Orphaned
-
పీఎం కేర్స్‌కు 4,345 మంది ఎంపిక
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల సంరక్షణ కోసమే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ప్రతిమా భౌమిక్ తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వీ.పీ.గౌతమ్‌తో కలిసి మాట్లాడారు. దేశవ్యాప్తంగా 557 జిల్లాల నుంచి 9,042 దరఖాస్తులు అందా యని, ఇందులో 4,345 మంది పిల్లలను పథకానికి ఎంపిక చేశామని తెలిపారు. వీరంతా కేంద్రం పరిధిలోని పాఠశాలల్లో ఉన్నత విద్యను అభ్యసిం చేలా స్కాలర్షిప్లు అందిస్తామని వెల్లడించారు. పథకానికి ఎంపికైన వారిలో ఖమ్మం జిల్లా నుంచి 14 మంది పిల్లలు న్నారని.. వీరిలో 18 ఏళ్లకు పైబడిన వారు ముగ్గురు, 18 ఏళ్లలోపు వారు 11 మంది ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పీఎం కేర్ సర్టిఫికెట్లు, ఆయుష్మాన్ భారత్ కార్డులను మంత్రి అందజేశారు. ఆ పిల్లల తల్లిదండ్రులను ఎలాగూ తీసుకురాలేం..: కిషన్‌రెడ్డి కరోనా వల్ల అనాథలైన పిల్లలకు తల్లిదండ్రులను ఎలాగూ తీసుకురాలేమని, కానీ పిల్లలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్‌ను కేంద్రం తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఆ పిల్లలకు స్నేహమిత్ర ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పథ కంపై హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు. ‘పిల్లలు 23 ఏళ్ల వరకు ఏ కోర్సు చదువుకున్నా ఉచితంగా చదివిస్తాం. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో చేరొచ్చు. ప్రైవేటు పాఠశాలలో చేరితే స్కూలు ఫీజు చెల్లిస్తాం. నెలకు రూ. 4 వేలు వారి పేరు మీద అకౌంట్లో జమ చేస్తాం. 23 ఏళ్లు నిండిన వారికి రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తాం’ అని వివరించారు. పథకం కింద 12 మంది పిల్లలను హైదరాబాద్ జిల్లా నుంచి దత్తత తీసుకున్నామని తెలిపారు. -
ఛీ..ఛీ.. పాడు బుద్ధి.. వివాహేతర సంబంధాల మోజులో..
కొందరు తల్లిదండ్రులు వక్రబుద్ధితో వివాహేతర సంబంధాలు నెరపుతున్నారు. ఆకర్షణకులోనై ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కటకటాల్లోకి వెళ్తున్నారు. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. పిల్లలను అనాథులుగా మార్చుతున్నారు. కష్టాలకొలిమిలోకి నెట్టేస్తున్నారు. భవిష్యత్‌ను అంధకారంగా మార్చుతున్నారు. మేమేమి చేశాం పాపం అంటూ పిల్లలు గోడువెళ్లబోస్తున్నారు. దీనికి ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనం. విజయనగరం క్రైమ్: డెంకాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు పదేళ్లుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. భార్య ఇటీవల ఓ ఫార్మాకంపెనీలో హెల్పర్‌గా చేరినప్పటి నుంచి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరపుతోంది. విషయం భర్తకు తెలిసింది. నిలదీయడంతో భర్తను హతమార్చేందుకు పూనుకుంది. ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి మట్టుబెట్టింది. దీనిని ఆటో ప్రమాదంగా చిత్రీకరించింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపడంతో అసలు విషయాన్ని అంగీకరించింది. ఆమె జైలుకెళ్లింది. తండ్రి హత్యకు గురయ్యారు. వీరి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అనాథులుగా మారారు.’ ‘నెల్లిమర్ల మిమ్స్‌లో గుమస్తాగా పనిచేస్తున్న భర్తను ప్రియుడి మోజులో పడిన భార్య మట్టుబెట్టేందుకు స్కెచ్ గీశారు. ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి హతమార్చారు. మృతదేహాన్ని రైలుపట్టాల మధ్యన పడేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో అల్లుడ్ని చంపేందుకు అత్త కూడా రూ.40వేలు కిరాయిలో తనవంతు రూ. 20వేలు ఇచ్చేందుకు సహకరించడం విశేషం. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. తల్లి, అమ్మమ్మ జైలు పాలయ్యారు. చిన్నవయసులోనే పిల్లల పరిస్థితిని తలచుకున్నవారికి కన్నీరు ఉబుకుతోంది.’ వివాహేతర సంబంధాలు ఉసురు తీస్తున్నాయి. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో హత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అడ్డుతొలగించుకుంటే అంతా మనమేనన్న భ్రమను కల్పిస్తున్నాయి. చివరకు కుటుంబంలో ఒకరిని పొట్టనపెట్టుకుంటున్నాయి. పోలీసుల విచారణలో దొరికి, చివరకు జైలు గోడల మధ్యన నలిగిపోయేలా చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే కడుపున పుట్టిన పదేళ్లలోపు చిన్నారులు అనాథలైపోతున్నారు. ఆప్యాయంగా పిలవడానికి నాన్న ఉండడు. అన్నం పెట్టేందుకు అమ్మ దొరకదు. రక్తకన్నీరు కారుస్తూ, చిరుప్రాయంలోనే మనసులో బలమైన గాయాలు తగిలి, నలిగిపోతున్నారు. ఏం చేయాలో తెలియని స్ధితిలో నరకయాతన అనుభవిస్తున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబ బాంధవ్యాలను నాశనం చేస్తున్నాయి. ఏకంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు జిల్లాలో వరసగా చోటుచేసుకోవడంతో జిల్లావాసులు ఉలిక్కిపడుతున్నారు. ఇటువంటి విషసంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబాలను అనాథలను చేయకండి వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోతుందన్నది అందరికీ తెలిసిందే. తెలిసి తప్పుచేస్తే ఆ కుటుంబ పెద్దలపై ఆధారపడిన పిల్లలు, వృద్ధులు అనాథలైపోతారన్న విషయాన్ని గుర్తెరగాలి. వివాహేతర సంబంధాల పేరుతో హత్యలకు పాల్పడితే సహించేది లేదు. తీవ్రమైన చర్యలు ఉంటాయన్నది వాస్తవం. – ఎం.దీపిక, ఎస్పీ, విజయనగరం ఇదొక మానసిక రుగ్మత వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమనేది మానసిక రుగ్మత. చట్టబద్ధమైన వైవాహిక జీవితం మాత్రమే ఆచరించాలి. క్షణిక ఆకర్షణకు, విపరీత ధోరణుల వైపు మరలడం వల్ల వారి జీవితం పాడవ్వడమే కాకుండా, ఇరువురి కుటుంబాలు సమస్యల్లో చిక్కుకుంటాయి. సెల్, ఇంటర్నెట్ వాడకం పెరిగింది. కొత్త స్నేహాలు, అర్ధరాత్రుల వరకూ చాటింగ్‌లు, పరిచయాలు.. ప్రేమ ముసుగులో వివాహేతర సంబంధాలు చోటుచేసుకుంటున్నాయి. చివరకు కలిసి ఉండాల్సిన జీవితాలను కడతేర్చుకుంటున్నారు. చెడుస్నేహాలు, వ్యామోహాలు తగ్గించుకోవాలి. లేకుంటే కుటుంబం నడిసంద్రంలో నావలా తయారవుతుంది. – డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం -
పాపం ద్రాక్షాయణి.. కుటుంబీకులు దూరమై.. ఏకాకిగా మిగిలి..!
పీలేరు రూరల్: విధి వైపరీత్యమంటే ఇదేనేమో..బ్లాక్ ఫంగస్ బారిన పడి తల్లి మృతి చెందగా, అంతకుముందు రెండేళ్ల కిందటే అనారోగ్యంతో ఆమె సో దరుడు, ఏడాది క్రితం తండ్రి మృతి చెందారు. దీంతో ఆమె ఏకాకిగా మిగిలి కన్నీరుమున్నీరవుతోంది. వైఎస్సార్ జిల్లా మైదకూరు మండలం సుంకలగారిపల్లెకు చెందిన డి.లక్ష్మీదేవి 2005లో ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరింది. అప్పటి నుంచి ఆర్టీసీ నల్లగుట్టలో నివాసముంటూ పీలేరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. లక్ష్మీదేవి కుమారుడు చక్రధారి 2019 లో అనారోగ్యంతో మృతి చెందాడు. చదవండి: పంథా మార్చి.. పట్టుబడిన కిలేడీలు ఏడాది క్రితం లక్ష్మీదేవి భర్త రమణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడు, భర్తను కోల్పోయిన లక్ష్మీదేవి బాధను దిగమింగుకుంటూ కుమార్తె ద్రాక్షాయణితో కలిసి జీవనం సాగిస్తూ వచ్చింది. 20 రోజుల క్రితం లక్ష్మీదేవి కరోనా బారినపడి బ్లాక్ ఫంగస్‌కు గురై వే లూరు సీఎంసీలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల్లో ముగ్గురూ తన నుంచి దూరం కావడంతో ఏకాకిగా మిగిలిన ద్రాక్షాయణి కన్నీమున్నీరుగా విలపిస్తోంది. లక్ష్మీదేవి మృతదేహాన్ని వారి స్వగ్రామం సుంకలగారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్టీసీ సీఐ ధనుంజయలు దహనక్రియలకుగానూ రూ.15 వేలు అందజేశారు. ద్రాక్షాయణి ఇంటర్ పూర్తిచేసి ఎంసెట్‌లో 52 వేలు ర్యాంక్ సాధించింది. అనాథగా మిగిలిన ద్రాక్షాయణిని ఆదుకోవాలని ఆమె బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: అత్యాచార వీడియో ఒకరి నుంచి ఒకరికి.. ఐదుగురికి యావజ్జీవం -
వారికి కేంద్రం భరోసా.. 18 ఏళ్లలోపు బాలలకు రూ.10 లక్షలు డిపాజిట్
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు మరో భరోసా దక్కనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనాథ బాలలను ఆదుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్ స్కీం ద్వారా ఆదుకునేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన పిల్లల సమగ్ర సంరక్షణ, విద్య, ఉపాధి, వసతి వంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టగా కేంద్ర ప్రభుత్వం మరో రూ.10 లక్షలు డిపాజిట్ చేసి సంరక్షణ చర్యలు తీసుకోనుంది. పీఎం కేర్ స్కీమ్ పథకానికి కలెక్టర్ల ద్వారా నిర్వహించిన ఎంపికలో 237 మంది అర్హులని గుర్తించారు. గతేడాది మార్చి 11 నుంచి కూడా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన 18 ఏళ్లలోపు బాలలు ఈ పథకానికి అర్హులు. ఈ ఏడాది మే 29 నుంచి లబ్ధిదారుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. డిసెంబర్ 31 వరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులకు రూ.10 లక్షల వంతున పోస్టాఫీసులో డిపాజిట్ చేసి, వారికి 18 సంవత్సరాలు దాటిన తరువాత 23 ఏళ్ల వరకు ఆ డిపాజిట్‌పై ప్రతినెల స్టైఫండ్ ఇస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత డిపాజిట్ మొత్తాన్ని వారికి అప్పగిస్తారు. అనాథ బాలల సమగ్ర సంరక్షణతోపాటు విద్య, ఆరోగ్యం, ఉపాధికి ప్రాధాన్యం ఇస్తారు. వారికి ఆరోగ్య బీమాతోపాటు ప్రమాద బీమా రూ.5 లక్షలు వర్తించేలా చేస్తారు. అనాథ బాలలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 లక్షలు చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. వారికి పిల్లల సంరక్షణ కేంద్రాల్లో (ఛైల్డ్ కేర్ సెంటర్లలో) వసతి, విద్య, వైద్యం వంటి ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.10 లక్షల డిపాజిట్ వారికి 18 ఏళ్లు నిండగానే తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మరో రూ.10 లక్షల డిపాజిట్ 23 ఏళ్ల వయసు నిండాకే తీసుకునేలా మార్గదర్శకాలు ఇచ్చారు. అనాథ బాలలకు అవసరమైన తోడ్పాటు అందించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తాం. – కృతికాశుక్లా, మహిళా శిశుసంక్షేమశాఖ సంచాలకులు -
ఆ అవ్వ చనిపోయింది..
పలమనేరు: కన్నవాళ్లు పట్టించుకోకుండా అవ్వను వదిలించుకున్నారు. అలా అడవికి చేరి అనాథలా పడి ఉన్న అవ్వ కథనం ‘సాక్షి’లో ప్రచురితమైంది. స్పందించిన తహసీల్దార్ ఆమెను చిత్తూరులోని అమ్మఒడి అనాథాశ్రమానికి చేర్చారు. అక్కడ అనారోగ్యంతో అవ్వ శనివారం మృతి చెందింది. పలమనేరు సమీపంలోని పెంగరగుంట అడవిలో 90ఏళ్ళ వృద్ధురాలు పడి ఉండగా స్థానికులు గుర్తించారు. దీనిపై గతనెల 12న ‘అడవిలో వదిలేశారు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన గ్రామ సచివాలయ సిబ్బంది ఆ వృద్ధురాలికి భోజనం పెట్టించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు ఆమెను పలమనేరు ఏరియా ఆస్పత్రిలో చేర్పించి వైద్య సేవలు అందేలా చేశారు. ఆపై కొంత కోలుకున్నాక గత నెల 16న చిత్తూరులోని అమ్మఒడిలో చేర్పించి, నిర్వాహకులకు రూ.10వేల ఆర్థికసాయాన్ని అందించారు. అక్కడ సేదతీరుతున్న వృద్ధురాలు శనివారం మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ శ్రీనివాసులు అక్కడికి చేరుకున్నారు. అమ్మఒడి నిర్వాహకులతో కలసి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఆమె పాడెను సైతం తహసీల్దార్ శ్రీనివాసులు, అమ్మఒడి నిర్వాహకుడు పద్మనాభనాయుడు మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తహసీల్దార్‌ను జనం మెచ్చుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో సొంతవాళ్లు చనిపోతేనే ముట్టుకోని ఈసమయంలో తహసీల్దార్ చూపిన చొరవను ప్రశంసిస్తున్నారు. -
అనాథ.. అమ్మ అయింది!
నర్సంపేట: సొంత మనుషులు పట్టించుకోలేదు.. మతిస్థిమితం తప్పడంతో బస్టాండ్‌లో ఆవాసం ఏర్పర్చుకున్న యువతి గర్రెపల్లి రజినిపై ఓ కామాంధుడు కన్నేశాడు.. ఫలితంగా అభంశుభం తెలియని ఆమె గర్భం దాల్చింది. ఆరు నెలల గర్భంతో సరైన పోషణ, చికిత్స లేక అనారోగ్యం పాలైన ఆ యువతి దీనగాథను నాలుగు నెలల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో స్పందించిన కాజీపేటలోని అమ్మ అనాథశ్రమం నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి ఆమెను చేరదీసి అన్నీ తానై చూసుకుంది. సాధారణ మహిళల్లాగే ఆశ్రమంలోనే సీమంతం జరిపించింది. ప్రస్తుతం నెలలు నిండిన రజినిని గురువారం హన్మకొండలోని ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆశ్రమంలో ఉన్న సమయాన కొద్దిగా ఆరోగ్యం బాగుపడిన రజిని.. తనకు పుట్టిన బిడ్డను చూసి మురిసిపోయింది. తన గాధను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాకున్నా.. అమ్మ ఆశ్రమం ఒడిలో చేర్చుకోకున్నా ఏమై పోయోదాన్నోనని ఆమె కంట తడి పెట్టుకుంది. మతిస్థిమితం లేకపోవడంతో... దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన గర్రెపల్లి రజిని. కొంత మతిస్థిమితం తప్పడంతో బస్టాండ్ సెంటర్లలో ప్రయాణికులను చిల్లర అడుక్కుంటూ., నర్సంపేట బస్టాండ్‌లోనే కాలం గడిపేది. ఆ సమయంలో ఓ కామాంధుడు చేసిన పాపానికి రజిని అమ్మ అయింది. ఆరు నెలల గర్భిణిగా ఉండి తనకేం జరిగిందో తెలియక.. సరైన చికిత్స అందక అనారోగ్యం పాలయిన అమె దీనగాధను గత జనవరి 20న ‘అనాధను అమ్మ చేశారు’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురితమైంది. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ హరిత.. రజినిని చేరదీయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు,. అయితే, ఐసీడీఎస్ అధికారుల సమక్షాన కాజీపేటలోని అమ్మ అనాథాశ్రమం నిర్వాహకురాలు అమ్మ శ్రీదేవి ఆమె బాధ్యత స్వీకరించారు. ఇక ఏప్రిల్ 3న ఆశ్రమంలోనే సీమంతం కూడా జరిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్యపరీక్షలు చేయిస్తూ బిడ్డలా సాకారు. ఈ మేరకు గురువారం ఉదయం రజినికి పురిటి నొప్పులు రాగా.. హన్మకొండలోని జీఎంహెచ్‌లో చేర్పించారు. అక్కడ సూపరింటెండెంట్ సరళాదేవి నేతృత్వాన వైద్యులు, సిబ్బందికి రజినికి ప్రసవం చేయగా మగ బిడ్డ జన్మించాడు. కాగా, ఆ బాబు కొద్దిమేర అవస్థతకు గురవడంతో పిల్లల వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాం... కామాంధుల వంచనకు గురై అందరూ ఉన్నా అనాథగా మారిన రజిని విషయమై ‘సాక్షి’లో వచ్చిన కథనంతో చలించిపోయి వెంట తెచ్చుకున్నాను. గత ఐదు నెలలుగా రజినిని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఇప్పుడు ఆమె బాబుకు జన్మనివ్వడం.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడం సంతోషాన్ని కలిగించింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయగానే బాబు, తల్లిని జిల్లా కలెక్టర్ సమక్షంలో ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తాను. – అమ్మ శ్రీదేవి, అమ్మ అనాథశ్రమం నిర్వాహకురాలు -
అనాథ శిశువుకు ఎస్పీ అంత్యక్రియలు
కర్నూలు(హాస్పిటల్): నంద్యాలలో నాలుగురోజుల క్రితం ఆటో డ్రైవర్లు కాపాడిన అనాథ శిశువు సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకోలేక మృతిచెంది. ఈ పాపకు జిల్లా ఎస్పీ రవికృష్ణ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగురోజుల క్రితం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద వదిలేసిన పసికందును ఆటోడ్రైవర్లు కాపాడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక పాప మృతి చెందింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆసుపత్రికి వచ్చి మృతశిశువును హిందూ శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ శిశువులను రోడ్డుపై వదిలివెళ్లడం మానవత్వానికే మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే జన్మించిన ఆడపిల్లలను పెంచలేక రోడ్డుపై పడవేయకుండా దగ్గరల్లోని పోలీస్‌స్టేషన్‌కు గాని, చైల్డ్‌లైన్ 1098 నెంబర్‌కు ఫోన్ చేసి చెబితే శిశువులను ఐసీడీఎస్ వారికి అప్పగిస్తారన్నారు. అంత్యక్రియల్లో కర్నూలు డిఎస్పీ రమణమూర్తి, ఒకటో పట్టణ సీఐ బిఆర్ క్రిష్ణయ్య, నంద్యాల ఎస్సై మోహన్‌రెడ్డి, పోలీస్, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
తమ వాళ్లను కోల్పోయి అనాధలైన చిన్నారులు
-
పేదవాడు కోటీశ్వరుడు కాగలడా?
ఒక గుడిసె ప్రాంతానికి చెందిన అనాథ కోటీశ్వరుడు అవ్వగలడా?అలాంటి కథాంశంతో తెరకెక్కిన చిత్రం స్లమ్‌డాగ్ కోటీశ్వరన్. అది ముంబయి నగరం. అక్కడ అంధేరి ప్రాంతంలో నలుగురు అనాథ యువకులు నివశిస్తుంటారు. వారి లక్ష్యం ఒక్కటే. ఎలాగైనా కోటీశ్వరులు కావాలన్నదే అది. ఇక అదే ప్రాంతంలో నివశించే జేకే అనే వ్యక్తి తన కొడుకుకు అమెరికాకు చెందిన ధనవంతుడైన రాజపాండే కూతురుతో పెళ్లి చేయాలని ఆశిస్తాడు. అయితే రాజపాండేకు జేకే కొడుకు నచ్చడు. దీంతో పెళ్లికి అంగీకరించడు. ఆయన ఆస్తిపై కన్నేసిన జేకే రాజపాండేను హత్య చేసి ఆయన కూతురును కిడ్నాప్ చేసి ఆస్తి రాయించుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే చిల్లర దొంగతనాలు చేసే(కథానాయకుడి) నలుగురు అనాథల్లో ఒకడి కి హీరోయన్ని కిడ్నాప్ చేసిన చోటు తెలియడంతో ఆమెను అతను విడిపించి తీసుకుపోతాడు. వారి కోసం జేకే అనుచరులు ఒక పక్క, పోలీసులు మరో పక్క వేట మొదలెడతారు. అలాంటి రసవత్తర సన్నివేశాలతో సాగే ఈ కథలో కోటీశ్వరులవ్వాలన్న నలుగురు లక్ష్యం నెరవేరిందా? వారి బారిన పడిన కథానాయకి పరిస్థితి ఏమిటి? ఇత్యాది ఆసక్తికరమైన అంశాల సమాహారంతో తెరకెక్కిన చిత్రం స్లమ్‌డాగ్ కోటీశ్వరన్ అన్నారు ఈ చిత్ర దర్శకుడు రాజేశ్. అరుళ్‌రాజ్ పోలీస్ అధికారిగా ప్రధాన పాత్రను పోషించి నిర్మించిన ఈ చిత్రంలో గోవిందరావ్, మధుర, జ్యోతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్ర పంపిణీ హక్కుల్ని లియో ఇంటర్నేషనల్ అధినేత జేవీ.రుక్మాంగధన్ పొందారు.ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఎల్లలు దాటిన స్నేహ బంధం!
స్నేహ బంధమూ.. ఎంత మధురమూ... కరిగిపోదు చెరిగి పోదు జీవితాంతమూ అన్నాడో సినీ కవి. నిజంగా ఆ ఇద్దరు స్నేహితుల బంధమూ అలాగే కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, బంధువుల బంధాలు తెలియని అనాధలే అయినా.. శరణాలయంలో కలసి మెలసి పెరిగిన వారి స్నేహ బంధం మాత్రం విడిపోలేదు. చిన్నతనంలో ఆఫ్రికాలోని అనాధ శరణాలయంలో ఒకరికి ఒకరై బతికిన జీవితాలు... అమెరికా కు దత్తతకు వెళ్ళినా అనుకోకుండా ఒకే చోటుకి చేరుకున్నాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి ఆఫ్రికాలోని మొజాంబిక్ అనాథాశ్రమంలో పెరిగిన ఆ ఇద్దరు అబ్బాయిలు ఊహ తెలిసినప్పటి నుంచీ మంచి స్నేహితులు. అయితే ప్రస్తుతం 18 ఏళ్ళ వయసున్న కెల్విన్ లెవిస్, అఫోన్సో స్టేటర్ లను ఎనిమిదేళ్ల క్రితం అరిజోనా గిల్బర్ట్ నుంచి వచ్చిన రెండు కుటుంబాలు ఒకరికి తెలియకుండా ఒకరు దత్తతకు స్వీకరించారు. ఇరు కుటుంబాలు ఒకే ప్రాంతంలో కేవలం రెండు మైళ్ళ దూరంలో ఉండటంతో తిరిగి కెల్విన్, అఫోన్సో లు ఒకే కళాశాలలో చేరడంతో అసలు విషయం తెలిసింది. ఇరు కుటుంబాలు ఒకరికొకరు తెలియదు. దత్తత సమయంలోనూ కలవలేదు. అయితేనేం ఒకే ప్రాంతంలో దత్తతకు రావడంతో ఆశ్చర్యంగా ఇద్దరు స్నేహితులు తిరిగి కలుసుకున్నారు. చూసేందుకు భిన్నంగా కనిపించినా తమ స్నేహ బంధం ఎంతో ధృఢమైనదని, అందుకే తిరిగి తాము కలవగలిగామని చెప్తున్నారు. ఎక్కడో విడిపోయిన తాము తిరిగి ఒకేచోట కలిసి పెరిగే అవకాశం రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆ స్నేహితులిద్దరూ చెప్తున్నారు. ఇద్దరూ గిల్బర్ట్ హైస్కూల్లోని సాకర్ టీం లో చేరారు. బ్రిగమ్ యంగ్ యూనివర్శిటీలో సీటు సంపాదించి... రూమ్మేట్స్ గా ఉండే యోచనలో ఉన్నారు. భవిష్యత్తులో వైద్యుడుగా స్థిరపడి మొజాంబిక్ లో సేవలు అందించాలనుకుంటున్నానని కెల్విన్ చెప్తుంటే... వివిధ దేశాల మధ్య దత్తత స్వీకరణ అభివృద్ధి చేసేందుకు కావలసిన అంతర్జాతీయ అధ్యయనాల్లో డిగ్రీ చదవాలనుకుంటున్నానని అఫోన్సో చెప్తున్నాడు. మేమిద్దరం స్నేహితులేకాదు సోదరులకంటే ఎక్కువ బంధం కలగి ఉన్నామని, భవిష్యత్తులో మా పిల్లలను సైతం మంచి స్నేహితులుగా ఉండేట్టు చూస్తామని ఆ అపూర్వ స్నేహితులు... కాదు సహోదరులు చెప్తున్నారు. -
అందరుండి అనాథ అయిన వృద్ధుడు
వెంకటాపురం : మండల పరిధిలోని ఎదిర గ్రామానికి చెందిన ఉమ్మనేని నరేందర్(60)కు అందరూ ఉన్నారు. కాని అనాథగా మిగిలాడు. బిక్షాటన చేసి కడుపు నింపుకుంటున్నాడు. ఈ దుస్థితి పగవారికి కూడా రాకూడదని పలువురు చెబుతున్నారు. ఎదిర గ్రామానికి చెందిన ఉమ్మనేని నరేందర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నా రు. కూతుళ్లకు పెళ్లి చేయటంతో అత్తారిళ్లకు వెళ్లిపోయారు. ఇద్దరు కొడుకులు బాబురావు, సాంబశివరావులు పెళ్లి చేసుకోని ఒకరు బెస్తగూడెం, మరొకరు వీరాపురం గ్రామాల్లో నివాసముంటున్నారు. కన్న తండ్రి నరేందర్‌ను సక్రమంగా చూసుకోలేదు. అన్నం పెట్టకుండా ఇంటి నుంచి గెంటివేశారు. గత రెండు సంవత్సరాల నుంచి భద్రాచలం రామాలయంలో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం నరేందర్ ఆరోగ్యం క్షిణించింది. భద్రాచలం రామాలయం నుంచి వెంకటాపురం చేరుకున్నాడు. దీనికి తమ గ్రామస్తుడైన జాడి పోశాలు సాయం చేశాడు. కుటుంబ సభ్యులు ఎవరు చేరదీయక పోవటంతో వెంకటాపురం బస్టాండ్‌లోని చెట్టు కింద సోమ్మసిల్లి పడిపోయాడు. కొందరు వ్యక్తులు పోన్ ద్వారా ఎస్సై సముద్రాల జితేందర్‌కు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ ఆ ప్రాంతానికి చేరుకుని ఆ వృద్ధుడ్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. -
హ్యాట్సాఫ్.. స్టేట్‌హోం
నేడు అనాథ మహిళకు వివాహం వెంగళరావునగర్: అ అమ్మాయి ఒక అనాథ.. నగరంలోని మహిళా శిశుసంక్షేమశాఖ ప్రాంగణంలోని అనాధ ఆశ్రమానికి (స్టేట్‌హోం)లో చేరింది. ఐదేళ్ళపాటు స్టేట్‌హోంలోనే గడిపింది.. గత ఏడాది మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు ఆమెకు స్టేట్‌హోం ప్రాంగణంలో ఉన్న శిశువిహార్‌లో కేర్ టేకర్‌గా (కాంట్రాక్ట్ బేసిక్‌మీద) ఉద్యోగం ఇచ్చారు. అంతేగాకుండా ప్రస్తుతం ఆమెకు పెళ్ళి కూడా చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరులో నిశ్చితార్థం, రేపు పెళ్ళి... తల్లిదండ్రులను కోల్పోయి స్టేట్‌హోంలో చిరుద్యోగం చేస్తున్న అనాధ యువతికి గత ఏడాది డిసెంబరు 17నస్టేట్హోం అధికారులు నిశ్చితార్థం జరిపించారు. ఈనెల 26న వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. వివరాలు.. ఒంగోలు ప్రాంతానికి చెందిన నాగలక్ష్మికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతిచెందారు. తోడబుట్టిన అక్కకూడా మృతిచెందింది, సోదరుడు మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. దాంతో నాగలక్ష్మి బంధువులు 2008లో నగరానికి తీసుకువచ్చి వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయంలో అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు అదే ప్రాంగణంలోని వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ చిరుద్యోగిగా చేస్తూ జీవిస్తుంది. మూడు నెలల కిందట గుడి మల్కాపూర్‌లో నివాసం ఉండే ప్రతాప్ తాను ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టు తల్లిదండ్రులకు తెలియజేశాడు. అతని నిర్ణయాన్ని వారు స్వాగతిస్తూస్థానిక యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయానికి వచ్చారు. అధికారులు ప్రతాప్ కుటుంబ పరిస్థితిని, పూర్తి వివరాలను సేకరించి అతనికి తమ వద్ద కేర్ టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగలక్ష్మి వివరాలను తెలియజేశారు. అనంతరం అమ్మాయిని, అబ్బాయిని తమ ఇష్టాయిష్టాలను తెలుసుకుని వివాహం చేయడానికి నిర్ణయించారు. ఒకరికొకరు నచ్చడంతో గత ఏడాది డిసెంబరు 17న ఉన్నతాధికారుల సమక్షంలో ఇరువురికి నిశ్చితార్థం జరిపించారు. కాగా ఇరువురి వివాహం ఈనెల 26వ తేదీనాడు మద్యాహ్నం 12.36 గంటలకు స్టేట్‌హోంలోనే జరుపనున్నట్టు అధికారులు తెలియజేశారు. -
సొంత తల్లికన్నా ఎక్కువగా...
జాలి, దయ, కరుణ వంటి పదాలు మనుషులకు మాత్రమే వర్తించే పదాలు కాదని, జంతువుల్లో కూడ ఈ గుణాలు ఉంటాయని పలుమార్లు నిరూపితమౌతూనే ఉంటుంది. ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ చింపాంజీ విషయంలో అది మరోసారి నిజమైంది. సుమారుగా మనిషికి దగ్గరగా ఉండే పోలికలు, తెలివితేటలే కాదు వీటిలోని గుణాలుకూడా మానవులను పోలి ఉంటాయన్నది ఆస్ట్రేలియా జూలో సంఘటన ద్వారా రుజువైంది. జూలోని ఓ చింపాంజీ బిడ్డను కని చనిపోవడంతో... ఆ ఘటన చూసిన మరో గర్భవతి అయిన చింపాంజీ దాన్ని చేరదీసి అక్కున చేర్చుకోవడం... అందర్నీ ఆశ్చర్యపరచింది. మొనార్టో జూలో బూన్ పేరున పుట్టిన చింపాంజీ తన తల్లి సూనా మరణంతో అనాధగా మారింది. అయితే ఆ బిడ్డ పరిస్థితిని గమనించిన జూలోని మరో చింపాంజీ జోంబి.. దాన్ని చేరదీయడం చూపరుల గుండెను కదిలించింది. త్వరలో తనకే ఓ సొంత బిడ్డ పుట్టబోతుండగా... గర్భవతిగా ఉన్న ఓ చింపాంజీ మరో బిడ్డను పెంచుకోవడం ఇప్పటివరకూ ఎక్కడా చూడలేదని జూ.. ప్రైమేట్ కీపర్ లారా హన్లీ చెప్తున్నారు. ఎన్నో రోజులనుంచీ తాను చింపాంజీలను చూస్తున్నానని ఇటువంటి అద్భుతం ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. పుట్టిన బిడ్డను చేరదీయడమే కాక, అచ్చం మనుషుల్లాగే ఆ బిడ్డకు కావలసిన అన్ని సపర్యలూ చేస్తూ స్వంత తల్లికన్నా ఎక్కువగా లాలించడం, పాలించడం నిజంగా అద్భుతమేనని జూ క్రీపర్ తెలిపారు. ఒకేచోట నివసించే ఈ చింపాంజీలమధ్య బలమైన బంధం, అనుబంధం కలిగి ఉండటం, బాధ్యతలను పంచుకోవడం ఆశ్చర్యపరుస్తోందని హన్లీ పేర్కొన్నారు. సూనా బిడ్డను చేరదీసి పెంచుతున్న జోంబ్లీ కూడ మరో నెల తర్వాత బిడ్డకు జన్మనివ్వనుందని, అప్పుడు కూడా ఈ బిడ్డను అంతే ప్రేమతో సాకే అవకాశం ఉందని జూ సిబ్బంది ఆశావాదం వ్యక్తం చేస్తున్నారు. -
నా చెల్లి నన్ను కలిసింది...
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి... సుమారు నలభై సంవత్సరాల తర్వాత ఆ అక్కా చెల్లెళ్ళు... కలిసిన సన్నివేశం అందర్నీ అబ్బుర పరచింది. తొమ్మిదేళ్ళ వయసులో అమెరికాకు చెందిన దంపతులకు దత్తత వెళ్ళిన కొరియాకు చెందిన హోలీ ఓబ్రెయిన్... తన చిన్ననాటి సంఘటన గుర్తుకు రావడంతో ఆవేదనలో మునిగిపోయింది. తనను దత్తత ఇచ్చిన తర్వాత తన చెల్లిని సవతి తల్లి అనాథాశ్రమంలో చేర్చినట్లు ఆమెకు లీలగా గుర్తుకు వచ్చింది. ఆ జ్ఞాపకం మెదడులో కదిలిన క్షణం నుంచీ.... ఓబ్రెయిన్ మనసాగలేదు. చెల్లిని చూడాలని పరితపించి పోయింది. ఎలాగైనా ఆమె జాడ తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. తన సోదరి మేగాన్ హుఘ్స్ ను సవతి తల్లి కొరియాలోని ఓ అనాధాశ్రమంలో చేర్చినట్లుగా ఓబ్రెయిన్ కు అస్పష్టంగా గుర్తుకు వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఓ బ్రెయిన్ ను పెంచుకున్న తండ్రి... వేగంగా వెడుతున్న రైలునుంచి పడి మరణించాడు. ఆమెను చూసినవారు గుర్తించి రక్షించడంతో ఆమె బతికి బయట పడింది. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని ఓ అనాధాశ్రమంలో చేరింది. అయితే అప్పటినుంచీ ఆమె సవతి తల్లి తన సోదరిని తన నుంచీ దూరం చేసిన క్షణాలు జ్ఞప్తికి వస్తూనే ఉన్నాయి. ఓ రోజు అర్థరాత్రి నిద్రనుంచీ ఉన్నట్టుండి లేచిన ఓబ్రెయిన్ కు కళ్ళ నీళ్ళు ఆగలేదు. తన గతాన్ని తలచుకొని కన్నీరుమున్నీరైంది. ఎలాగైనా తన చెల్లిని కలుసుకోవాలన్న కోరిక ఆమెలో పెరిగిపోయింది. తనను పెంచిన తల్లిని అడిగింది. ఆమె అనాథాశ్రమంలో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయినా ఓబ్రెయిన్ కు ఎక్కడో ఆశ... తన చెల్లి ఎక్కడో బతికే ఉంది. తనకెప్పటికైనా కనిపిస్తుందన్న నమ్మకంతో ఆమె జాడకోసం ప్రయత్నాలు కొనసాగించింది. చెల్లిని.. అమ్మను అనాథాశ్రమం దగ్గరే చివర్లో చూశాను. ఎలాగైనా ఆమె వివరాలు తెలుసుకోవాలని వార్తా పత్రికలకు కూడ సమాచారం ఇచ్చింది. దీంతో కొరియాలోని అనాథాశ్రమాల్లో వివరాలు సేకరించిన ప్రతినిధులు.. హుఘ్స్ ను కూడా అనాథాశ్రమం నుంచీ ఓ అమెరికన్ దంపతులు పెంపకానికి తీసుకున్నారని, వారు న్యూయార్క్ లో ఉంటారని తెలిపారు. ఓబ్రెయిన్ ఈ సంవత్సర ప్రారంభంలో బే ఫ్రంట్ హెల్త్ పోర్ట్ ఛాలెట్ అనే వైద్య విభాగంలో ఉద్యోగానికి చేరింది.మరో మూడు నెలల తర్వాత హుఘ్స్ కూడా అక్కడే ఫిజికల్ థెరపీ అసిస్టెంట్ గా చేరింది. సుమారు నలభై ఏళ్ళ క్రితం కొరియాలో విడిపోయిన ఆ ఇద్దరు అనాధలు ఒకే ఆస్పత్రిలో... ఒకే ఫ్లోర్ లో ఉద్యోగానికి చేరారు. ఒకే షిఫ్టులో కూడ పనిచేస్తున్నారు. కానీ ఒకరికి ఒకరు పరిచయం లేదు. అక్కాచెల్లెళ్ళేనని అస్సలు తెలియదు. అయితే ఓ రోజు ..ఓ పేషెంట్ కొరియాకు చెందిన మరో నర్స్ ఇక్కడ పని చేస్తోందని... బహుశా మీరిద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు అయి ఉండొచ్చని చెప్పింది. విషయం తెలిసిన వెంటనే ఓబ్రెయిన్ ఉత్సాహంగా ఆమెను కలిసేందుకు ప్రయత్నించింది. వివరాలు సేకరించింది. తెలిసిన వివరాలను బట్టి అక్కాచెల్లెళ్ళేనని నిర్థారణ అయింది. వారిద్దరూ అక్కాచెల్లెళ్ళేనని డీఎన్ ఏ టెస్టులు కూడా ధృవీకరించాయి. అనుమానం తీర్చుకొనేందుకు మరోసారి ల్యాబ్ టెస్టులను చెక్ చేసుకుంది. ''దేవుడు ఇంతటి అదృష్టాన్నిస్తాడని అనుకోలేదు. నా చెల్లి నన్ను కలిసింది. నాకు జీవితంలో కావాల్సింది ఏముంది? ఇప్పుడు నాకు పిల్లలు లేకపోయినా... నా చెల్లికి ఇద్దరు పిల్లలున్నారు. మేమంతా సెలవుల్లో సంతోషంగా గడుపుతాం..'' అంటూ ఓ బ్రెయిన్ ఆనంద భాష్పాలను తుడుచుకూంటూ... చెల్లి హుఘ్స్ ను గట్టిగా హగ్ చేసుకుంది. -
ఇప్పుడు ఆ పాప అనాథ కాదు
ఈస్ట్ సింగ్బమ్ (జార్ఖండ్): ఆమె వయసు 11 ఏళ్లు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. పొట్ట పోసుకోడానికి అడవి నుంచి కట్టెలు సేకరించి.. వాటిని అమ్ముకుంటోంది. అయినా.. ఒక్క రోజు కూడా స్కూలుకు డుమ్మా కొట్టలేదు. తన చదువు కొనసాగిస్తూనే ఉంది. జార్ఖండ్‌లోని ఈస్ట్ సింగ్బమ్ జిల్లాలో ఘట్శిలా సబ్ డివిజన్ పరిధిలోని డుమురియా బ్లాక్‌కి 12 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్న అష్టక్వలి ప్రాంతంలో సోంబరి ఇల్లు ఉంది. ఆ ఇంటికి కరెంటు సౌకర్యం కూడా లేదు.. కనీసం కిరోసిన్ దీపం కొనుక్కునే స్థోమత కూడా ఆమెకు లేదు. 'సోంబరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. ఆమె తండ్రి రతన్ కూడా నెల రోజుల క్రితం చనిపోయాడు. బంధువులెవరూ ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతలు స్వీకరించలేదు. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఒంటరిగానే ఉంటూ ఐదో తరగతి చదువుతోంది. కష్టపడి పని చేసుకుంటూ కూడా ఒక్క రోజూ స్కూల్ మిస్సయేది కాదు' అని ఆ చిన్నారి చదువుకుంటున్న స్కూల్ టీచర్ అనిల్ రాయ్ తెలిపారు. సోంబరి పరిస్థితి గురించి తెలిసిన పలు స్వచ్ఛంద సంస్థలు ఆమెకు ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చాయి. టాటా స్టీల్, ఆనంద్ మార్గ్ ఆశ్రమ్ వాళ్లు సోంబరిని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. జంషెడ్‌పూర్‌లోని సిండికేట్ బ్యాంకు ఉద్యోగి, ఘట్సిలాలో టీచర్ దంపతులు కూడా సోంబరిని దత్తత తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారని.. దుమురియా బీడీఓ మృత్యుంజయ్ కుమార్ చెప్పారు. అన్ని దరఖాస్తులను జిల్లా ఉన్నత అధికారులకు పంపామన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి తన తండ్రి మరణించి నెల కావస్తుండటంతో కర్మకాండ నిర్వహించే పనిలో ఉంది. తనను విద్యావంతురాలిగా చూడాలనేది తన తండ్రి కోరిక అని సోంబరి చెప్పింది. వంటచెరకు, విస్తరాకులకు ఉపయోగించే ఆకులను అడవి నుంచి సేకరిస్తున్నానని, దీంతో కర్మకాండల సమయంలో కూడా వంటచెరకు, విస్తరాకులకు లోటు లేదని ఆ చిన్నారి చెబుతోంది. -
ఆ నలుగురు !
