సొంత తల్లికన్నా ఎక్కువగా... | Pregnant Chimp Adopts Orphan in 'Unheard Of' Act | Sakshi
Sakshi News home page

సొంత తల్లికన్నా ఎక్కువగా...

Published Wed, Oct 14 2015 3:22 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

సొంత తల్లికన్నా ఎక్కువగా... - Sakshi

సొంత తల్లికన్నా ఎక్కువగా...

జాలి, దయ, కరుణ వంటి పదాలు మనుషులకు మాత్రమే వర్తించే పదాలు కాదని, జంతువుల్లో కూడ ఈ గుణాలు ఉంటాయని పలుమార్లు నిరూపితమౌతూనే ఉంటుంది. ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ చింపాంజీ విషయంలో అది మరోసారి నిజమైంది. సుమారుగా మనిషికి దగ్గరగా ఉండే పోలికలు, తెలివితేటలే కాదు వీటిలోని గుణాలుకూడా మానవులను పోలి ఉంటాయన్నది ఆస్ట్రేలియా జూలో సంఘటన ద్వారా రుజువైంది.  జూలోని ఓ చింపాంజీ బిడ్డను కని చనిపోవడంతో...  ఆ ఘటన చూసిన మరో గర్భవతి అయిన చింపాంజీ దాన్ని చేరదీసి అక్కున చేర్చుకోవడం... అందర్నీ ఆశ్చర్యపరచింది.

మొనార్టో జూలో బూన్ పేరున పుట్టిన చింపాంజీ తన తల్లి సూనా మరణంతో అనాధగా మారింది. అయితే ఆ బిడ్డ పరిస్థితిని గమనించిన జూలోని  మరో చింపాంజీ జోంబి.. దాన్ని చేరదీయడం చూపరుల గుండెను కదిలించింది. త్వరలో తనకే ఓ సొంత బిడ్డ పుట్టబోతుండగా... గర్భవతిగా ఉన్న ఓ చింపాంజీ మరో బిడ్డను పెంచుకోవడం ఇప్పటివరకూ ఎక్కడా చూడలేదని జూ.. ప్రైమేట్ కీపర్ లారా హన్లీ చెప్తున్నారు. ఎన్నో రోజులనుంచీ తాను చింపాంజీలను చూస్తున్నానని ఇటువంటి అద్భుతం ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు.

పుట్టిన బిడ్డను చేరదీయడమే కాక, అచ్చం మనుషుల్లాగే ఆ బిడ్డకు  కావలసిన అన్ని సపర్యలూ చేస్తూ స్వంత తల్లికన్నా ఎక్కువగా లాలించడం, పాలించడం నిజంగా అద్భుతమేనని జూ క్రీపర్ తెలిపారు. ఒకేచోట నివసించే ఈ చింపాంజీలమధ్య బలమైన బంధం, అనుబంధం కలిగి ఉండటం, బాధ్యతలను పంచుకోవడం ఆశ్చర్యపరుస్తోందని హన్లీ పేర్కొన్నారు. సూనా బిడ్డను చేరదీసి పెంచుతున్న జోంబ్లీ కూడ మరో నెల తర్వాత బిడ్డకు జన్మనివ్వనుందని, అప్పుడు కూడా ఈ బిడ్డను అంతే ప్రేమతో సాకే అవకాశం ఉందని జూ  సిబ్బంది ఆశావాదం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement