్నా మధ్యలోనే మానేయాల్సిన దుర్భర పరిస్థితి మరికొందరిది. ఇలాంటి వారెందరినో అక్కున చేర్చుకొని అన్నివసతులు సమకూర్చి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు. కుటుంబ పరిస్థితులు అనుకూలించక, ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికలకు కేజీబీవీల వ్యవస్థ వరంలా మారింది. పేదరికం, ఆర్థిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో గ్రామాల్లో బాలికలను చదివించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఇలా మధ్యలో చదువు మానేసిన బాలికలు, తల్లిదండ్రులు లేని చిన్నారులను కస్తూర్భాలు అక్కున చేర్చుకొని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. నేరడిగొండ కేజీబీవీలో మండల కేంద్రంలోని కస్తూర్భా బాలికల విద్యాలయాన్ని 2010లో ప్రారంభించారు. అప్పటినుంచి ఎనిమిదేళ్లుగా ఎంతోమంది ఈ విద్యాలయంలో విద్యను అభ్యసించి ప్రయోజకులు అయ్యారు. ప్రస్తుతం ఈ విద్యాలయంలో చదువుతున్న 182 మంది బాలికలది ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. పేదరికంతో బడి మానేసిన వారు ఒకరైతే, తల్లిదండ్రులను కోల్పోయి స్కూల్‌కు దూరమైన వారు మరొకరు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా చదువుకోవాలన్నదే వారి ఆశ. చదవాలన్న వారి ఆసక్తికి అనుగుణంగా బాలికల బంగారు భవిష్యత్తుకు ఇక్కడి కస్తూర్భా విద్యాలయం బాటలు వేస్తోంది. భరోసా కలిగింది పాఠశాలల్లో వసతులు, విద్యబోధన బాగుంది. ఉపాధ్యాయులు కూడా ఇంటి వద్ద అమ్మానాన్నలు ఎలా చూసుకుంటారో అలాగే మాపట్ల శ్రద్ధ పెడుతున్నారు. చదువుకోవడానికి ఇంతకన్నా ఏంకావాలి. మంచిగా చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. – గాయత్రి, 9వతరగతి విద్యార్థిని బాగా చదివి స్థిరపడతా మాది లక్ష్మణచాంద మండలం మునిపెల్లి గ్రామం. బాగా చది వి భవిష్యత్తులో స్థిరపడాల న్నదే నా లక్ష్యం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తా. పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం యోగా కూడా నేర్పుతున్నారు. – శ్రీజ, పదోతరగతి విద్యార్థిని మంచి అవకాశం ఆర్థిక ఇబ్బందులు, ఇతర కార ణాలతో మధ్యలో చదువు మానేసిన బాలికలకు కస్తూర్భాలు ఎం తో దోహద పడుతున్నాయి. బా లికలు ఉన్నతవిద్య వైపు అడుగు లు వేస్తున్నారు. మంచి విద్య, క్రమశిక్షణతో పాటు ఆహారం, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. – జయశ్రీ, ఎస్వో -
ఎఫ్ఆర్డీఐ బిల్లు డిపాజిటర్లకు వరమా? శాపమా?
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్న వివాదాస్పద ఎఫ్ఆర్డీఐ బిల్లు డిపాజిటరీ ఫ్రెండ్లీగా ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీల వాదనలకు విరుద్ధంగా, డిపాజిటర్ల హక్కులను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రం ప్రభుత్వం తీసుకురానున్న కొత్త ఎఫ్ఆర్డీఐ బిల్లు చట్టం రూపం దాలిస్తే డిపాజిట్లర్లకు తీవ్ర నష్టం కలగనుందనే వార్తలు మార్కెట్లో హల్ చల్ చేయడంతో గురువారం జైట్లీ ట్విట్టర్ ద్వారా ఈ వివరణ ఇచ్చారు. ముఖ్యంగా 'బెయిల్ ఇన్' క్లాజ్ పై చెలరేగిన ఆందోళనపై జైట్లీ ట్వీట్ చేశారు ఫైనాన్షియల్ రిజుల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు, 2017 (ఎఫ్ఆర్డీఐ బిల్) లోని "బెయిల్-ఇన్" (దివాలా తీసే పరిస్థితిలో ఉన్న బ్యాంకుకు కొంత ఊరట కల్పించడానికి సెక్షన్ 52(1)) నిబంధనలపై అనేక అందోళనలు వార్తల్లో నిలిచాయి. బిల్లులో ఈ కార్పొరేషన్‌కు తిరుగులేని అధికారాలు కట్టబెట్టే అవకాశంఉందని, దివాలా తీసిన బ్యాంకు అప్పులన్నింటినీ ఈ కార్పొరేషన్ రద్దు చేయడంతోపాటు, ఖాతాదారుల సొమ్మును రద్దు చేసేయవచ్చనీ, దీంతో ఖాతాదారుల డబ్బును కూడా బ్యాంకులు తిరిగి ఇవ్వక్కర్లేదను వార్తలు ఆందోళనకు తెరతీశాయి. నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న నిబంధనలతో పోల్చిస్తే మరింత భద్రత కల్పిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనలు డిపాజిటర్లకు ప్రస్తుత రక్షణలను ప్రతికూలంగాఉండవని స్పష్టం చేశారు. డిపాజిటర్ల సొమ్మకు తమది హామీఅని , మరింత పారదర్శక పద్ధతిలో అదనపు రక్షణలను అందిస్తోందని తెలిపింది. 2017, ఆగస్టు 10న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు పార్లమెంటరీ జాయింట్ కమిటీ పరిశీలనలో ఉంది. దీని విధివిధానాలు, నిబంధనల రూపకల్పనపై వివిధ వర్గాల వారితో కమిటీ ఇప్పటికే చర్చలు నిర్వహిస్తోంది. -
సొంత తల్లికన్నా ఎక్కువగా...
జాలి, దయ, కరుణ వంటి పదాలు మనుషులకు మాత్రమే వర్తించే పదాలు కాదని, జంతువుల్లో కూడ ఈ గుణాలు ఉంటాయని పలుమార్లు నిరూపితమౌతూనే ఉంటుంది. ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ చింపాంజీ విషయంలో అది మరోసారి నిజమైంది. సుమారుగా మనిషికి దగ్గరగా ఉండే పోలికలు, తెలివితేటలే కాదు వీటిలోని గుణాలుకూడా మానవులను పోలి ఉంటాయన్నది ఆస్ట్రేలియా జూలో సంఘటన ద్వారా రుజువైంది. జూలోని ఓ చింపాంజీ బిడ్డను కని చనిపోవడంతో... ఆ ఘటన చూసిన మరో గర్భవతి అయిన చింపాంజీ దాన్ని చేరదీసి అక్కున చేర్చుకోవడం... అందర్నీ ఆశ్చర్యపరచింది. మొనార్టో జూలో బూన్ పేరున పుట్టిన చింపాంజీ తన తల్లి సూనా మరణంతో అనాధగా మారింది. అయితే ఆ బిడ్డ పరిస్థితిని గమనించిన జూలోని మరో చింపాంజీ జోంబి.. దాన్ని చేరదీయడం చూపరుల గుండెను కదిలించింది. త్వరలో తనకే ఓ సొంత బిడ్డ పుట్టబోతుండగా... గర్భవతిగా ఉన్న ఓ చింపాంజీ మరో బిడ్డను పెంచుకోవడం ఇప్పటివరకూ ఎక్కడా చూడలేదని జూ.. ప్రైమేట్ కీపర్ లారా హన్లీ చెప్తున్నారు. ఎన్నో రోజులనుంచీ తాను చింపాంజీలను చూస్తున్నానని ఇటువంటి అద్భుతం ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. పుట్టిన బిడ్డను చేరదీయడమే కాక, అచ్చం మనుషుల్లాగే ఆ బిడ్డకు కావలసిన అన్ని సపర్యలూ చేస్తూ స్వంత తల్లికన్నా ఎక్కువగా లాలించడం, పాలించడం నిజంగా అద్భుతమేనని జూ క్రీపర్ తెలిపారు. ఒకేచోట నివసించే ఈ చింపాంజీలమధ్య బలమైన బంధం, అనుబంధం కలిగి ఉండటం, బాధ్యతలను పంచుకోవడం ఆశ్చర్యపరుస్తోందని హన్లీ పేర్కొన్నారు. సూనా బిడ్డను చేరదీసి పెంచుతున్న జోంబ్లీ కూడ మరో నెల తర్వాత బిడ్డకు జన్మనివ్వనుందని, అప్పుడు కూడా ఈ బిడ్డను అంతే ప్రేమతో సాకే అవకాశం ఉందని జూ సిబ్బంది ఆశావాదం వ్యక్తం చేస్తున్నారు.