బంధాలు, బంధుత్వాలు ఉన్న వారు మరణిస్తే వారి అంత్యక్రియలు బంధువులు, కుటుంబ సభ్యులు చేస్తారు. ఇది సాధారణం. మరి ఎలాంటి ఆదరణా లేకుండా.. అభాగ్యులుగా ఉండి చనిపోతే పరిస్థితి ఏమిటి ? భౌతిక కాయాన్ని ఎవరు తీసుకెళతారు..? అంత్య క్రియలు ఎవరు చేస్తారు ? అంతిమ సంస్కారాలు నిర్వహించేదెవరు ? మృతులెవరో తెలియకుండా బరువు మోసేది ఎవరు..? ఈ ప్రశ్నలకు సమాధానం ఆ నలుగురు. చిత్తూరులో ఓ మహిళ, మరో ముగ్గురు కలిసి చేస్తున్న సేవల కథాంశం ఈ ఆదివారం ప్రత్యేకం... -చిత్తూరు (అర్బన్) చనిపోయింది ఎవరో తెలియదు. ఎలాంటి బంధుత్వమూ ఉండదు. అయితేనేం.. మేమున్నామంటూ ఒకటవుతారు. చనిపోయిన అనాథలు, అభాగ్యులకు దగ్గరుండి అంత్యక్రియలు చేస్తారు. అది కూడా తమతో బాగా కలిసిమెలిసి.. పరి చయమున్న వ్యక్తే చనిపోయినట్లు భావించి వారి ఆత్మ సైతం ఆనందపడేలా చేస్తారు. వాళ్లే చిత్తూరు నగరానికి చెందిన కంద, ధనలక్ష్మి, రామభద్ర, మధుబాబు. ఈ నలుగురి వృత్తులు వేర్వేరు. వీరితో పాటు రవీంద్రారెడ్డి, శిఖామణి, మురుగ, షణ్ముగం, వినాయగం, రమేష్ తదితరులు అందరూ ఒక్క చోటుకు చేరి ‘మాతృసేవా సమితి’ పేరిట ఓ చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనాథగా మృతిచెందిన వారిని గుర్తించి అంత్యక్రియలు చేయడమే వీరు ప్రవృత్తిగా చేసుకున్నారు. సంతపేటలో అనాథ శవాన్ని ఉంచి సొంత బంధువులా అంతిమ వీడ్కోలు పలికి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ధనలక్ష్మి: బజారువీధిలో ఉన్న వినాయకుని గుడి పక్కనున్న సందులో పూల వ్యాపారం చేస్తుంటుంది. తొలుత కంద చేస్తున్న సేవలు విని తానూ అనాథ శవాల అంత్యక్రియల్లో పాలు పంచుకోవాలని సంకల్పించింది. అంత్యక్రియలకు, మృతదేహాన్ని తీసుకెళ్లే బండిని అలంకరించడానికి ఆమె పూలు ఇస్తున్నారు. ఇంకా అత్యక్రియలకు అవసరమైన మేరకు సాయపడుతున్నారు. రామభద్ర: చనిపోయిన వారిని కొద్ది సేపు సంతపేటలోని మాతృ సేవా సమితి కార్యాలయం వద్ద ఉంచుతారు. స్థానికులు ఇక్కడికి వచ్చి మృతదేహం వద్ద నివాళులర్పిస్తారు. వాన, ఎండలో భౌతికకాయానికి ఎలాంటి ఆటంకం కలగకుండా రామభద్ర చర్యలు తీసుకుంటారు. తాను వ్యాపారానికి ఉంచుకునే షామియానాను మాతృసేవా సమితి కార్యాలయం వద్ద కాసేపు వేసి నలుగురికీ నీడ కల్పిస్తుంటారు. మధుబాబు: మృతదేహానికి సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లలో మధుబాబు ముందుంటారు. మహిళ చనిపోతే చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ అందిస్తారు. పురుషులు చని పోతే పంచె, చొక్కా ఇతర వస్తువులు ఉచితంగా అందజేసి తోడ్పాటునిస్తున్నారు. కంద: చిత్తూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కరుణాకర్ అనే కంద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. నగరంలో ఎక్కడ అనాథ శవం కనిపించినా సమాచారం కంద సెల్‌ఫోన్ (నెంబర్ -9391665281)కు వచ్చేస్తుంది. ఇలా ఫోన్ రాగానే అనాథ శవాన్ని ఓ బండిలో ఉంచుకుని పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. దాదాపు దశాబ్దకాలంగా ఆయన చేస్తున్న సేవలకు స్నేహితులు, చుట్టుపక్కల వారు చేతులు కలిపారు. అనాథ శవాల అంత్యక్రియలకు తోచిన రీతిలో ఒక్కొక్కరు చేయూత అందిస్తున్నారు. -
అనగనగా ఓ అనాథ
ఆ చిన్నారి ఊహ తెలియని వయస్సులోనే తండ్రి మరణించాడు. తల్లి కూతురిని వదిలి ఎక్కడికి వెళ్లిందో తెలియదు. పసిపాపను ఒంటరిగా చూడ లేక మనస్సు చలించిన ఆ ఊరి ఆర్ఏంపీ ఆమెను ఓ ట్రస్టులో చేర్పించాడు. నా అన్న వారు లేని ఆ అమ్మాయి ట్రస్టులోనే కష్టపడి చదివింది.ఆపై పై చదువులు కూడా ఆనాథ శరణాయాల్లోనే అభ్యసించింది. ప్రస్తుతం పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించింది. పన్నెండేళ్ల క్రితం తాను చదువుకున్న ప్రాంతానికే పోలీసుగా వచ్చింది. సిరిసిల్లలోనే విధులు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. -సిరిసిల్ల రూరల్ సిరిసిల్ల రూరల్: బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన మొగిలి శిరీష నా అన్న వారు లేక ఆనాథగా సిరిసిల్ల మండలం రగుడులోని రంగినేని సుజాతమోహన్‌రావు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టులో 2002లో చేరింది. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అక్కడే చదివింది. 2007లో పై చదువుల కోసం ట్రస్టు నిర్వాహకుల సాయంతో హైదరాబాద్‌లోని సెంటల్ ఫర్ సోషల్ స్టడీస్‌కు వెళ్లింది. అక్కడ సెంటర్ నిర్వాహకురాలు వేమూరి విజయలక్ష్మి సాయంతో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో విజయలక్ష్మి సూచనతో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. అన్ని టెస్టులో ఉత్తీర్ణురాలై 2014లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించింది. గత నెలలో అప్పాలో విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకుంది. మొదటి పోస్టింగ్ తాను చిన్నతనంలో ఆనాథగా చదువుకున్న ప్రాంతమైన సిరిసిల్లోనే రావడం కాకతాళీయంగా జరిగిపోయింది. విధుల్లో చేరడంతోనే రంగినేని ట్రస్టుకు వెళ్లి తన గురువులను కలిసింది. చిన్నప్పటి నుంచి తనను పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన మోహన్‌రావు తాతయ్యను కలసి ఉద్యోగం వచ్చిన విషయం చెప్పడంతో ట్రస్టు చిన్నారులు అభినందనలు తెలిపారు. విధి వంచితురాలై ఇక్కడి ట్రస్టులోనే చదువుకొని.. ఉద్యోగం సాధించి.. సిరిసిల్లలోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంతో పలువురికి శిరీష ఆదర్శంగా నిలుస్తోంది. అనాథలకు అండగా ఉంటా : శిరీష నేను ఒక ఆనాథగా విద్యనభ్యసించి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి సిరిసిల్లలోనే విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. నాలాంటి ఆనాథలకు నా వంతు సాయం అందిస్తా. పోలీసుగా ప్రజాసేవలో ముందుంట. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూనే ఎంబీఏ చదువుతున్న. ఆపైన కూడా ఉన్నత విద్య అభ్యసిస్తూనే గ్రూప్స్‌కు ప్రిపేర్ కావాలనేది నా లక్ష్యం. కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో నా కళ్లపై నేను నిలబడటమే కాకుండా.. ఇతరుకు సైతం అండగా నిలబడే గుండెధైర్యం వచ్చింది. నాకు చదువు నేర్పించి, ప్రయోజకురాలిని చేసిన మోహన్‌రావు తాతయ్యకు జీవితాంతం రుణపడి ఉంటాను. -
బాల్యం బందీ
విధి.. ఊహ తెలియని వయసులోనే అమ్మానాన్నలను దూరం చేసింది. అందరూ ఉన్నా అనాథగా మిగిల్చింది. పలకాబలపం పట్టాల్సిన ఆ చిట్టిచేతులతో చీపురును పట్టి పాచిపనులు చేసింది. పొద్దస్తమానం పనిచేస్తే మూడుపూటల పట్టెడన్నం చాలనుకుంది. ఆకలి కోసం ఆ పసిహృదయం క్షోభకు గురైంది. పనిలో కుదుర్చుకున్న యజమానులు చిత్రహంసలకు గురిచేసినా చిలుకలా పంజరంలోనే బందీగా మారింది. బయటికెళ్తే చంపుతానని బెదిరిస్తే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపింది. ఎలాగోలా వారి చెరవీడి పోలీసుల చెంతకు చేరింది. సీఐ చొరతో బాలసదన్‌కు చేరింది. షాద్‌నగర్ రూరల్: ఆడిపాడి చదువుల ఒడిలో సేదతీరాల్సిన ఓ చిట్టితల్లిని ఇంటి యజమానులు బంధించారు. బయటి ప్రపంచాన్ని చూడకుండా చేసింది. ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం మేరకు.. పోమాలపల్లి గ్రామానికి చెందిన జంగయ్య, రాములుమ్మకు ఒక్కగానొక్క కూతురు మహాలక్ష్మి(12). చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. మూడేళ్లక్రితం పక్షవాతంలో తల్లి మృతి చెందింది. దీంతో మహాలక్ష్మి అనాథగా మారింది. చిన్నారిలో చదువుకోవాలనే తపనను గ్రహించిన పాఠశాల ఉపాధ్యాయుడు మహాలక్ష్మిని వసతిగృహంలో చేర్పించాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ షాద్‌నగర్‌లోని విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న దమయంతి, జయకిషన్ ఇంట్లో పనిచేయడానికి బేరం కుదిర్చింది. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆ యజమానులు ఆ చిన్నారిని చిత్రహింసలకు చేసింది. వారు బయటకు వెళ్లే సమయంలో ఆ చిన్నారిని ఇంట్లోనే ఉంచి బయటనుండి తాళంవేసుకుని వెళ్లేవారు. పస్తులుండకుండా మూడుపూటల పట్టెడన్నం దొరికెతే చాలనుకున్న ఆ చిన్నారికి రోజుకు ఒకపూట మాత్రమే అన్నంపెట్టి పనిచేయించుకునేవారు. ఇక్కడి విషయాలు బయటకు చెప్పినా నిన్ను చంపుతామని బెదిరించేవారు. శనివారం రాత్రి ఎలాగైనా ఇక్కడనుండి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసింది. అక్కడినుండి తప్పించుకున్న మహాలక్ష్మి రాత్రి 9గంటల సమయంలో పటేల్‌రోడ్‌లో ఉన్న తన బంధువుల వద్దకు వెళ్లింది. తీరా అక్కడకు వెళ్లాక బంధువులు నెలరోజుల క్రితమే ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయారని తెలిసింది. చిరిగిన బట్టలతో వెళ్తున్న మహాలక్ష్మిని కాలనీకి చెందిన లక్ష్మి అనే మహిళ చేరదీసింది. ఆదివారం లక్ష్మి అసలు విషయం బయటకు చెప్పింది. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ పట్టణ సీఐ నిర్మల ఆ చిన్నారిని చేరదీసి.. జిల్లాకేంద్రంలోని బాలసదన్‌లో చేర్పించారు. ఈ విషయాన్ని కార్మికశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
అ..ఆ..లు దిద్దాలి అనే తపన "అనాధ"ను బతికించించి