
న్యూఢిల్లీ: బ్యాంక్ డిపాజిట్‌దారుడు ప్రస్తుతం రూ. లక్ష వరకూ మాత్రమే తన డిపాజిట్‌కు రక్షణ పొందగలుగుతాడు. ఇందులో ఎటువంటి మార్పూ లేదు. బ్యాంక్‌లో వేసే డిపాజిట్లపై బీమా పెంపు సమాచారం ఏదీ తమకు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుబంధ విభాగం డీఐసీజీసీ(డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్) స్పష్టంచేసింది. ప్రస్తుతం బ్యాంక్ డిపాజట్లపై బీమా రక్షణ రూ. లక్ష వరకూ ఉంది. అయితే ఈ బీమా రక్షణను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని గతనెల్లో ఆరి్థకశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందనీ సూచించారు. వ్యక్తిగత డిపాజిట్లకు సంబంధించి రూ. 5 లక్షల వరకూ బీమా పెంపు నిర్ణయం తీసుకోవాలని శంకర భారతీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన డిమాండ్ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. శంకర్ భారతీ ఆఫీస్ బేరర్లలో పలువురు ఆర్‌ఎస్‌ఎస్‌కు దగ్గరివారు కావడం గమనార్హం.
ఆర్‌టీఐ కింద డీఐసీజీసీ సమాచారం...
సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వచి్చన ఒక దరఖాస్తుకు డీఐసీజీసీ సమాధానం ఇస్తూ, ‘‘బీమా పెంపునకు సంబంధించిన సమాచారం ఏదీ కార్పొరేషన్‌కు చేరలేదు’’ అని తెలిపింది. డీఐసీజీసీ చట్టం, 1961 సెక్షన్ 16 (1) ప్రకారం దివాలా చర్యల కిందకు వెళ్లిన బ్యాంక్‌కు సంబంధించిన ఒక డిపాజిట్‌దారునకు అసలు, వడ్డీతో కలిపి రూ. లక్ష వరకే బీమా ఉంటుంది. అంటే రూ.లక్షలోపు డిపాజిట్‌దారు తన సొమ్మును పూర్తిస్థాయిలో పొందగలుగుతాడు. రూ. లక్ష పైన ఎంత డిపాజిట్ ఉన్నా... సంబంధిత డిపాజిట్ దారుకు రూ. లక్ష మొత్తమే బీమా కింద అందుతుంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ ఏరియా బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ బ్రాంచీలుసహా అన్ని కమర్షియల్ బ్యాంకులకు కార్పొరేషన్ నుంచి బీమా కవరేజ్ ఉంటుంది. పలు బ్యాంకులు తీవ్ర మోసాల్లో ఇరుక్కుంటూ, ప్రజల పొదుపులను ఇబ్బందుల్లోకి నెడుతున్న నేపథ్యంలో తాజా అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎంసీ బ్యాంక్ ఇటీవలే ఈ తరహా ఇబ్బందుల్లోకి జారిన విషయం ఇక్కడ గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment