అనంతపురం సెంట్రల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారించాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేయాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు, నేరాలకు సంబంధించిన కారణాలను సమీక్షించిన ఆయన మరోవారం రోజుల పాటు స్పెషల్‌డ్రైవ్ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు చేపట్టే తనిఖీలు, చర్యలను వివరిస్తూ ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నంబర్‌లేని ద్విచక్రవాహనాల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. త్రిబుల్‌రైడింగ్‌కు పాల్పడితే కేసులు నమోదు చేయాలన్నారు. నాలుగు చక్రాల వాహనాల్లో తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని, అధిక లోడ్‌తో వెళ్లే వారికి కౌన్సెలింగ్ చేయాలని ఆదేశించారు.
గత పది రోజులుగా జిల్లాలో చేపడుతున్న స్పెషల్‌డ్రైవ్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందన్నారు. మొత్తం 37,266 వాహనాలను తనిఖీ చేశారని, ఇందులో 10,244 మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు లేవని గుర్తించినట్లు తెలిపారు. వీరికి కౌన్సెలింగ్‌తో పాటు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 4,055 ట్రాక్టర్ ట్రాలీలకు రేడియం స్టిక్కర్లు అతికించామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 6,611 మంది ద్విచక్రవాహనదారులపై కేసు నమోదు చేశామన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
Published Sun, Jul 30 2017 10:32 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement